Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘కూలీ’కా.. ‘వార్‌-2’కా.. మీరు దేనికి వెళ్తున్నారు?

    రేపు భారీ బడ్జెట్ సినిమాలు ‘వార్‌-2’, ‘కూలీ’ విడుదలకానున్నాయి. ఇప్పటికే వీటికి టికెట్‌ బుకింగ్స్‌ ప్రాంభమవ్వగా.. ప్రీ-సీల్స్‌లో రెండూ దూసుకెళ్తున్నాయి. అయితే ఇవి డైరెక్ట్‌ తెలుగు సినిమాలు కాకపోయినా ‘వార్‌-2’లో ఎన్టీఆర్‌, ‘కూలీ’లో నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండటంతో టాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది. మరి సినీ ప్రయులు ఏ మూవీకి వెళ్తున్నారాని చర్చ నడుస్తోంది.

  • ‘ఆ నిర్మాత తన వ్యాఖ్యలు ఉప సంహరించుకోవాలి’

    ఆర్ట్‌ డైరెక్టర్స్‌ను ఉద్దేశించి నిర్మాత విశ్వప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ ఆర్ట్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ లేఖ విడుదల చేసింది. ‘‘సినిమాల చిత్రీకరణలో ఆర్ట్‌ డైరెక్టర్లు ఎంతో కీలకపాత్ర పోషిస్తారు. అలాంటి వారిని ఆయన ‘ఆర్ట్‌ మాఫియా’ అని అన్నారు. ఆయన మాటలను ఖండిస్తున్నాం. ఆ వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం. మీడియాలో మాపై నిందలు వేయడం సరికాదు’’ అని అసోసియేషన్‌ తన లేఖలో పేర్కొంది.

  • ముగిసిన మంచు లక్ష్మి ఈడీ విచారణ

    బెట్టింగ్ యాప్‌ల కేసులో సినీ నటి మంచు లక్ష్మిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మూడున్నర గంటలపాటు విచారించారు. ఆమె కొన్ని గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు ఈ విచారణకు హాజరయ్యారు. ఈడీ అధికారులకు తన బ్యాంక్ స్టేట్‌మెంట్లను సమర్పించారు. విచారణ ముగిసిన తర్వాత, ఆమె మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.

  • బోరుమని ఏడ్చేసిన సదా

    ఢిల్లీ నుంచి వీధి కుక్కలన్నింటినీ తొలగించాలంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై  కొన్ని వర్గాల నుంచి మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సినీ నటి సదా కీలక  వ్యాఖ్యలు చేసింది. ‘‘సుప్రీంకోర్టు ఈ తీర్పు నన్ను లోలోపలే చంపేస్తోంది.  మన దేశాన్ని చూస్తుంటే సిగ్గుగా ఉంది. దయచేసి ఈ తీర్పు వెనక్కు తీసుకోండి’’ అంటూ  సదా ఏడ్చేసింది.

     

  • ఓటీటీలోకి ‘సూపర్‌మ్యాన్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!

    ఇటీవల విడుదలైన ‘సూపర్‌మ్యాన్‌’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఆ చిత్ర దర్శకుడు జేమ్స్‌ గన్‌ పోస్ట్‌ పెట్టారు. ఈ శుక్రవారం ‘సూపర్‌‌మ్యాన్‌’ మీ ఇళ్లకు వస్తున్నాడని పేర్కొన్నారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, యాపిల్‌ టీవీల్లో ఆగస్టు 15న ఇది స్ట్రీమింగ్‌ కానుంది.

     

  • దేవుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది: బాలకృష్ణ

    AP: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘అభిమానులు, ప్రజల ఆశీస్సులతో శంకుస్థాపన కార్యక్రమం బాగా జరిగింది. వర్షం రూపంలో దేవుడు ఆశీర్వదించాడు. మంచి కార్యక్రమానికి దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. 2019లోనే హాస్పిటల్ నిర్మాణం కోసం ఇక్కడ భూమి పూజ చేశాం’’ అని పేర్కొన్నారు.

  • అక్షయ్ కుమార్ కారును సీజ్ చేసిన పోలీసులు

    బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ చట్టపరమైన వివాదంలో చిక్కుకున్నారు. జమ్మూలో ట్రాఫిక్ అధికారులు అక్షయ్ కుమార్ కారును స్వాధీనం చేసుకున్నారు. ఆయన కారు.. మోటారు వాహనాల చట్టం ప్రకారం అనుమతించబడిన స్థాయిని మించి నల్లటి రంగు అద్దాలతో ఉందని జమ్మూ సిటీ ట్రాఫిక్ ఎస్‌ఎస్‌పీ ఫరూఖ్ కైసర్ అన్నారు. అక్రమ టిన్టెడ్ గ్లాసులు ఉండటంతో అక్షయ్ కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. చట్టం అందరికీ సమానమేనని వ్యాఖ్యానించారు.

  • ‘కూలీ’ ఫస్ట్ రివ్యూ చెప్పేసిన డిప్యూటీ సీఎం

    తమిళ నటుడు రజనీకాంత్ చిత్రం ‘కూలీ’పై తమిళనాడు డిప్యూటీ సీఎం, నటుడు ఉదయనిధి స్టాలిన్ ప్రశంసలు కురిపించారు. భారీ అంచనాలున్న ఈ మూవీని ముందే చేసే అవకాశం లభించిందని చెప్పారు. ‘‘ఈ పవర్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌ను నేను పూర్తిగా ఆస్వాదించాను. ప్రతిచోటా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతుందని ఖచ్చితంగా చెప్పగలను. ఈ ఘనవిజయం సాధించాలని నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారు.

  • జ‌న‌రేట‌ర్‌లా సౌండ్ చేస్తూ నిద్ర‌పోతాడు.. అందుకే విడాకులు: కిమ్

    అమెరికన్‌ సెలబ్రిటీ కిమ్‌ కర్ధాషియన్‌ తన భర్త కాన్యే వెస్ట్‌కు విడాకులు ఇవ్వడంపై షాకింగ్‌ రీజన్‌ చెప్పారు. ‘‘అతను ఎక్కడ పడితే అక్కడ జ‌న‌రేట‌ర్‌లా సౌండ్ చేస్తూ నిద్రపోతాడు.  అలాంటి పరిస్థితుల్లో అతడితో కలిసి జీవించడం కష్టం కావడంతో విడాకులు ఇచ్చా’’ అని తెలిపింది. నిద్ర వ‌ల‌న కిమ్ త‌న భ‌ర్త‌కి విడాకులు ఇవ్వాల్సిన ప‌రిస్థితి రావడంపై  నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

     

     

  • చిత్రపురి హౌసింగ్ సొసైటీలో రూ. 300 కోట్ల స్కామ్

    HYD: చిత్రపురి హౌసింగ్ సొసైటీలో సుమారు రూ. 300 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ సినీ కార్మికులు బుధవారం FDC కార్యాలయం ముందు మహాధర్నా చేపట్టారు. చిత్రపురి హౌసింగ్ సొసైటీ  అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ నిజమైన కార్మికులకు ఇళ్లు దక్కకుండా బ్లాక్ మార్కెట్‌లో ఫ్లాట్లు అమ్ముకుంటున్నారన్నారు. దీనిపై కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని, తక్షణమే అనిల్ కుమార్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.