Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘ఓజీ’ నుంచి సువ్వి.. సువ్వి సాంగ్‌ రిలీజ్‌

    పవన్‌ కల్యాణ్‌ హీరోగా దర్శకుడు సుజీత్‌ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఓజీ’. ఈ సినిమాలో పవన్‌ సరసన ప్రియాంకా మోహన్‌ నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా సెప్టెంబర్‌ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వినాయక చవితి సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి ‘సువ్వి.. సువ్వి’ పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘ఉండిపో ఇలాగా.. తోడుగా.. నా మూడు ముళ్లలాగా’అంటూ సాగే లిరిక్స్‌ కల్యాణ్ చక్రవర్తి రాయగా.. శ్రుతి రంజనీ ఆలపించారు.

  • ఘాటీ ప్రమోషన్స్‌కు అనుష్క దూరం!

    క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క నటించిన చిత్రం ‘ఘాటి’. సెప్టెంబర్ 5న విడుదలకానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌కు అనుష్క దూరంగా ఉండనుంది. ప్రాజెక్ట్‌ ప్రారంభించినప్పుడే అనుష్క ప్రమోషన్స్‌కు అందుబాటులో ఉండరని చెప్పినట్లు నిర్మాత రాజీవ్‌రెడ్డి తెలిపారు. ‘‘ప్రీరిలీజ్‌ వేడుకకు హాజరుకాకపోవచ్చు. అది ఆమె వ్యక్తిగత విషయం. అనుష్కలాంటి నటి మాత్రమే ఇంత గొప్ప పాత్ర పోషించగలరు. షీలా పాత్రలో జీవించింది’’ అని చెప్పుకొచ్చారు.

  • నటుడు విజయ్‌పై కేసు

    తమిళ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. మధురైలో విజయ్ నిర్వహించిన ఈవెంట్‌లో విజయ్ బౌన్సర్స్ తనను కొట్టారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విజయ్, బౌన్సర్లు కేసు ఫైల్ చేశారు.

  • ఓటీటీలోకి వచ్చేసిన ‘కింగ్డమ్’

    గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన మూవీ ‘కింగ్డమ్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. థియేటర్ రన్‌లో మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమాను నాగవంశీ నిర్మించారు.

  • ‘సినిమా టికెట్లపై జీఎస్టీని తగ్గించండి’

    ప్రస్తుత జీఎస్‌టీ విధానంలో సినిమా టికెట్లపై రూ.100 లోపు అయితే 12%, ఆపైన అయితే 18% పన్ను విధిస్తున్నారు. రూ.300లోపు ఉన్న టికెట్లను 5% శ్లాబ్‌లోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం కోరింది. ఇది ప్రజలకు సినిమా వినోదాన్ని తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చి, చలనచిత్ర పరిశ్రమకు సహాయపడుతుందని పేర్కొంది. రూ.300పైన ఉన్న టికెట్లపై మాత్రం 18% పన్ను విధించాలని సూచించింది.

  • ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ప్రముఖ సింగర్

    ప్రముఖ అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ ఎంగేజ్‌మెంట్ నిన్న తన ప్రియుడు, NFL ప్లేయర్ ట్రావిస్ కెల్సేతో జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా టేలర్ పోస్ట్ చేశారు. ‘మీ ఇంగ్లిష్ టీచర్, జిమ్ టీచర్ వివాహం చేసుకోబోతున్నారు’ అని రాసుకొచ్చారు. తనను తాను ఇంగ్లిష్ టీచర్‌గా టేలర్ పేర్కొనడంపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. వీరి పెళ్లి ఎప్పుడనే విషయాన్ని వెల్లడించలేదు.

  • ‘నటన కన్నా అందులోనే ఎక్కువ ఆనందం’

    కోలీవుడ్‌ నటుడు రవి మోహన్‌ నిర్మాణ సంస్థ లాంచ్‌ ఈవెంట్‌లో హీరో శివ కార్తికేయన్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘నాకు నటన కన్నా సినిమాలు నిర్మించడంలోనే ఎక్కువ ఆనందం. రవి మోహన్‌.. నిర్మాతగా నేను మీకు సీనియర్‌ని. ఎక్కువ చిత్రాలు నిర్మించండి’’ అని శివ కార్తికేయన్‌ విజ్ఞప్తి చేశారు. వీరిద్దరు కలిసి ‘పరాశక్తి’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

  • ఆ కష్టాలేంటో నాకు తెలుసు: హీరో కార్తి

    కోలీవుడ్‌ నటుడు రవి మోహన్‌ నిర్మాణ సంస్థ లాంచ్‌ ఈవెంట్‌లో హీరోలు కార్తి, శివ కార్తికేయన్‌ సందడి చేశారు. కార్తి మాట్లాడుతూ.. తాను రవి మోహన్‌తో కలిసి నటించనున్నట్టు తెలిపారు. రవి చెప్పిన కథ బాగా నచ్చిందని, దానిని ఆయనే తెరకెక్కిస్తాడని చెప్పారు. సినిమా నిర్మాణంలో ఉన్న కష్టాలేంటో తనకు తెలుసని.. అందుకే ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభించే ఉద్దేశం లేదని సరదాగా పేర్కొన్నారు.(Video)

  • డైరెక్టర్‌గా హీరో.. హీరోగా కమెడియన్‌!

    కోలీవుడ్‌ హీరో జయం రవి డైరెక్టర్‌గా మెగాఫోన్ పట్టనున్నాడు. కమెడియన్‌ యోగిబాబు ప్రధాన పాత్రలో.. ఆయన సినిమా తెరకెక్కించనున్నారని గతంలో ప్రచారం జరిగింది. తాజాగా దానిపై రవి స్పందించాడు. యోగిబాబుతో తాను రూపొందించనున్న ‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌’ తన ప్రొడక్షన్‌ హౌస్‌కి రెండో చిత్రమని చెప్పారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతోనే నిర్మాణ సంస్థ నెలకొల్పానని, ఓటీటీ ప్రాజెక్టులూ నిర్మిస్తానని ఆయన తెలిపారు.

     

     

     

  • Video: ఆ హీరోయిన్‌పై రుక్మిణి వసంత్ ఆసక్తికర కామెంట్స్!

    కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ సాయి పల్లవిపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘సాయి పల్లవి నిజంగా అమేజింగ్ యాక్టర్. పీపుల్‌కు ఎలా కమ్యునికేట్ చెయ్యాలో తనకు తెలుసు. తన కెరీర్‌ను బిల్డ్ చేసుకోవడానికి ఏం చేయాలో క్లారిటీ ఉంది. ముఖ్యంగా తన పర్ఫామెన్స్ నిజంగా బ్యూటిఫుల్’’ అని రుక్మిణి చెప్పుకొచ్చింది. (Video)