యానిమేషన్ మూవీ ‘మహావతార్: నరసింహ’ జులై 25న విడుదలైన భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పటివరకూ ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.210 కోట్లకుపైగా కలెక్షన్స్ (గ్రాస్) చేసిందని మేకర్స్ వెల్లడించారు. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ కలిసి ‘మహావతార్: నరసింహ’ చిత్రాన్ని నిర్మిం చారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
ఎన్టీఆర్ మాషప్ వీడియో.. అభిమానులకు పూనకాలే!
ఎన్టీఆర్-హృతిక్ రోషన్ ప్రధానపాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘వార్-2’. ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక నిర్వహించారు. అయితే ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఈ ఏడాదితో 25ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా క్రియేట్ చేసిన మాషప్ వీడియో ప్రీ-రిలీజ్‌కు వచ్చిన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
-
సినిమా షూటింగ్స్ బంద్‌పై మంత్రి కీలక సూచనలు
TG: సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా వారికి మంత్రి కోమటిరెడ్డి కీలకసూచనలు చేశారు. మొత్తానికే షూటింగ్స్ బంద్ చేసి ఆందోళన చేయడం సరికాదని అన్నారు. పని చేస్తూనే డిమాండ్ల సాధన కోసం పోరాటం చేయాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి తప్పకుండా చేస్తానని ఈ సందర్భంగా వారికి కోమటిరెడ్డి భరోసా ఇచ్చారు.
-
‘సుందరకాండ’ ట్రైలర్.. దిల్‌రాజును కూడా వడేశారుగా!
నారా రోహిత్ హీరోగా శ్రీదేవి విజయ్‌కుమార్, వీర్తి వఘానీ హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న సినిమా ‘సుందరకాండ’. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకుడు. ఈ నెల 27న విడుదల కానున్న సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్ ఎంతో ఆకట్టుకునేలా ఉందని చెప్పాలి.
-
నాని ‘ది ప్యారడైజ్’.. గ్లింప్స్ రిలీజ్
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. తాజాగా ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తయింది. ఈనేపథ్యంలో దానికి సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.
-
రూ.100 కోట్ల క్లబ్‌లో విజయ్ ‘కింగ్డమ్’
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్డమ్’ చిత్రం తాజాగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటిరోజు నుంచే బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. తాజాగా ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో గీతా గొవిందం(రూ.130 కోట్లు) తర్వాత రెండోసారి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన హీరోగా విజయ్ రికార్డును అందుకున్నాడు.
-
‘పెద్ద నిర్మాతలతో పోలిస్తే చిన్న నిర్మాతల కష్టాలు వేరు’
సినీ కార్మికులకు 30 శాతం వేతనం పెంపుపై పలువురు చిన్న నిర్మాతలు మీడియా సమావేశంలో పాల్గొని తమ కష్టాలు వివరించారు. పెద్ద నిర్మాతలతో పోలిస్తే చిన్న నిర్మాతల కష్టాలు వేరని ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ పేర్కొన్నారు. ఆర్థికంగా నిర్మాతలకు చాలా సమస్యలుంటాయి. ప్రస్తుతం సినీ వ్యాపారం బాగోలేదు. ఓ ప్రాతిపదికన కాకుండా అందరికీ వేతనం పెంచి ఇవ్వాలంటే కష్టం’’ అని తెలిపారు.
-
టైగర్ ‘బాఘీ-4’ టీజర్.. రక్తపాతమే!
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బాఘీ-4’. ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఎ.హర్ష దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియావాలా కథ, స్క్రీన్‌ప్లేను అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహారించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్‌ను విడుదలైంది. (టీజర్)
-
విడుదలకు ముందే ‘కూలీ’ సర్‌ప్రైజ్!
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘కూలీ’ ఆగస్టు 14న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో మూవీటీమ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇటీవల జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్‌ను ఓటీటీలోకి తీసుకొచ్చింది. ఈ ఈవెంట్‌ను సన్‌నెక్స్ట్ వేదికగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో రజనీకాంత్ ఫన్నీ స్పీచ్‌తో పాటు ఇతర అగ్రతారలు పంచుకున్న విశేషాలను, అనిరుధ్ పెర్ఫామెన్స్‌ను ‘Coolie Unleashed’ పేరుతో అప్‌లోడ్ చేశారు.
-
శివుడు అనుగ్రహిస్తేనే.. ప్రభాస్ పెళ్లి: శ్యామలాదేవి
హీరో ప్రభాస్ వివాహం కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రభాస్‌కు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులకు ఉందని ఆమె తెలిపారు. అయితే, శివుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే ప్రభాస్ పెళ్లి జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభాస్ తన సినిమాలతో బిజీగా ఉన్నారని చెప్పారు.