Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘కూలీ’ ఫస్ట్ రివ్యూ చెప్పేసిన డిప్యూటీ సీఎం

    తమిళ నటుడు రజనీకాంత్ చిత్రం ‘కూలీ’పై తమిళనాడు డిప్యూటీ సీఎం, నటుడు ఉదయనిధి స్టాలిన్ ప్రశంసలు కురిపించారు. భారీ అంచనాలున్న ఈ మూవీని ముందే చేసే అవకాశం లభించిందని చెప్పారు. ‘‘ఈ పవర్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌ను నేను పూర్తిగా ఆస్వాదించాను. ప్రతిచోటా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతుందని ఖచ్చితంగా చెప్పగలను. ఈ ఘనవిజయం సాధించాలని నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారు.

  • జ‌న‌రేట‌ర్‌లా సౌండ్ చేస్తూ నిద్ర‌పోతాడు.. అందుకే విడాకులు: కిమ్

    అమెరికన్‌ సెలబ్రిటీ కిమ్‌ కర్ధాషియన్‌ తన భర్త కాన్యే వెస్ట్‌కు విడాకులు ఇవ్వడంపై షాకింగ్‌ రీజన్‌ చెప్పారు. ‘‘అతను ఎక్కడ పడితే అక్కడ జ‌న‌రేట‌ర్‌లా సౌండ్ చేస్తూ నిద్రపోతాడు.  అలాంటి పరిస్థితుల్లో అతడితో కలిసి జీవించడం కష్టం కావడంతో విడాకులు ఇచ్చా’’ అని తెలిపింది. నిద్ర వ‌ల‌న కిమ్ త‌న భ‌ర్త‌కి విడాకులు ఇవ్వాల్సిన ప‌రిస్థితి రావడంపై  నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

     

     

  • చిత్రపురి హౌసింగ్ సొసైటీలో రూ. 300 కోట్ల స్కామ్

    HYD: చిత్రపురి హౌసింగ్ సొసైటీలో సుమారు రూ. 300 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ సినీ కార్మికులు బుధవారం FDC కార్యాలయం ముందు మహాధర్నా చేపట్టారు. చిత్రపురి హౌసింగ్ సొసైటీ  అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ నిజమైన కార్మికులకు ఇళ్లు దక్కకుండా బ్లాక్ మార్కెట్‌లో ఫ్లాట్లు అమ్ముకుంటున్నారన్నారు. దీనిపై కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని, తక్షణమే అనిల్ కుమార్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

     

     

  • టాలీవుడ్ బంద్.. ఈ రోజు సమ్మె విరమణకు ఛాన్స్

    HYD : సినీ కార్మికుల సమ్మె 10వ రోజుకు చేరుకుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఫిల్మ్ ఛాంబర్‌లో ఫెడరేషన్ కో ఆర్డినేషన్ మెంబర్స్‌తో ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల చర్చలు జరపబోతున్నారు. మంత్రి కోమటి రెడ్డి సూచనలతో చర్చలు జరుపనున్నారు. చర్చల అనంతరం సమ్మెపై ఇరు వర్గాలు ప్రకటన చేయనున్నారు.

     

  • మీడియాకు వేలు చూపిస్తూ.. మంచు లక్ష్మి ఆగ్రహం

    HYD: మీడియా ప్రతినిధులపై నటి మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఈడీ విచారణకు మంచు లక్ష్మి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీంతో నా జోలికి వచ్చారో అంటూ మీడియాకు వేలు చూపిస్తూ.. మంచు లక్ష్మి కోపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి

    HYD: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఈడీ విచారణకు నటి మంచు లక్ష్మి హాజరయ్యారు. ఈ యాప్స్ ప్రమోషన్స్‌కు సంబంధించి ఆమె లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే నటుడు ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, రానాలను ఈడీ విచారించింది. ఇప్పటికే మొత్తం 29 మంది సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు ఇచ్చింది.

  • క్యాన్సర్‌తో ప్రముఖ నటి మృతి

    ప్రముఖ బెంగాలీ నటి బసంతి ఛటర్జీ (88) కన్నుమూశారు. ఆమె చాలా కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇటీవల క్యాన్సర్ చికిత్స తీసుకుని, డిశ్చార్జ్ అయిన ఆమె.. ఆగస్టు 12న తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ఐదు దశాబ్దాల తన కెరీర్‌లో బసంతి ఛటర్జీ 100కి పైగా సినిమాల్లో నటించారు. వాటిలో థాగిని, మంజరి ఒపెరా, అలో వంటి సినిమాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి.

  • ‘కూలీ’ని దాటేసిన ‘వార్‌ 2’..

    రజనీకాంత్ ‘కూలీ’ సినిమాను ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ‘వార్2’ మూవీ బీట్ చేసింది. దాటేసింది. తాజా సమాచారం ప్రకారం.. BookMyShowలో విడుదలైన మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘వార్2’ సినిమా ‘కూలీ’ని వెనక్కి నెట్టింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే బుక్‌మైషోలో 750K మార్కును అందుకుంది.

  • ఏపీ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పిన నాగవంశీ

    ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ‘వార్2’ సినిమాకు టికెట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంతి అనిత, సినిమాటోగ్రాఫి మంత్రి కందుల దుర్గేష్‌కు నిర్మాత నాగవంశీ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. తమ సినిమాకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. కాగా ఆగస్టు 14న ఈ మూవీ విడుదల కానుంది.

  • అమరావతిలో నేడు బసవతారకం ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన

    AP: అమరావతిలో ఇవాళ బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణానికి నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అనంతవరం, తుళ్లూరు రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం కేటాయించిన 21 ఎకరాల్లో నిర్మించనున్నారు. అమరావతిలో నిర్మిస్తున్న క్యాన్సర్‌ ఆస్పత్రిని దేశంలో ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని బాలకృష్ణ తెలిపారు. మూడు దశల్లో ఆస్పత్రి నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తామని వెల్లడించారు.