Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘కూలీ’ పారితోషికం.. ఎవరికెంతంటే?

    దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన రజనీకాంత్ ‘కూలీ’ మూవీ రేపు విడుదలకానుంది. అయితే ఇందులో నటించిన స్టార్స్‌కు ఎవరికెంత పారితోషికం ఇచ్చారనేది తెలుసుకుందాం.

    • రజనీకాంత్‌-రూ.150 కోట్లు
    • డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్-రూ.50 కోట్లు
    • నాగార్జున- రూ.20-24 కోట్లు
    • ఆమిర్ ఖాన్‌కి-రూ.20 కోట్లు
    • శ్రుతి హాసన్‌-రూ.4 కోట్లు
    • అనిరుధ్‌-రూ.15 కోట్లు
    • సత్యరాజ్, ఉపేంద్ర-తలో రూ.5 కోట్లు

  • ‘పార్కింగ్‌’ దర్శకుడితో ‘చియాన్‌ 65’

    తమిళ హీరో విక్రమ్‌ తన 65వ ప్రాజెక్ట్‌పైనా చర్చలు మొదలైనట్లు తెలుస్తోంది. ‘పార్కింగ్‌’ సినిమా దర్శకుడు రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌.. విక్రమ్‌తో ఓ సినిమా చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇదే చియాన్‌ 65వ చిత్రంగా పట్టాలెక్కనున్నట్లు తెలిసింది. ఈ ఏడాది చివర్లో దీనిపై ప్రకటన వెలువడే అవకాశముంది.

  • హీరోయిన్ నిధి అగర్వాల్‌కు ప్రభాస్ సర్‌ప్రైజ్!

    ‘ది రాజాసాబ్‌’ సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తున్న హీరోయిన్ నిధి అగర్వాల్‌కు ప్రభాస్ ఇంటి నుంచి భోజనం పంపించి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆంధ్ర వంటకాలను పంపినందుకు ఆమె సోషల్ మీడియాలో ప్రభాస్‌కు, ఆయన పెద్దమ్మ శ్యామలాదేవికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహిస్తుండగా, నిధి అగర్వాల్‌తో పాటు రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది.(వీడియో)

  • ఓటీటీలోకి వచ్చిన వణుకుపుట్టించే సిరీస్

    ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఓ క్రేజీ సిరీస్ తెలుగు వెర్షన్.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ‘ఏలియన్:ఎర్త్’ అనే హాలీవుడ్‌ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతానికి రెండు ఎపిసోడ్స్‌ను హాట్‌స్టార్‌లో రిలీజ్ చేశారు. విజువల్స్, స్టోరీ టెల్లింగ్ అదిరిపోయిందని రివ్యూలు కూడా వస్తున్నాయి.

  • ‘ఆయనకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా’

    లోకేశ్‌ కనగరాజ్‌-రజనీకాంత్ కాంబోలో తెరకెక్కిన ‘కూలీ’ మూవీ రేపు విడుదలకానుంది. ఈ నేపథ్యంలో లోకేశ్‌ ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ‘‘నా సినీప్రయాణంలో ‘కూలీ’కి ఎప్పుడూ ప్రత్యేకస్థానం ఉంటుంది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి, దీనిపై ఇంత మంది ప్రేమ చూపించడానికి కారణం తలైవానే. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా’’ అని తెలిపారు.

  • హైకోర్టులో ‘రాజాసాబ్‌’ మూవీపై పిటిషన్‌!

    ప్రభాస్‌ నటిస్తున్న ‘రాజాసాబ్‌’ మూవీపై వివాదం నెలకొంది. ఈ సినిమాను నిర్మిస్తున్న పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై IVY సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ‘‘‘రాజాసాబ్‌’ కోసం రూ.218 కోట్లు పెట్టుబడి పెట్టాం. కానీ ఈమూవీ అప్‌డేట్ మాకు ఇవ్వడంలేదు. పదేపదే సినిమా వాయిదా వేస్తున్నారు. 18శాతం వడ్డీతో కలిపి మా పెట్టుబడి చెల్లించాలి. అప్పటివరకు ఈ సినిమాపై PMFకు ఎలాంటి హక్కులు ఉండవు’’ అని పేర్కొంది.

  • ‘తలైవా’కు హృతిక్‌ రోషన్‌ విషెస్!

    ‘అపూర్వ రాగంగల్‌’తో రజనీకాంత్‌ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 1975 ఆగస్టు 15న ఈ సినిమా విడుదలైంది. మరో 2రోజుల్లో దీనికి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. పలువురు స్టార్స్ తలైవాకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘‘నటుడిగా నేను మొదటి సినిమా మీతోనే చేశా. నా గురువులలో మీరూ ఒకరు. ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతున్నందుకు ధన్యవాదాలు’’ అని బాలీవుడ్ హీరో హృతిక్‌ రోషన్‌ తెలిపారు.

  • అన్నపూర్ణ స్టూడియోస్‌కు 50 ఏళ్లు

    అన్నపూర్ణ స్టూడియోస్‌ ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తయ్యాయి. దివంగ‌త న‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు ఆగస్టు 13, 1975న ఈ స్టూడియోకు పునాది వేశారు.  రోడ్లే లేని రోజుల్లో  నాగేశ్వ‌ర‌రావు ఇక్కడికివచ్చి ఇంతపెద్ద స్టూడియోను  నిర్మించడం జరిగింది.  ఎంతో మంది టెక్నీషియన్స్, కొత్త నటీనటులు, కొత్త దర్శకులకు ఇది ఉపాధి కల్పించింది.

     

  • పవన్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్!

    పవన్‌‌కళ్యాణ్‌-త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘జల్సా’ను 4కేలో రీ-రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. పవన్‌ బర్త్‌ డే సెప్టెంబర్ 2న స్పెషల్‌ షోలు వేస్తున్నట్లు పోస్టర్ వదిలారు.

  • KBCలో పాల్గొన్న భారత సైనిక మహిళాధికారులు

    ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) 17 కార్యక్రమంలో, సినీ నటుడు అమితాబ్ బచ్చన్ సైనిక మహిళలైన కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కమాండర్ ప్రేరణ దేవస్థలీలకు ఆతిథ్యం ఇచ్చారు. వీరు ఇద్దరు ‘ఆపరేషన్ సిందూర్‌’లో భారతదేశం తీసుకున్న చర్యల గురించి సాయుధ దళాల బ్రీఫింగ్‌లో పాల్గొన్నారు. కమాండర్ ప్రేరణ దేవస్థలీ భారత నావికాదళ యుద్ధనౌకకు కమాండ్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు.