Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘కాంతార2’ ప్రమాదాలపై నిర్మాత ఏమన్నారంటే!

    ‘కాంతార2’ మూవీ మొదలైనప్పటి నుంచి వరుస ప్రమాదాలు, షూటింగ్‌కు అడ్డంకులు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. దీనిపై చిత్ర నిర్మాత చలువే గౌడ తాజాగా స్పందించారు. ‘‘సినిమా షూటింగ్‌ సందర్భంగా దురదృష్టవశాత్తూ చోటు చేసుకున్న సంఘటనలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. సెట్‌లో ఒకే ఒక అగ్ని ప్రమాదం జరిగింది. మిగిలినవన్నీ సినిమాకు సంబంధం లేనివి. 80 శాతం సినిమాను నిజమైన ప్రదేశాల్లోనే తెరకెక్కించాం’’ అని ఆయన అన్నారు.

  • ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌.. ‘వార్‌2’లో ‘యానిమల్’ స్టార్!

    ఎన్టీఆర్‌-హృతిక్‌ రోషన్‌ మల్టీస్టారర్‌గా నటిస్తున్న ‘వార్‌2’ మూవీపై ఓ వార్త వినిపిస్తోంది. నటుడు బాబీదేవోల్‌ సినిమాలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో బాబీ అతిథి పాత్రలో మెరుస్తారని సమాచారం. ఇటీవల జరిగిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉన్నాయని వాటిని ఎవరూ రివీల్‌ చేయొద్దని కోరారు. దీంతో ఆ సర్‌ప్రైజ్‌ ఈ పాత్రే కావొచ్చని అభిమానులు భావిస్తున్నారు.

  • ‘కూలీ’ నాకు బెస్ట్ ఎక్స్‌పిరియన్స్ ఇచ్చింది: అనిరుద్

    తన 13 ఏళ్ల కెరీర్‌లో 34 సినిమాలకు పని చేశానని, కానీ ‘కూలీ’ తనకు బెస్ట్ ఎక్స్‌పిరియన్స్ ఇచ్చిందని మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తెలిపారు. నిన్న ఈ మూవీ ఫైనల్ మిక్స్ చేశామని, ఆ సమయంలో నాగార్జున స్టేడియోలో డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్.. తమ ట్రేడ్ మార్క్ ఫోటోను తీశారని చెప్పారు. ఈ సినిమాను థియేటర్‌లో చూడటానికి తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానన్నారు.

  • ‘కూలీ’ మూవీ టికెట్స్‌పై రగడ!

    రజనీకాంత్ ‘కూలీ’ మూవీ టికెట్ రేట్లపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. తమిళ్ మూవీ అయిన ‘కూలీ’కి చెన్నై PVRలో రూ.183 టికెట్ ఉంటే.. తెలుగు వర్షన్‌కు హైదరాబాద్ PVRలో రూ.453 టికెట్ పెట్టారని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. డబ్బింగ్ సినిమాకు ఒరిజినల్ కంటే ఎక్కువ టికెట్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే బాయ్‌కాట్ చేసే పరిస్థితి వస్తుందని అంటున్నారు.

  • సుప్రీంకోర్టు సీజేకు లేఖ రాసిన నటుడు అడవి శేషు

    ఢిల్లీలోని వీధి కుక్కలను తొలగించాలని నిన్న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు సీజేఐకి నటుడు అడవి శేషు లేఖ రాశారు. వీధి కుక్కల అంశంలో ఆదేశాలను పునఃపరిశీలించాలని లేఖలో అభ్యర్థించారు. అలాగే ఈ విషయంపైనే ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు కూడా లేఖ రాశారు.

  • ‘రావు బహదూర్‌’గా రానున్న సత్యదేవ్‌

    సత్యదేవ్‌ ప్రధానపాత్రలో వెంకటేశ్‌ మహా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రావు బహదూర్‌’. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

  • ఒంగోలు‌లో విచారణకు హాజరైన దర్శకుడు RGV

    AP : ఒంగోలు తాలూకా పోలీస్‌స్టేషన్‌లో విచారణకు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మంగళవారం హాజరయ్యారు. వ్యూహం సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన నాయకుల ఫొటోలు మార్ఫింగ్ చేశారనే అభియోగంపై గతేడాది నవంబర్ 10వ తేదీన మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన విచారణకు వర్మ వచ్చారు. మరోసారి నోటీసులు జారీ చేయడంతో విచారణకి రాంగోపాల్ వర్మ హాజరయ్యారు.

  • ‘ఆ డైరెక్టర్ నాకు రూ. 5 లక్షలు సాయం చేశాడు’

    నటి గాయత్రి గుప్తా తాజాగా ఒక ఇంటర్వ్యూలో గతంలో తాను అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేసిన సహాయాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘నేను ఆసుపత్రిలో చేరినప్పుడు క్రౌడ్ ఫండింగ్ ద్వారా సాయం కోరగా, సందీప్ తన మెడికల్ రిపోర్ట్స్ చూసి  రూ.5.5 లక్షలు పంపించారు. నేను కష్ట సమయంలో కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోలేదని, అలాంటి పరిస్థితుల్లో సందీప్ చూపిన మానవత్వం మరవలేనిది’’అని తెలిపారు.

  • ‘సతీ లీలావతి’ పెళ్లిపాట రిలీజ్‌

    లావణ్య త్రిపాఠి, దేవ్‌ మోహన్‌ ప్రధానపాత్రల్లో రానున్న చిత్రం ‘సతీ లీలావతి’. ఈ చిత్రానికి తాతినేని సత్య  దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి పెళ్లిపాటను టీమ్‌ విడుదల చేసింది. ‘ఓరి పిల్లా..చిత్తూరు పిల్లా..’ అంటూ సాగే ఈ పాటకు వనమాలి లిరిక్స్‌ అందించగా.. నూతన్‌ మోహన్‌, కృష్ణ తేజస్వీ ఆలపించారు. మిక్కీ జే మేయర్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. త్వరలోనే మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

     

  • ‘జాలీ ఎల్ఎల్‌బీ 3’ టీజర్‌ రిలీజ్

    అక్షయ్‌కుమార్‌ , అర్షద్‌ వార్షిలు  కలిసి ‘బచ్చన్‌ పాండే’లో నవ్వులు పూయించారు. తాజాగా ఈ ఇద్దరూ ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 3’   మరోసారి నవ్వించేందుకు సిద్ధమయ్యారు. శుభాష్ కపూర్‌ దర్శకత్వంలో కోర్ట్‌ రూం డ్రామాగా తెరకెక్కిన ఈసినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సెప్టెంబర్‌ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.