Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • నిధి వ్యవహారంపై స్పందించిన పవన్!

    AP: భీమవరంలో జరిగిన ఈవెంట్‌కు ప్రభుత్వవాహనంలో ప్రయాణించడం వెనుక తన ప్రమేయం ఏమీలేదని నిధి అగర్వాల్‌ తెలిపింది. తాజాగా ఆ ఈవెంట్ కోఆర్డినేటర్ పవన్‌కుమార్ దీనిపై స్పందించాడు. ‘‘విజయవాడలో ఇర్ఫాన్ అనే వ్యక్తితో కారు అరేంజ్ చేయించాము. కారు బ్రేక్‌డౌన్ కావడంతో నాగరాజు అనే వ్యక్తికి చెందిన ట్రావెల్స్ కారును ఉపయోగించాము. అయితే అది గవర్నమెంట్‌కు పనిచేస్తుందని తెలియదు. ఈవిషయాన్ని రాజకీయ చేయెద్దు’’ అని వెల్లడించాడు.

  • ‘మదరాసి’ మేకింగ్‌ వీడియో చూశారా?

    శివకార్తికేయన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మదరాసి’. సెప్టెంబర్ 5న ఈ మూవీ విడుదలకానుంది. తాజాగా మేకర్స్ మేకింగ్‌ వీడియోను రిలీజ్ చేశారు. శివకార్తికేయన్ ఈ సినిమాలో నయా అవతార్‌ను చూపించేందుకు ఎలా కష్టపడ్డాడో ఈ వీడియోతో హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

     

  • ప్రభుత్వ వాహనంలో ప్రయాణం.. నిధి అగర్వాల్‌ క్లారిటీ!

    ఏపీ ప్రభుత్వ వాహనంలో హీరోయిన్ నిధి అగర్వాల్‌ కనిపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై తాజాగా ఆమె ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. భీమవరంలో జరిగిన ఈవెంట్‌కు ఏపీ ప్రభుత్వ వాహనంలో రావడం వెనుక తన ప్రమేయం ఏమీ లేదని, నిర్వాహకులు ఏర్పాటు చేసిన వాహనంలో మాత్రమే ప్రయాణించానని నిధి వివరణ ఇచ్చింది. (ట్వీట్)

  • FDC ఛైర్మన్ వ్యవహార శైలిపై విమర్శలు

    TG: FDC ఛైర్మన్ దిల్ రాజు వ్యవహార శైలి ప్రభుత్వానికి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. సినీ కార్మికుల సమ్మెను పరిష్కరించడంలో విఫలమవడమే కాకుండా, నిర్మాతలకు, కార్మికులకు మధ్య దూరాన్ని పెంచుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితులను పవన్ కళ్యాణ్ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు నిర్మాతలను వైజాగ్‌కు ఆహ్వానించారట. ఇందుకోసం CM రమేష్ ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేశారని సమాచారం.

  • రూ.200 కోట్ల క్లబ్‌లోకి ‘మహావతార్‌: నరసింహ’

    యానిమేషన్‌ మూవీ ‘మహావతార్‌: నరసింహ’ జులై 25న విడుదలైన భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పటివరకూ ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.210 కోట్లకుపైగా కలెక్షన్స్ (గ్రాస్‌) చేసిందని మేకర్స్ వెల్లడించారు. అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్‌ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్‌ దేశాయ్, చైతన్య దేశాయ్‌ కలిసి ‘మహావతార్‌: నరసింహ’ చిత్రాన్ని నిర్మిం చారు.

  • ఎన్టీఆర్‌ మాషప్‌ వీడియో.. అభిమానులకు పూనకాలే!

    ఎన్టీఆర్‌-హృతిక్‌ రోషన్‌ ప్రధానపాత్రల్లో నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వార్-2’. ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్ర ప్రీ-రిలీజ్‌ వేడుక నిర్వహించారు. అయితే ఎన్టీఆర్‌ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఈ ఏడాదితో 25ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా క్రియేట్‌ చేసిన మాషప్‌ వీడియో ప్రీ-రిలీజ్‌కు వచ్చిన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

  • సినిమా షూటింగ్స్ బంద్‌పై మంత్రి కీలక సూచనలు

    TG: సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా వారికి మంత్రి కోమటిరెడ్డి కీలకసూచనలు చేశారు. మొత్తానికే షూటింగ్స్ బంద్ చేసి ఆందోళన చేయడం సరికాదని అన్నారు. పని చేస్తూనే డిమాండ్ల సాధన కోసం పోరాటం చేయాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి తప్పకుండా చేస్తానని ఈ సందర్భంగా వారికి కోమటిరెడ్డి భరోసా ఇచ్చారు.

     

  • ‘సుందరకాండ’ ట్రైలర్‌.. దిల్‌రాజును కూడా వడేశారుగా!

    నారా రోహిత్ హీరోగా శ్రీదేవి విజయ్‌కుమార్‌, వీర్తి వఘానీ హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న సినిమా ‘సుందరకాండ’. వెంకటేశ్‌ నిమ్మలపూడి దర్శకుడు. ఈ నెల 27న విడుదల కానున్న సినిమా ట్రైలర్‌ తాజాగా రిలీజ్‌ చేశారు. ట్రైలర్ ఎంతో ఆకట్టుకునేలా ఉందని చెప్పాలి.

  • నాని ‘ది ప్యారడైజ్‌’.. గ్లింప్స్ రిలీజ్‌

    నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్‌’. తాజాగా ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ షూటింగ్‌ పూర్తయింది. ఈనేపథ్యంలో దానికి సంబంధించిన మేకింగ్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

     

  • రూ.100 కోట్ల క్ల‌బ్‌లో విజ‌య్ ‘కింగ్డ‌మ్’

    విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన ‘కింగ్డ‌మ్’ చిత్రం తాజాగా రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. జూలై 31న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం మొద‌టిరోజు నుంచే బాక్సాఫీస్ వ‌ద్ద ప‌రుగులు పెడుతోంది. తాజాగా ఈ చిత్రం రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరిన‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. దీంతో గీతా గొవిందం(రూ.130 కోట్లు) త‌ర్వాత రెండోసారి రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరిన హీరోగా విజ‌య్ రికార్డును అందుకున్నాడు.