హీరోయిన్ పూజా హెగ్డే హీరో ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జక్కన్న దర్శకత్వంలో వచ్చిన.. ‘బాహుబలి’ సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె పేర్కొంది. అయితే ‘బాహుబలి-3’ సినిమా తీస్తే కచ్చితంగా ఆ సినిమాలో నటించేందుకు ప్రయత్నం చేస్తానని.. ప్రభాస్‌తో నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆ పాత్ర కోసం ఏదైనా చేస్తానని పూజా వెల్లడించింది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘కూలీ’ దెబ్బకు ‘వార్ 2’.. విలవిల!
ఈనెల 14న విడుదలకానున్న ‘కూలీ’, ‘వార్2’ సినిమాల బుకింగ్స్ ఓపెన్ కాగా, టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. వీటిలో ‘కూలీ’కే జనాలు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ‘కూలీ’ దెబ్బకు ‘వార్ 2’ ఏమాత్రం నిలబడేలా కనిపించడం లేదని సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బెంగళూరులో ‘కూలీ’ సినిమా తన హవాను చూపిస్తోంది. ఇప్పటివరకు బెంగళూరులో 1.94 లక్షల టికెట్లు సేల్ అవ్వగా.. ‘వార్ 2’ టికెట్లు 13వేలు మాత్రమే అమ్ముడు అయ్యాయని సమాచారం.
-
ఆ సినిమాలంటే భయం: జాన్ అబ్రహం
నటుడు జాన్ అబ్రహం, భారతదేశంలో పెరుగుతున్న జాతీయవాద సినిమాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను ప్రభావితం చేయాలనే ఉద్దేశంతో తీసే సినిమాలు తనకు భయంగా ఉన్నాయన్నారు. ‘ఛావా’ మరియు ‘ది కాశ్మీర్ ఫైల్స్’ వంటి సినిమాలు తాను ఎప్పటికీ చేయనని స్పష్టం చేశారు. తాను రాజకీయ రహితంగా ఉంటానని, వాణిజ్య లాభాల కంటే నిజాయితీకే ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. జాన్ నటించిన ‘తెహ్రాన్’ చిత్రం ఆగస్టు 14న జీ5లో విడుదల కానుంది.
-
‘నన్ను క్షమించండి’.. స్టార్ హీరో పోస్ట్!
విజయ్ ఆంటోని హీరోగా అరుణ్ ప్రభు తెరకెక్కిస్తున్న తమిళ చిత్రం ‘శక్తి తరుమగన్’. ఈమూవీ తెలుగులో ‘భద్రకాళి’ గా రిలీజ్‌కానుంది. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుండగా.. తాజాగా వాయిదా పడినట్లు విజయ్ ఎక్స్ వేదికగా పోస్ట్ షేర్ చేశాడు. ‘‘ప్రియమైన మిత్రులారా.. మా సినిమాను వాయిదా వేస్తున్నందుకు క్షమించండి.. తిరిగి సెప్టెంబర్ 19న థియేటర్లలో కలుద్దాం’’ అంటూ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించాడు.
-
మోవ్ నగరంలో అలియా-రణ్‌బీర్ ‘లవ్ అండ్ వార్’!
అలియా భట్-రణ్‌బీర్ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ అండ్ వార్’. సంజయ్ లీలా భన్సాలీ దర్శకుడు. ఇందులో విక్కీ కౌశల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ కోసం.. బ్రిటిష్ కాలంనాటి ఆర్మీ కంటోన్మెంట్‌కు ప్రసిద్ధి చెందిన మధ్యప్రదేశ్‌లోని మోవ్ పట్టణానికి చిత్రబృందం పయనమైనట్లు తెలుస్తోంది. అక్కడ 15రోజుల పాటు ఈ సినిమాలోని ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం.
-
‘వార్ 2’.. యంగ్‌టైగర్ ఎంట్రీ అప్పుడేనట?
ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కలిసి నటించిన ‘వార్ 2’ మూవీ ఈనెల 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో తారక్ ఎంట్రీ ఎప్పుడాని ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈనేపథ్యంలో మూవీ తొలి 20 నిమిషాలలోపే ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. ఫస్టాఫ్ డామినేషన్ మొత్తం ఎన్టీఆర్‌దేనని టాక్. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకే హైలైట్ అని సినీవర్షాల సమాచారం.
-
పవన్ మేనరిజం వంద డైలాగులతో సమానం: నిధి అగర్వాల్
AP: హీరోయిన్ నిధి అగర్వాల్ కాకినాడలో సందడి చేశారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవానికి ఆమె అతిథిగా హాజరయ్యారు. ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా నిధి డ్యాన్స్ చేసి అలరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నిధి.. పవన్‌కల్యాణ్ మేనరిజాన్ని ఇమిటేట్ చేస్తూ.. అది వంద డైలాగులతో సమానం అన్నారు. (వీడియో)
-
‘మహావతార్:నరసింహా’ కలెక్షన్ల వర్షం
‘మహావతార్:నరసింహా’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రాన్ని రూ.15కోట్లతో రూపొందించగా ఇప్పటికే రూ.225 కోట్లు వచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి.
-
ఓటీటీలోకి ‘వర్జిన్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
గీతానంద్, మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘వర్జిన్ బాయ్స్’. దయానంద్ తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రల్లో నటించారు. జులై 11న థియేటర్లలో విడదలైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధం అయింది. ‘వర్జిన్ బాయ్స్’ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ఆహా సంస్థ సొంతం చేసుకోగా.. ఆగస్టు 15 నుంచి స్ట్రీమింగ్‌కు రాబోతున్నట్లు ప్రకటించారు.