సూపర్‌స్టార్ రజనీకాంత్-సంగీత దర్శకుడు అనిరుధ్ కాంబినేషన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా అనిరుధ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నగా.. మ్యూజిక్ విషయంలో రజనీకాంత్ ఫీడ్‌బ్యాక్ ఇస్తారా? అని యాంకర్ అడగ్గా అనిరుధ్ స్పందించారు. ‘‘మ్యూజిక్ విషయంలో ఆయన కల్పించుకోరు. తన సినిమా అయినా, వేరే చిత్రమైనా నేను కంపోజ్ చేసిన సాంగ్ నచ్చితే మెసేజ్ ద్వారా నాకు తెలియజేస్తారు’’ అని పేర్కొన్నారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
మెడలో పసుపు తాడుతో కోర్టు బ్యూటీ.. పెళ్లైందా?
‘కోర్ట్’ హీరోయిన్ శ్రీదేవికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఆమె మెడలో పసుపు తాడు కనిపించింది. దీన్ని తాళిబొట్టుగా పొరబడిన నెటిజన్లు.. పెళ్లయిపోయిందా అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే.. శ్రావణ శుక్రవారం శ్రీదేవి ఇంట్లో వరలక్ష‍్మి వ్రతం చేసుకున్నారు. ఈ పూజ తర్వాత పసుపు తాడుకి కట్టిన కాసు(కాయిన్) మెడలో వేసుకుందట.
-
రేపు అమరావతిలో బసవతారకం హాస్పిటల్ శంకుస్థాపన
AP: రాజధాని అమరావతిలో రేపు ఉదయం 9:30 గంటలకు బసవతారకం హాస్పిటల్ నిర్మాణానికి బాలకృష్ణ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. కాగా, తుళ్లూరు-అనంతవరం గ్రామాల మధ్య బసవతారకం ఆసుపత్రి కోసం CRDA 21 ఎకరాలు కేటాయించింది.
-
తెలుగు రాష్ట్రాల్లో ‘వార్2’ టికెట్ ధరలు ఖరారు!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘వార్ 2’ సినిమా టికెట్ ధరలపై ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది. తెలంగాణలో హైక్స్ ఉండవు అని ఖరారు అయ్యింది. కానీ ఏపీలో మాత్రం టికెట్ ధరలు పెరిగాయి. సింగిల్ స్క్రీన్స్‌కు ఏకంగా రూ.75 హైక్ ఈ సినిమాకి వచ్చింది. అయితే సింగిల్ స్క్రీన్స్‌లో గరిష్ట ధర రూ.220గా ఫిక్స్ అయ్యింది. సెకండ్ క్లాస్ రూ.150 కాగా.. ఇక ఇదే మల్టీప్లెక్స్‌లకి కూడా వర్తించనుందని సమాచారం.
-
నార్త్ డైరెక్టర్లపై పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు!
నార్త్ డైరెక్టర్లపై హీరోయిన్ పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘‘రాధేశ్యామ్’ చూసిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ‘రెట్రో’లో హీరోయిన్‌గా తీసుకున్నారు. చాలా మంది నార్త్ డైరెక్టర్లు నన్ను గ్లామర్ రోల్స్‌కే పరిమితం చేశారు. కానీ దక్షిణాదిలో ఇది విభిన్నం. ‘రెట్రో’లో నటనకు ఆస్కారం ఉన్న రుక్మిణి రోల్ ఇచ్చారు’’ అని పూజా చెప్పుకొచ్చింది.
-
‘చిన్న నిర్మాతల గురించి కూడా మాట్లాడతాం’
సినీ కార్మికుల వేతనాల పెంపు వివాదంపై ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మీడియాతో మాట్లాడారు. ‘‘వేతనాలు పెంచాలని కోరుతూ తొమ్మిదో రోజు చిత్రీకరణలు జరగకుండా ఆపాం. బుధవారం మధ్యాహ్నం 3గంటలకు సమావేశం ఉంటుంది. అంతిమంగా రేపు అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. చిన్న నిర్మాతల గురించి, వర్కింగ్ కండీషన్స్‌పై కూడా రేపు మాట్లాడతాం. సమస్యలకు ఒక పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నా’’ అని అనిల్ చెప్పుకొచ్చారు.
-
‘త్రిబాణధారి బార్బరిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్!
నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్రలో మోహన్ శ్రీవత్స తెరకెక్కిస్తున్న మూవీ ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈమూవీ ట్రైలర్‌ను ఈనెల 13న సా.5 గంటలకు రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
-
సినీ కార్మికుల వేతనాల పెంపు.. TFCC కీలక లేఖ
టాలీవుడ్‌లో కార్మికుల వేతనాల పెంపుపై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లేఖ విడుదల చేసింది. వేతనాల పెంపు, పని పరిస్థితులపై చర్చించేందుకు బుధవారం మ.3గంటలకు ఫెడరేషన్ నాయకులు.. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు రావాలని పిలుపునిచ్చింది. కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మాత మండలి ప్రతినిధులతో ఫెడరేషన్ నాయకులు చర్చించనున్నారు.
-
‘కూలీ’.. సింగపూర్ కంపెనీ కీలక నిర్ణయం!
సూపర్‌స్టార్ రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తలైవా సినిమా వస్తుందంటే చాలు వరల్డ్‌వైడ్‌గా ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అయితే రజనీ నటించిన చిత్రం ‘కూలీ’ విడుదల సందర్భంగా.. సింగపూర్‌లోని ఓ కంపెనీ తమ తమిళ ఉద్యోగులకు పెయిడ్ హాలిడే ప్రకటించింది. అంతేగాకుండా సినిమా మొదటిరోజు ఫస్ట్ షో టికెట్లతో ఖర్చుల కోసం 30 సింగపూర్ డాలర్లను కూడా అందిస్తామని తెలిపింది.
-
‘పుష్ప’ను ఇమిటేట్ చేసి జాన్వీ.. ‘పరమ్ సుందరి’ ట్రైలర్
సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కిన సినిమా ‘పరమ్ సుందరి’. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఇందులో.. హీరోలు రజనీకాంత్, మోహన్‌లాల్, అల్లు అర్జున్‌లాంటి వారిని ఇమిటేట్ చేసి జాన్వీ అలరించారు. కేరళ అమ్మాయిగా జాన్వీ, ఢిల్లీ అబ్బాయిగా సిద్ధార్థ్ సందడి చేశారు.