రజనీకాంత్ హీరోగా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా ‘కూలీ’. ఈ మూవీలో హీరోయిన్ పూజాహెగ్డే ఓ హుషారైన పాటలో యూత్‌ను అలరించనున్నారు. మోనిక అంటూ సాగే ఆ పాట గురించి ఆమె స్పందించారు. ‘‘సూర్య రెట్రోలో ‘కనిమా..’ పాట విడుదల అయ్యే వరకూ అంత వైరలవుతుందని తెలియదు. కానీ, ‘కూలీ’లో పాట చిత్రీకరణలోనే ఇది బ్లాక్‌బస్టర్ అవుతుందని ప్రేక్షకులకు ఇది నచ్చుతుందని అర్థమైంది’’ అని చెప్పారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
నేడు ఒంగోలు పోలీస్ స్టేషన్‌కు RGV
ప్రముఖ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ నేడు ఒంగోలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు తమ ముందు విచారణకు హాజరుకావాలని ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్.. RGVకి నోటీసులు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌ల ఫోటోలను RGV మార్ఫింగ్ చేశారని మద్దిపాటు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
-
విడాకుల వార్తల వేళ.. హీరోయిన్ హన్సిక షాకింగ్ పోస్ట్
టాలీవుడ్ హీరోయిన్ హన్సిక, ఆమె భర్త సోహైల్ విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలపై హన్సిక పెట్టిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే తన పెళ్లి ఫొటోలను డిలీట్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. పుట్టినరోజు సందర్భంగా ఆమె పోస్ట్ చేస్తూ, ఈ ఏడాది తనకు చాలా పాఠాలు నేర్పిందని, తనలో ఎంతో బలం ఉందని తెలుసుకున్నానని రాసుకున్నారు. ఈ పోస్ట్ తో విడాకుల వార్తలపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది.
-
ఈ ఏడాది నుంచే నంది పురస్కారాలు: మంత్రి దుర్గేష్
AP: రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. త్వరలోనే నూతన పాలసీ తీసుకురానున్నట్టు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ ఏడాది నుంచే నంది అవార్డులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. నంది పురస్కారాలు, నాటకోత్సవాలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పలు సూచనలు చేశారని వెల్లడించారు.
-
హిందీలో రికార్డు సృష్టించిన’మహావతార్ నరసింహా’
‘మహావతార్ నరసింహ’ ఇప్పటివరకు భారత్లో రూ.175 కోట్లు వసూలు చేసింది. ఇక హిందీలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఏకైక యానిమేటెడ్ చిత్రంగా ఈ మూవీ నిలిచిందని పేర్కొంది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లు వసూలు చేసిందని నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ ప్రకటించింది. జులై 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
-
ఆర్.నారాయణ మూర్తిని పారితోషికంతో కొనలేం: త్రివిక్రమ్
దర్శక, నటుడు ఆర్. నారాయణ మూర్తిని పారితోషికంతో కొనలేమని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. నారాయణ మూర్తి కొత్త సినిమా ‘యూనివర్సిటీ పేపర్ లీక్’ చిత్రాన్ని ప్రసాద్ ల్యాబ్స్‌లో త్రివిక్రమ్ చూశారు. అనంతరం మాట్లాడారు. ‘‘సినీ పరిశ్రమలో నారాయణ మూర్తిది సుదీర్ఘ ప్రయాణం. ఆయన వన్‌మ్యాన్ ఆర్మీ. ఆయన చిత్రాల్లో రాజు ఆయనే, అణచివేతకు గురైన వారి తరఫున అందరికీ వినపడేలా ఆయన ప్రశ్నిస్తారు’’ అని తెలిపారు.
-
ఇలాంటి చెత్త సినిమాలు ఎందుకు చేస్తారని అడుగుతుంటారు: అనుపమ
తాను నటించిన ‘జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమా వివాదంపై అనుపమ పరమేశ్వరన్ తాజాగా స్పందించారు. ‘‘ ఈ మూవీ షూటింగ్ సమయంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ‘సినిమాని నాకు చూపించకపోతే నేను ప్రమోట్ చేయను’ అని చెప్పా. ఎందుకంటే అందులో ఏముందో నాకు తెలియాలి కదా. బయట వ్యక్తులకు ఇవన్నీ తెలియదు కాబట్టి ‘ఎందుకు ఇలాంటి చెత్త సినిమాలు చేస్తారు’ అని అడుగుతుంటారు.
-
నార్త్ అమెరికాలో ‘కూలీ’ హవా!
రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ ఈనెల 14న విడుదలకానుంది. ఈ క్రమంలో నార్త్ అమెరికాలో ఈ సినిమా ఏకంగా 1.9 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
-
ఆస్పత్రికి నటి అనుపమ.. ఏం జరిగిందంటే?
తాను నటించిన ‘పరదా’ సినిమా షూటింగ్ గురించి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఆసక్తికర విషయం చెప్పింది. ‘‘ఓ రోజు బ్రిడ్జిపై చిత్రీకరణ జరుగుతోంది. నేను కిందపడాల్సిన సన్నివేశమది. అదే సమయంలో కడుపు నొప్పి రావడంతో తట్టుకోలేక నేను కిందపడ్డా. ఆ విషయం తెలియని చిత్రబృందం బాగా నటిస్తున్నానని అనుకుంది. తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లారు’’ అని చెప్పారు.