రజనీకాంత్ ‘కూలీ’ మూవీపై సినీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. రజినీ మాస్ అండ్ పవర్‌ఫుల్ డైలాగులతో మూవీ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. నాగార్జున కీలక పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. ఇక ఇప్పటికే వైరల్ అయిన పూజా హెగ్డే -సౌబిన్ షాహిర్ ‘మోనికా’ సాంగ్‌కు థియేటర్లలో పూనకాలేనని అంటున్నారు. ఇక సెకెండ్ హాఫ్‌లో కొన్ని సీన్లు నిరుత్సాహ పరుస్తాయని అంటున్నారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
ప్రతి సినిమాకు భయపడతాను: ఆమిర్ ఖాన్
తాను ప్రతి సినిమాకు భయపడతానని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ వెల్లడించారు. జవాన్‌లతో కలిసి ‘సితారే జమీన్ పర్’ సినిమా చూసిన సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. తనకు రిస్క్ ఉన్న సినిమాలను అంగీకరించడం అలవాటైందని, అందుకే ప్రతి ప్రాజెక్ట్‌కు భయం ఉంటుందని తెలిపారు. ఈ భయమే తనను మరింత కష్టపడేలా చేస్తుందని పేర్కొన్నారు.
-
‘వార్2’ ట్విట్టర్ రివ్యూ ఇదే
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ‘వార్2’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది. సినిమాలో యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని కామెంట్స్ చేస్తున్నారు. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కూడా నెక్ట్స్ లెవల్లోనే ఉందని అంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుందని అంటున్నారు. ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరూ పోటాపోటీగా నటించారని చెబుతున్నారు. అయితే కొన్ని VFX సీన్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవని, కొన్ని సీన్లు మరీ ల్యాగ్ చేశారంటున్నారు.
-
‘వార్2’పై NTR ఆసక్తికర ట్వీట్
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన ‘వార్2’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనిపై ఎన్టీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘ఇది యుద్ధం. ఈరోజు థియేటర్లలో మారణహోమం జరుగుతుంది. వార్ 2 సినిమా గురించి గర్వంగా ఉంది. ఈ ఎంటర్‌టైనర్‌పై మీ రియాక్షన్స్ చూసేందుకు వేచి ఉండలేను. మీకు దగ్గరలో ఉండే హిందీ, తెలుగు, తమిళ భాషల్లో టికెట్ బుక్ చేసుకుని చూసేయండి’’ అని పేర్కొన్నారు.
-
మరో ఖరీదైన కారు కొన్న స్టార్ హీరో!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తాజాగా మరో హై ఎండ్ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ప్రముఖ షెవర్లే కంపెనీకి చెందిన ‘కార్వెట్ సీ8-జడ్06’ కారును దాదాపు రూ.1.40 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ సూపర్‌కారును దుబాయ్‌లోని షోరూమ్ నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
-
‘పరదా’లు అమ్ముకుంటున్న హీరోయిన్!
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘పరదా’. ఈనెల 22న విడుదలకానుంది. ఈనేపథ్యంలో మూవీ ప్రమోషన్లతో అనుపమ ఫుల్ బిజీగా ఉంది. ఇందులో భాగంగా తన సినిమా కోసం ఆమె వైజాగ్‌లో ఏకంగా రోడ్డుపై మైక్ పట్టుకుని ప్రచారం చేసింది. ‘‘పరదాలమ్మా.. పరదాలు.. రంగురంగుల పరదాలు.. తీసుకోవాలమ్మా.. తీసుకోవాలి’’ అంటూ కారులో నిలబడి ప్రమోట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.
-
‘SSMB29’పై మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్!
మహేశ్‌బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో ‘SSMB29’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా షూటింగ్‌పై మరో అప్‌డేట్ వచ్చింది. ఈ మేరకు నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్ చాలా సంతృప్తికరంగా ఉంది. తదుపరి షెడ్యూల్ నైరోబి, టాంజానియాలో ప్లాన్ చేశారు’’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరలవుతోంది.
-
కింగ్ నాగ్‌తో శ్రుతిహాసన్ స్పెషల్ చిట్‌చాట్
రజనీకాంత్ నటించిన ‘కూలీ’ కోసం తలైవా అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఇందులో నాగార్జున (సైమన్), శ్రుతిహాసన్ (ప్రీతి) పాత్రలు పోషించారు. మరికొన్ని గంటల్లో ఈ చిత్రం థియేటర్‌లలో సందడి చేయనుంది. ఈనేపథ్యంలో కింగ్ నాగార్జునతో హీరోయిన్ శ్రుతిహాసన్ స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఇందులో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
-
పైరసీ చేస్తే మాకు తెలుపండి: ఎన్టీఆర్, హృతిక్
హృతిక్ రోషన్-ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా ‘వార్ 2’. ఈ మూవీ గురువారం విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. పైరసీని ప్రోత్సహించొద్దని ఈ ఇద్దరు హీరోలు విజ్ఞప్తి చేశారు. ‘వార్ 2’ పైరసీ కనిపిస్తే reportpiracy@yashrajfilms.com ద్వారా తమకు తెలియజేయాలని కోరారు. (వీడియో)