విజయ్ ఆంటోని హీరోగా అరుణ్ ప్రభు తెరకెక్కిస్తున్న తమిళ చిత్రం ‘శక్తి తరుమగన్’. ఈమూవీ తెలుగులో ‘భద్రకాళి’ గా రిలీజ్‌కానుంది. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుండగా.. తాజాగా వాయిదా పడినట్లు విజయ్ ఎక్స్ వేదికగా పోస్ట్ షేర్ చేశాడు. ‘‘ప్రియమైన మిత్రులారా.. మా సినిమాను వాయిదా వేస్తున్నందుకు క్షమించండి.. తిరిగి సెప్టెంబర్ 19న థియేటర్లలో కలుద్దాం’’ అంటూ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించాడు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
మోవ్ నగరంలో అలియా-రణ్‌బీర్ ‘లవ్ అండ్ వార్’!
అలియా భట్-రణ్‌బీర్ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ అండ్ వార్’. సంజయ్ లీలా భన్సాలీ దర్శకుడు. ఇందులో విక్కీ కౌశల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ కోసం.. బ్రిటిష్ కాలంనాటి ఆర్మీ కంటోన్మెంట్‌కు ప్రసిద్ధి చెందిన మధ్యప్రదేశ్‌లోని మోవ్ పట్టణానికి చిత్రబృందం పయనమైనట్లు తెలుస్తోంది. అక్కడ 15రోజుల పాటు ఈ సినిమాలోని ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం.
-
‘వార్ 2’.. యంగ్‌టైగర్ ఎంట్రీ అప్పుడేనట?
ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కలిసి నటించిన ‘వార్ 2’ మూవీ ఈనెల 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో తారక్ ఎంట్రీ ఎప్పుడాని ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈనేపథ్యంలో మూవీ తొలి 20 నిమిషాలలోపే ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. ఫస్టాఫ్ డామినేషన్ మొత్తం ఎన్టీఆర్‌దేనని టాక్. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకే హైలైట్ అని సినీవర్షాల సమాచారం.
-
పవన్ మేనరిజం వంద డైలాగులతో సమానం: నిధి అగర్వాల్
AP: హీరోయిన్ నిధి అగర్వాల్ కాకినాడలో సందడి చేశారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవానికి ఆమె అతిథిగా హాజరయ్యారు. ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా నిధి డ్యాన్స్ చేసి అలరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నిధి.. పవన్‌కల్యాణ్ మేనరిజాన్ని ఇమిటేట్ చేస్తూ.. అది వంద డైలాగులతో సమానం అన్నారు. (వీడియో)
-
‘మహావతార్:నరసింహా’ కలెక్షన్ల వర్షం
‘మహావతార్:నరసింహా’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రాన్ని రూ.15కోట్లతో రూపొందించగా ఇప్పటికే రూ.225 కోట్లు వచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి.
-
ఓటీటీలోకి ‘వర్జిన్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
గీతానంద్, మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘వర్జిన్ బాయ్స్’. దయానంద్ తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రల్లో నటించారు. జులై 11న థియేటర్లలో విడదలైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధం అయింది. ‘వర్జిన్ బాయ్స్’ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ఆహా సంస్థ సొంతం చేసుకోగా.. ఆగస్టు 15 నుంచి స్ట్రీమింగ్‌కు రాబోతున్నట్లు ప్రకటించారు.
-
Video: ‘కూలీ’ కోసం డైరెక్టర్ లోకేష్ ప్రత్యేక పూజలు
డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘కూలీ’ విజయం కోసం ఆయన రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. సినిమా విడుదల తేదీ (ఆగస్టు 14) సమీపిస్తున్న తరుణంలో ఆయన స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘కూలీ’లో రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా.. కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. (వీడియో)
-
ఉపాసన ఫోన్‌లో చరణ్ నెంబర్.. ఏ పేరుతో ఉందంటే?
మెగాకోడలు ఉపాసన తన భర్త రామ్‌చరణ్ గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. చరణ్ నెంబర్‌ను తన ఫోన్‌లో ‘రామ్‌చరణ్ 200’ అనే పేరుతో సేవ్ చేసుకుందట. ఆ పేరు వెనుక ఉన్న కథ కూడా చెప్పింది. ఇప్పటివరకు చరణ్ 199 సార్లు తన మొబైల్ నెంబర్‌ను మార్చుకున్నారట. ప్రస్తుతం వాడుతున్నది 200వ నెంబర్ అట. అందుకే ‘రామ్ చరణ్ 200’ అని సేవ్ చేసుకున్నానని సరదాగా చెప్పింది.
-
మ్యూజిక్ విషయంలో రజనీ కల్పించుకోరు: అనిరుధ్
సూపర్‌స్టార్ రజనీకాంత్-సంగీత దర్శకుడు అనిరుధ్ కాంబినేషన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా అనిరుధ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నగా.. మ్యూజిక్ విషయంలో రజనీకాంత్ ఫీడ్‌బ్యాక్ ఇస్తారా? అని యాంకర్ అడగ్గా అనిరుధ్ స్పందించారు. ‘‘మ్యూజిక్ విషయంలో ఆయన కల్పించుకోరు. తన సినిమా అయినా, వేరే చిత్రమైనా నేను కంపోజ్ చేసిన సాంగ్ నచ్చితే మెసేజ్ ద్వారా నాకు తెలియజేస్తారు’’ అని పేర్కొన్నారు.