Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘‘కూలీ’’ కోసం ఉద్యోగులకు సెలవుతోపాటు… టికెట్లు

    నటుడు రజనీకాంత్‌ నటించిన ‘కూలీ’ సినిమా విడుదలను పురస్కరించుకుని, మదురైకి చెందిన యూనో ఆక్వా కేర్‌ సంస్థ తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించి ఉచితంగా టిక్కెట్లను అందజేసింది. చెన్నై, బెంగళూరు, తిరుచ్చి వంటి వివిధ శాఖల ఉద్యోగులందరికీ ఈ సదుపాయం కల్పించారు. సినిమా విడుదల రోజున ఆశ్రమాలకు ఆహారం, విరాళాలు, ప్రజలకు స్వీట్లు పంపిణీ చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

  • మ్యూజిక్‌ విషయంలో రజనీకాంత్‌ ఫీడ్‌బ్యాక్‌‌పై అనిరుధ్‌ స్పందన

    నటుడు రజనీకాంత్, సంగీత దర్శకుడు అనిరుధ్ కాంబినేషన్‌లో ఐదో సినిమా ‘కూలీ’ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా అనిరుధ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రజనీకాంత్ సంగీతంలో జోక్యం చేసుకోరని, పూర్తి స్వేచ్ఛనిస్తారని చెప్పారు. దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌కు తనపై చాలా నమ్మకం ఉందని, అందుకే ఆయన సినిమాలకు తన సంగీతం ప్రత్యేకంగా ఉంటుందని తెలిపారు.

  • అనుచిత పోస్టులపై కేసు.. ముగిసిన రాంగోపాల్‌వర్మ విచారణ

    AP: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మను ఒంగోలు పోలీసులు సుమారు 11 గంటల పాటు విచారించారు. ‘వ్యూహం’ సినిమా ప్రచారంలో భాగంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌లను కించపరిచేలా మార్ఫింగ్ ఫోటోలను X (ట్విట్టర్)లో పోస్ట్ చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. పోలీసుల నోటీసుల మేరకు విచారణకు హాజరైన ఆర్జీవీ దర్యాప్తునకు సహకరించలేదని సమాచారం.

  • ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు : ఎన్టీఆర్‌

    వార్‌ 2′ సినిమాకు అదనపు షోలు, టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతినిచ్చిన ఏపీ ప్రభుత్వానికి నటుడు జూనియర్ ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి కందుల దుర్గేశ్‌లకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఈ వెసులుబాటు ఆగస్టు 14 నుంచి 23 వరకు అమల్లో ఉంటుందని, అదనపు షోకు రూ.500గా ధర నిర్ణయించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

  • ప్రముఖ హాంకాంగ్ నటుడు కన్నుమూత

    ప్రముఖ హాంకాంగ్ నటుడు బెంజమిన్ యెంగ్ (43) మరణించారు. ఆగస్టు 11న కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య ప్రశాంతంగా కన్నుమూశారని నటుడి సోదరుడు తెలిపారు. అయితే, ఆయన మరణానికి కారణాన్ని మాత్రం తెలియజేయలేదు. ‘యంగ్ అండ్ డేంజరస్’, ‘ది కాన్‌మాన్ 1999’, ‘మై గుడ్ బ్రదర్’, ‘ది జేడ్ అండ్ ది పీర్ల్’, ‘లైన్ వాకర్ 2: ఇన్విజిబుల్ స్పై’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు.

  • ట్రెడిష‌న‌ల్ లుక్‌లో మెరిసిన జాన్వీకపూర్!

    బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ తాజాగా ట్రెడిష‌న‌ల్ లుక్‌లో ఉన్న పిక్ నెట్టింట పంచుకుంది. ఇందులో ఆమె గోల్డ్ డిజైన‌ర్ శారీలో ఎంతో అందంగా క‌నిపించింది.

  • ‘కిస్’..రొమాంటిక్ టీజర్ వచ్చేస్తోంది!

    కవిన్-ప్రీతి అస్రాని జంటగా నటిస్తున్న మూవీ ‘కిస్’. సతీష్ కృష్ణన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ రేపు సా.5:04గంటలకు రాబోతున్నట్లు పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

  • ‘ప్రభాస్‌తో నటించేందుకు ఏదైనా చేస్తా’

    హీరోయిన్ పూజా హెగ్డే హీరో ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జక్కన్న దర్శకత్వంలో వచ్చిన.. ‘బాహుబలి’ సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె పేర్కొంది. అయితే ‘బాహుబలి-3’ సినిమా తీస్తే కచ్చితంగా ఆ సినిమాలో నటించేందుకు ప్రయత్నం చేస్తానని.. ప్రభాస్‌తో నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆ పాత్ర కోసం ఏదైనా చేస్తానని పూజా వెల్లడించింది.

  • ‘కూలీ’ దెబ్బకు ‘వార్ 2’.. విలవిల!

    ఈనెల 14న విడుదలకానున్న ‘కూలీ’, ‘వార్‌2’ సినిమాల బుకింగ్స్‌ ఓపెన్‌ కాగా, టికెట్స్ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. వీటిలో ‘కూలీ’కే జనాలు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ‘కూలీ’ దెబ్బకు ‘వార్ 2’ ఏమాత్రం నిలబడేలా కనిపించడం లేదని సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బెంగళూరులో ‘కూలీ’ సినిమా తన హవాను చూపిస్తోంది. ఇప్పటివరకు బెంగళూరులో 1.94 లక్షల టికెట్లు సేల్ అవ్వగా.. ‘వార్ 2’ టికెట్లు 13వేలు మాత్రమే అమ్ముడు అయ్యాయని సమాచారం.

  • ఆ సినిమాలంటే భయం: జాన్ అబ్రహం

    నటుడు జాన్ అబ్రహం, భారతదేశంలో పెరుగుతున్న జాతీయవాద సినిమాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను ప్రభావితం చేయాలనే ఉద్దేశంతో తీసే సినిమాలు తనకు భయంగా ఉన్నాయన్నారు. ‘ఛావా’ మరియు ‘ది కాశ్మీర్ ఫైల్స్’ వంటి సినిమాలు తాను ఎప్పటికీ చేయనని స్పష్టం చేశారు. తాను రాజకీయ రహితంగా ఉంటానని, వాణిజ్య లాభాల కంటే నిజాయితీకే ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. జాన్ నటించిన ‘తెహ్రాన్’ చిత్రం ఆగస్టు 14న జీ5లో విడుదల కానుంది.