నటి గాయత్రి గుప్తా తాజాగా ఒక ఇంటర్వ్యూలో గతంలో తాను అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేసిన సహాయాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘నేను ఆసుపత్రిలో చేరినప్పుడు క్రౌడ్ ఫండింగ్ ద్వారా సాయం కోరగా, సందీప్ తన మెడికల్ రిపోర్ట్స్ చూసి రూ.5.5 లక్షలు పంపించారు. నేను కష్ట సమయంలో కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోలేదని, అలాంటి పరిస్థితుల్లో సందీప్ చూపిన మానవత్వం మరవలేనిది’’అని తెలిపారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘సతీ లీలావతి’ పెళ్లిపాట రిలీజ్
లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధానపాత్రల్లో రానున్న చిత్రం ‘సతీ లీలావతి’. ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి పెళ్లిపాటను టీమ్ విడుదల చేసింది. ‘ఓరి పిల్లా..చిత్తూరు పిల్లా..’ అంటూ సాగే ఈ పాటకు వనమాలి లిరిక్స్ అందించగా.. నూతన్ మోహన్, కృష్ణ తేజస్వీ ఆలపించారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. త్వరలోనే మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
-
‘జాలీ ఎల్ఎల్‌బీ 3’ టీజర్ రిలీజ్
అక్షయ్‌కుమార్ , అర్షద్ వార్షిలు కలిసి ‘బచ్చన్ పాండే’లో నవ్వులు పూయించారు. తాజాగా ఈ ఇద్దరూ ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 3’ మరోసారి నవ్వించేందుకు సిద్ధమయ్యారు. శుభాష్ కపూర్ దర్శకత్వంలో కోర్ట్ రూం డ్రామాగా తెరకెక్కిన ఈసినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సెప్టెంబర్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
-
రిలీజ్‌కు ముందే ‘కూలీ’ రికార్డు
రజనీకాంత్ హీరోగా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘కూలీ’ ఈ నెల 14న విడుదల కానుంది. తాజాగా ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేయడంతో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. దీంతో ఓవర్సీస్‌లో రికార్డు నమోదైంది. విడుదలకు రెండు రోజుల ముందే ‘కూలీ’ రెండు మిలియన్ల క్లబ్‌లో చేరిపోయింది. ప్రీమియర్స్‌లోనే ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన మొదటి తమిళ సినిమాగా రికార్డు నెలకొల్పింది.
-
నేను ‘ఓట్ చోరీ’కి మద్దతు ఇవ్వలేదు: కేకే మేనన్
కాంగ్రెస్ పార్టీ ‘ఓట్ చోరీ’ ప్రచారానికి బాలీవుడ్ నటుడు కేకే మేనన్ మద్దతిచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఆ వార్తలను ఖండించారు. తన అనుమతి లేకుండా ఓ షో కోసం తీసిన వీడియోను ఎడిట్ చేసి.. కాంగ్రెస్ నేతలు దానిని ఉపయోగించారని ఆరోపించారు. ఇందులో తన ప్రమేయం ఏ మాత్రం లేదని స్పష్టంచేశారు. తాను ఏ రాజకీయ పార్టీకీ, ఆందోళనలకు మద్దతుగా వ్యాఖ్యలు చేయలేదన్నారు.
-
పాట విషయంలో ChatGPT సాయం తీసుకున్నా: అనిరుద్
రజనీకాంత్ ‘కూలి’ సినిమాలో తాను ఓ పాటను కంపోజ్ చేయడానికి ChatGPT సాయం తీసుకున్నానని అనిరుద్ తెలిపారు. ‘‘నా పాట గురించి సమాచారాన్ని అందించి కంపోజిషన్ AIని అడిగాను. ప్రాంప్ట్‌తో పాటు AI నాకు పది లైన్లు ఇచ్చింది. అక్కడి నుండి నేను ఒక లైన్ చూశాను. ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో నేను మిగిలిన పాటను కంపోజ్ చేశాను’’ అని తెలిపారు.
-
నిజజీవిత పాత్రకు పూర్తి వ్యతిరేకం: శ్రుతి హాసన్
రజనీకాంత్ హీరోగా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా ‘కూలీ’. ఈ సినిమాలో శ్రుతి హాసన్ ప్రీతి అనే పాత్రలో కనిపించనున్నారు. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో పెదవి విప్పారు. ‘‘ప్రీతి నాలాంటి అమ్మాయి అని నేను చెప్పను. కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యాక చాలా మంది మహిళలు ఆ పాత్రకు కనెక్ట్ అవుతారు. ఆమె ఎంతో బాధ్యతగల అమ్మాయి. ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది’’ అని తెలిపారు.
-
ఈ పాత్ర గురించి నా మనవళ్లకు చెప్పను: నాగార్జున
రజనీకాంత్ హీరోగా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా ‘కూలీ’. ఈ సినిమాలో ‘సైమన్’ అనే విలన్ పాత్రలో నటిస్తున్నట్లు నటుడు నాగార్జున వెల్లడించారు. ఈ పాత్ర ఎంత చెడ్డదంటే, తన మనవళ్లకు కూడా చెప్పడానికి ఇష్టపడనని చమత్కరించారు. రజనీకాంత్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభవమని, సెట్‌లో ఆయన పాజిటివ్ వైబ్స్‌తో సహాయం చేశారని నాగార్జున ప్రశంసించారు.
-
MLA స్టిక్కర్ ఉన్న కారులో నాగవంశీ.. వీడియో వైరల్
ఏపీలోని కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ వాహనంలో నటి నిధి అగర్వాల్ ప్రయాణించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా MLA స్టిక్కర్ ఉన్న కారులో ప్రొడ్యూసర్ నాగవంశీ ఉన్న వీడియో వెలుగులోకి వచ్చింది. MLA స్టిక్కర్ ఉన్న కారులో నాగవంశీ ఎలా వెళ్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాగా నిన్న మంత్రి దుర్గేష్‌ను ప్రొడ్యూసర్‌ల బృందం కలిసింది.