AP: రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. త్వరలోనే నూతన పాలసీ తీసుకురానున్నట్టు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ ఏడాది నుంచే నంది అవార్డులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. నంది పురస్కారాలు, నాటకోత్సవాలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పలు సూచనలు చేశారని వెల్లడించారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
హిందీలో రికార్డు సృష్టించిన’మహావతార్ నరసింహా’
‘మహావతార్ నరసింహ’ ఇప్పటివరకు భారత్లో రూ.175 కోట్లు వసూలు చేసింది. ఇక హిందీలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఏకైక యానిమేటెడ్ చిత్రంగా ఈ మూవీ నిలిచిందని పేర్కొంది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లు వసూలు చేసిందని నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ ప్రకటించింది. జులై 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
-
ఆర్.నారాయణ మూర్తిని పారితోషికంతో కొనలేం: త్రివిక్రమ్
దర్శక, నటుడు ఆర్. నారాయణ మూర్తిని పారితోషికంతో కొనలేమని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. నారాయణ మూర్తి కొత్త సినిమా ‘యూనివర్సిటీ పేపర్ లీక్’ చిత్రాన్ని ప్రసాద్ ల్యాబ్స్‌లో త్రివిక్రమ్ చూశారు. అనంతరం మాట్లాడారు. ‘‘సినీ పరిశ్రమలో నారాయణ మూర్తిది సుదీర్ఘ ప్రయాణం. ఆయన వన్‌మ్యాన్ ఆర్మీ. ఆయన చిత్రాల్లో రాజు ఆయనే, అణచివేతకు గురైన వారి తరఫున అందరికీ వినపడేలా ఆయన ప్రశ్నిస్తారు’’ అని తెలిపారు.
-
ఇలాంటి చెత్త సినిమాలు ఎందుకు చేస్తారని అడుగుతుంటారు: అనుపమ
తాను నటించిన ‘జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమా వివాదంపై అనుపమ పరమేశ్వరన్ తాజాగా స్పందించారు. ‘‘ ఈ మూవీ షూటింగ్ సమయంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ‘సినిమాని నాకు చూపించకపోతే నేను ప్రమోట్ చేయను’ అని చెప్పా. ఎందుకంటే అందులో ఏముందో నాకు తెలియాలి కదా. బయట వ్యక్తులకు ఇవన్నీ తెలియదు కాబట్టి ‘ఎందుకు ఇలాంటి చెత్త సినిమాలు చేస్తారు’ అని అడుగుతుంటారు.
-
నార్త్ అమెరికాలో ‘కూలీ’ హవా!
రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ ఈనెల 14న విడుదలకానుంది. ఈ క్రమంలో నార్త్ అమెరికాలో ఈ సినిమా ఏకంగా 1.9 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
-
ఆస్పత్రికి నటి అనుపమ.. ఏం జరిగిందంటే?
తాను నటించిన ‘పరదా’ సినిమా షూటింగ్ గురించి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఆసక్తికర విషయం చెప్పింది. ‘‘ఓ రోజు బ్రిడ్జిపై చిత్రీకరణ జరుగుతోంది. నేను కిందపడాల్సిన సన్నివేశమది. అదే సమయంలో కడుపు నొప్పి రావడంతో తట్టుకోలేక నేను కిందపడ్డా. ఆ విషయం తెలియని చిత్రబృందం బాగా నటిస్తున్నానని అనుకుంది. తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లారు’’ అని చెప్పారు.
-
ఓటీటీలోకి విజయ్ ‘కింగ్డమ్’
విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ చిత్రం ఓటీటీ రిలీజ్‌పై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈమూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 28 నుంచి ‘కింగ్డమ్’ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చే పనిలో ఉందట సంస్థ. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సివుంది.
-
‘సతీ లీలావతి’ ఫస్ట్ సాంగ్ రెడీ!
లావణ్య త్రిపాఠి-దేవ్ మోహన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సతీ లీలావతి’. ఈమూవీలోని ఫస్ట్ సాంగ్ రేపు ఉ.11గంటలకు రాబోతున్నట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ వదిలారు.
-
కంటెంట్ ఉంటే స్టార్స్ అవసరంలేదు!: దర్శకుడు
‘మహావతార్ నరసింహ’ మూవీ తాజాగా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈక్రమంలో దర్శకుడు అశ్విన్‌కుమార్ ఆనందం వ్యక్తంచేశారు. ‘‘దేశంలో యానిమేషన్ అంటే చిన్నారులకే అని పరిగణిస్తారు. కానీ మేం ఆ మైండ్‌సెట్‌ను మార్చాం.‘మహావతార్’లాంటి కథలకు యానిమేషనే సరైన ఎంపిక. కంటెంట్ బలంగా ఉంటే స్టార్ నటులు లేకపోయినా ప్రేక్షకులు సినిమాలు చూసేందుకు వస్తారు’’ అని పేర్కొన్నారు.