Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ముగిసిన రానా ఈడీ విచారణ

    నటుడు దగ్గుబాటి రానా ఈడీ విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్స్ కేసులో ఆయనను నాలుగు గంటల పాటు ఈడీ విచారించింది. ఈ విచారణలో 30 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టిన అధికారులు స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేశారు. ఎప్పుడు విచారణకు పిలిచిన అందుబాటులో ఉండాలన్న ఈడీ సూచించారు. ఐదేళ్ల బ్యాంక్ స్టేట్మెంట్‌ను ఈడీకి రానా సమర్పించాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడటానికి నిరాకరించాడు.

  • విడాకుల రూమర్స్ వేళ హన్సిక ఆసక్తికర పోస్ట్‌!

    హీరోయిన్ హన్సిక విడాకులు తీసుకోనున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ వార్తలను సోహైల్‌ ఖండించినప్పటికీ హన్సిక మాత్రం ఇప్పటివరకూ మౌనంగానే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తన సోషల్‌ మీడియా నుంచి పెళ్లి ఫొటోలు డిలీట్ చేయడంతో వీటికి మరింత బలం చేకూరింది.

  • ‘మాస్ జాతర’ టీజర్‌పై నెటిజన్ల రియాక్ష‌న్‌ ఇదే

    ‘మిస్టర్ బచ్చన్’ వంటి డిజాస్టర్ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా రిలీజైన ఈ మూవీ టీజర్‌లో రవితేజ మార్క్ ఎలివేషన్స్, బిల్డప్ షాట్స్ బాగానే ఉన్నప్పటికీ ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతోంది. కాగా, ఈ సినిమా ఆగస్టు 27న రిలీజ్ కానుంది.

  • మా మావయ్య చిరు చెప్పింది పాటిస్తున్నా: ఉపాసన

    హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ‘‘సాధారణంగా చాలా మందికి పెరుగు చివర్లో తినే అలవాటు ఉంటుంది. కానీ నేను పెళ్లి తర్వాత తొలిసారి లంచ్‌కి అందరితో కలిసి కూర్చుని తినేటప్పుడు, మొదట పెరుగు వేసుకుని తినడం మొదలుపెట్టాను. అప్పుడు మా మావయ్య చిరంజీవి పెరుగు చివర్లో తినాలి ఆరోగ్యపరంగా మంచిదని చెప్పారు. అప్పటి నుంచి నేను అదే పాటిస్తున్నాను’’అని తెలిపారు.

     

  • ఏపీ ప్రభుత్వ వాహనంలో న‌టి నిధి అగర్వాల్ షికారు

    ఇటివల ఒక పనిమీద విజ‌య‌వాడ‌కి వెళ్లిన నటి నిధి అగర్వాల్ ఏపీ ప్రభుత్వ వాహనంలో ప్రయాణించినట్లుగా పలు ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీంతో ప్రభుత్వ నిధులతో నిర్వహించే వాహనాలను వ్యక్తిగత, వాణిజ్య కార్యక్రమాలకు ఎలా ఉపయోగిస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే, దీనిపై ప్రభుత్వం నుండి, నిధి అగర్వాల్ నుంచి ఎటువంటి స్పందన లేదు.

  • రవితేజ ‘మాస్‌ జాతర’ టీజర్‌ రిలీజ్‌

    హీరో రవితేజ నుంచి రానున్న 75వ చిత్రం ‘మాస్‌ జాతర’. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఆగస్టు 27న  విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో రవితేజ పోలీస్‌ పాత్రలో ‘నాకంటూ ఓ చరిత్ర ఉంది..’ అంటూ మాస్‌ డైలాగులతో అలరిస్తూ కనిపించారు.

  • ఈడీ విచారణకు హాజరైన రానా

    HYD: ఈడీ కార్యాలయానికి నటుడు రానా చేరుకున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో ఈడీ విచారణకు రానా హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే నటులు విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్‌ తమ వివరణను ఈడీకి తెలిపారు. మరోవైపు ఈనెల 13న ఈడీ విచారణకు నటి మంచు లక్ష్మి హాజరుకానున్నారు.

  • భార్య చీపురుతో కొట్టిందనే నటుడు సిద్ధి ఆత్మహత్య?

    కన్నడ హాస్య నటుడు చంద్రశేఖర సిద్ధి (31) ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిద్ధిని అతని భార్య కర్రతో కొట్టిన వీడియో వెలుగులోకి వచ్చింది. తన భార్య చీపురతో, కట్టెతో కొట్టడంతోనే ఆవేదనకు గురై అతడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. కాగా, 2020లో ‘కామెడీ ఖిలాడిగలు’ అనే షోతో గుర్తింపు తెచ్చుకున్న సిద్ధి.. తర్వాత కొన్ని సీరియల్స్‌లో నటించాడు.

     

  • ఫ్యాన్స్‌కు లైఫ్‌ టైమ్‌ మూమెంట్స్‌ ఇచ్చిన NTR

    నిన్న జరిగిన ‘వార్-2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ తన అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలను ఇచ్చారు. ఓ ఫ్యాన్‌ వచ్చి కాళ్లు మొక్కగా అతడిని హగ్‌ చేసుకొని పంపించారు. ఆ తర్వాత మూగ, చెవిటి ఫ్యాన్‌ రాగా అతడిని హృతిక్‌కూ పరిచయం చేసి, ఫొటో తీయించారు. ఇక స్పీచ్‌లో  మరో ఫ్యాన్‌ ముజీబ్‌ పేరును ప్రస్తావిస్తూ స్టేజీపైనే కలిశారు. దీంతో అక్కడి అభిమానులంతా ఉత్సాహంగా ఆనందాన్ని వ్యక్తం చేశారు.

  • ‘వార్‌2’ మూవీకి కౌంట్‌డౌన్‌

    సినీ ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాక్షన్‌ చిత్రం ‘వార్‌2’. హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్, కియారా అడ్వాణీ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఆగస్టు 14న ఈ మూవీ పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.  ప్రచార చిత్రాలు చూస్తే, గత స్పై చిత్రాలకు ఏమాత్రం తీసి పోని విధంగా యాక్షన్‌కు పెద్ద పీట వేసినట్లు అర్థమవుతోంది.