Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ఈవెంట్‌లో కన్నీళ్లు పెట్టుకున్న అనుపమ!

    హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తున్న పరదా మూవీ ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఇటీవల విజయవాడలో జరిగిన ‘పరదా’ ప్రమోషన్ ఈవెంట్‌లో అనుపమ కన్నీళ్లు పెట్టుకుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని పూర్తి చేసిన సినిమా ‘పరదా’. దయచేసి ఈ సినిమాకు సపోర్ట్‌ చేయండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

  • సెప్టెంబర్‌లో రాబోతున్న ‘భద్రకాళి’!

    విజయ్ ఆంటోని హీరోగా అరుణ్‌ప్రభు తెరకెక్కిస్తున్న చిత్రం ‘భద్రకాళి’. ఈమూవీ సెప్టెంబర్ 19న రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా ప్రకటించారు.

  • Video: ‘పుష్ప-2’ పాటకు బాలయ్య మాస్ స్టెప్పులు!

    తను నటించిన ‘పుష్ప-2’ సినిమాలో అల్లు అర్జున్ అందరినీ అబ్బురపరుస్తూ ‘జాతర’ సాంగ్‌తో దుమ్ములేపేశాడు. అయితే ఇప్పుడు ఈ పాటకు నందమూరి బాలకృష్ణ తనదైన స్వాగ్‌తో స్టెప్పులు వేశాడు. మాల్దీవుల్లో జరిగిన ఓ ఫ్యామిలీ సంగీత్‌ వేడుకలో బాలయ్య ‘పుష్ప-2’ జాతర సాంగ్‌కు చిందులేశారు. ఆయనతో పాటు అల్లు అరవింద్ కూడా ఉన్నారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

  • పని విధానాలకు అంగీకరిస్తే వేతనాల పెంపునకు సుముఖం: దిల్‌రాజు

    సినీకార్మికుల వేతనాల పెంపు అంశం ఇంకా కొలిక్కి రాలేదని నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు తెలిపారు. పని విధానాలకు అంగీకరిస్తే వేతనాలు పెంచేందుకు నిర్మాతలు సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. రూ.2వేలలోపు ఉన్న కార్మికుల వేతనం పెంపునకు ఒక విధానం.. రూ.30వేలకు పైగా తీసుకుంటున్న వారికి మరో విధానం అమలు, ఆదివారం, 9-9 కాల్షీట్‌ అంశంపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.

  • హాట్ లుక్‌తో ఆకట్టుకుంటోన్న ప్రగ్యా

    హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ వెరైటీ డ్రెసెస్‌తో కుర్రకారును ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలో బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి స్టైలీష్‌గా కనిపించింది.

  • దయచేసి ఆ రూమర్స్ నమ్మకండి: శ్రీలీల

    రీసెంట్‌గా విడుదలైన ‘సైయారా’ చిత్రంలో హీరోయిన్‌ ఆల్జిమర్‌ వ్యాధితో బాధపడుతుంటుంది. అక్కడ్నుంచే కథ మలుపు తిరుగుతుంది. అయితే ప్రస్తుతం శ్రీలీల నటిస్తున్న ‘ఆషికీ 3’ కథ కూడా దాదాపు ఈ తరహాలోనే సాగుతుందని ఓ రూమర్ నెట్టింట షికార్లు చేస్తోంది. దీనిపై తాజాగా శ్రీలీల స్పందించింది. “సైయారా’కూ మా సినిమాకూ ఏ సంబంధమూ లేదు. అవన్నీ రూమర్లు. దయచేసి వాటిని నమ్మకండి’’ అంటూ చెప్పుకొచ్చింది.

  • ఆసక్తిగా ‘త్రిబాణధారి బార్బరిక్‌’ ట్రైలర్‌

    సత్యరాజ్‌, ఉదయభాను, వశిష్ఠ ఎన్‌.సింహ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘త్రిబాణధారి బార్బరిక్‌’. మోహన్‌ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

  • ‘కూలీ’ నుంచి ‘I Am The Danger’ సాంగ్

    లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం ‘కూలీ’. ఇందులో నాగార్జున విలన్ పాత్ర పోషించారు. రేపు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నాగార్జునకు సంబంధించిన ‘I Am The Danger’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.

  • వారికి హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్!

    ‘వార్-2’ రేపు రిలీజ్ కాబోతున్న క్రమంలో హీరోలు హృతిక్ రోషన్-ఎన్టీఆర్‌‌లు అభిమానులకు, స్పాయిలర్‌లకు ఓ రిక్వెస్ట్‌ చేశారు. ‘‘వార్ 2’ సినిమాను ఎంతో ప్రేమతో, ఎంతో కష్టపడి తెరకెక్కించాం. ఈ సినిమాటిక్ దృశ్యాన్ని ఎక్స్ పీరియెన్స్ చేయడానికి అందరూ థియేటర్లలోనే సినిమాను చూడండి. దయచేసి సినిమాలోని సీక్రెట్లు, ట్విస్ట్‌లను రివీల్ చేయకండి.. స్పాయిలర్‌లను ఆపండి.. ఇది మీడియా, ప్రేక్షకులు, అభిమానులను మేం రిక్వెస్ట్ చేస్తున్నాము’ అని అన్నారు.

  • ‘మహావతార్: నరసింహ’ వసూళ్ల గర్జన!

    ‘మహావతార్: నరసింహ’ సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా భారీ వసూళ్లు రాబడుతోంది. నార్త్ అమెరికాలో ప్రస్తుతానికి 1.35 మిలియన్ డాలర్స్ మార్క్‌ను అందుకొని అదరగొట్టినట్లు తెలుస్తోంది.