రాజ్ తరుణ్ హీరోగా విజయ్ మిల్టన్ ఓ మూవీ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాపై దర్శకుడు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చాడు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను శ్రీరామ్, ప్రభు ఆగస్టు 27న ఉ.11:11 గంటలకు లాంచ్ చేయబోతున్నట్లు ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా ఈ మూవీకి సంబంధించిన ప్రధాన పాత్రల పోస్టర్లు కూడా రాబోతున్నట్లు వెల్లడించాడు. (పోస్ట్)
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
దిల్ రాజుకు ‘ఓజీ’ రైట్స్!
సుజిత్ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ‘ఓజీ’. సెప్టెంబర్ 25న రిలీజ్‌కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఒక సాలిడ్ న్యూస్ వైరల్‌గా మారింది. ఈ సినిమా నైజాం హక్కులను రూ.46 కోట్లలకు నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. ఇది నిజమైతే, నైజాం ఏరియాలో ఇది రికార్డు స్థాయి ధర అని చెప్పవచ్చు.
-
వారికి బాలీవుడ్ హీరోయిన్ వార్నింగ్
ముంబైలోని తన కొత్త ఇంటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతుండడంపై బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ సీరియస్ అయ్యింది. ఇలాంటి పనులు తమ గోపత్యకు భంగం కలిగించడమే కాకుండా.. భద్రత సమస్యలను సృష్టిస్తాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సోషల్‌మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. తన ఇంటి వీడియోలను షేర్ చేసిన వారు వెంటనే వాటిని తొలగించాలని విజ్ఞప్తి చేసింది.
-
‘‘బ్రహ్మాండ’.. ఓ కొత్త అనుభూతి’
టాలీవుడ్ సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాండ’. ఈసినిమా ఈనెల 29న విడుదల కాబోతుంది. ఈనేపథ్యంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమని మాట్లాడుతూ.. ‘‘‘బ్రహ్మాండ’ మూవీ తెలుగు ప్రేక్షకులకి ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇంత మంచి సినిమా సినిమా డైరెక్ట్ చేసిన రాంబాబు మన మధ్య లేకపోవడం బాధకారం’’ అని అన్నారు.
-
2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
ఇటీవల విడుదలైన యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహ’. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా వసూళ్ల సునామి సృష్టిస్తోంది. ఇక యూఎస్ మార్కెట్‌లో భారీ కలెక్షన్స్ అందుకొని దూసుకెళ్తుంది. తాజాగా ఈ చిత్రం 1.8 మిలియన్ డాలర్స్ మార్క్‌ను దాటేసి 2 మిలియన్ మార్క్ దిశగా పరుగులు పెడుతోంది. ఇక ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు.
-
ఆసక్తిగా ‘కొత్త లోక’ తెలుగు ట్రైలర్
కల్యాణి ప్రియదర్శన్, నస్లేన్ ప్రధాన పాత్రల్లో డామినిక్ అరుణ్ తెరకెక్కించిన చిత్రం ‘కొత్త లోక’. తొలిభాగం ‘కొత్త లోక:చంద్ర’ పేరుతో ఈ నెల 29న బాక్సాఫీసు ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే మలయాళం ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్ తెలుగు ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో సూపర్ పవర్స్ ఉన్న లోకగా కల్యాణి కనిపించారు. ట్రైలర్ ఎంతో ఆసక్తిగా ఉందని చెప్పాలి.
-
నాన్న ఆ నటితో ప్రేమలో పడ్డారు: శృతిహాసన్
కోలీవుడ్ ముద్దుగుమ్మ శృతిహాసన్ తన తండ్రి, నటుడు కమల్ హాసన్‌కు సంబంధించిన ఓ సీక్రెట్‌ను రివీల్ చేసింది. తన తండ్రి బెంగాలీ నటి అపర్ణ సేన్‌తో ప్రేమలో పడ్డారని.. ఆమె కోసమే ఆయన బెంగాలీ భాష నేర్చుకున్నారని శృతి వెల్లడించింది. ‘కూలీ’ ప్రమోషన్స్ టైమ్‌లో ఆమె ఈ విషయాన్ని పంచుకుంది.
-
‘ఇప్పటికీ నన్ను నేను గిల్లి చూసుకుంటున్నా’
మోహన్‌లాల్-మాళవిక మోహనన్ ప్రధాన పాత్రల్లో సత్యన్ అంతికాడ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘హృదయపూర్వం’. ఈ మూవీలో నటించడంపై మాళవిక సంతోషం వ్యక్తం చేసింది. ‘‘దర్శకుడు సత్యన్, మోహన్‌లాల్ లాంటి లెజెండ్స్‌తో కలిసి పనిచేశానా? అని ఇప్పటికీ నన్ను నేను గిల్లి చూసుకుంటున్నా. వారిద్దరూ ఊహాలకందని వ్యక్తులు. డెస్టినీ అంటే ఇదేనేమో’’ అని మాళవిక చెప్పుకొచ్చింది.
-
ఫ్యాన్స్‌కు హీరో కిచ్చా సుదీప్ కీలక విజ్ఞప్తి!
హీరో కిచ్చా సుదీప్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశారు. తన పుట్టినరోజు(సెప్టెంబర్ 2న) ఇంటిముందుకు వచ్చి నానా రబస చేయోద్దని సూచించాడు. ‘‘ప్రతిసారీ మీతో నా పుట్టిన రోజును జరుపుకుంటాను. కానీ ఈ సారి ఇది చాలా కష్టం. ఎందుకంటే నా తల్లి లేని మొదటి సంవత్సరం నా తల్లి లేకుండా ఈ వేడకను ఊహించుకోవడం నాకు కష్టంగా అనిపిస్తుంది’’ అని రాసుకొచ్చాడు.
-
ఆకట్టుకునేలా మోహన్‌లాల్ ‘హృదయపూర్వం’ ట్రైలర్
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘హృదయపూర్వం’. మాళవికా మోహనన్, సంగీత్ ప్రతాప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేసింది.