Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • రవితేజ ‘మాస్‌ జాతర’ టీజర్‌ రిలీజ్‌

    హీరో రవితేజ నుంచి రానున్న 75వ చిత్రం ‘మాస్‌ జాతర’. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఆగస్టు 27న  విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో రవితేజ పోలీస్‌ పాత్రలో ‘నాకంటూ ఓ చరిత్ర ఉంది..’ అంటూ మాస్‌ డైలాగులతో అలరిస్తూ కనిపించారు.

  • ఈడీ విచారణకు హాజరైన రానా

    HYD: ఈడీ కార్యాలయానికి నటుడు రానా చేరుకున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో ఈడీ విచారణకు రానా హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే నటులు విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్‌ తమ వివరణను ఈడీకి తెలిపారు. మరోవైపు ఈనెల 13న ఈడీ విచారణకు నటి మంచు లక్ష్మి హాజరుకానున్నారు.

  • భార్య చీపురుతో కొట్టిందనే నటుడు సిద్ధి ఆత్మహత్య?

    కన్నడ హాస్య నటుడు చంద్రశేఖర సిద్ధి (31) ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిద్ధిని అతని భార్య కర్రతో కొట్టిన వీడియో వెలుగులోకి వచ్చింది. తన భార్య చీపురతో, కట్టెతో కొట్టడంతోనే ఆవేదనకు గురై అతడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. కాగా, 2020లో ‘కామెడీ ఖిలాడిగలు’ అనే షోతో గుర్తింపు తెచ్చుకున్న సిద్ధి.. తర్వాత కొన్ని సీరియల్స్‌లో నటించాడు.

     

  • ఫ్యాన్స్‌కు లైఫ్‌ టైమ్‌ మూమెంట్స్‌ ఇచ్చిన NTR

    నిన్న జరిగిన ‘వార్-2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ తన అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలను ఇచ్చారు. ఓ ఫ్యాన్‌ వచ్చి కాళ్లు మొక్కగా అతడిని హగ్‌ చేసుకొని పంపించారు. ఆ తర్వాత మూగ, చెవిటి ఫ్యాన్‌ రాగా అతడిని హృతిక్‌కూ పరిచయం చేసి, ఫొటో తీయించారు. ఇక స్పీచ్‌లో  మరో ఫ్యాన్‌ ముజీబ్‌ పేరును ప్రస్తావిస్తూ స్టేజీపైనే కలిశారు. దీంతో అక్కడి అభిమానులంతా ఉత్సాహంగా ఆనందాన్ని వ్యక్తం చేశారు.

  • ‘వార్‌2’ మూవీకి కౌంట్‌డౌన్‌

    సినీ ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాక్షన్‌ చిత్రం ‘వార్‌2’. హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్, కియారా అడ్వాణీ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఆగస్టు 14న ఈ మూవీ పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.  ప్రచార చిత్రాలు చూస్తే, గత స్పై చిత్రాలకు ఏమాత్రం తీసి పోని విధంగా యాక్షన్‌కు పెద్ద పీట వేసినట్లు అర్థమవుతోంది.

     

  • ‘టబు-రమ్యకృష్ణలో ఎవరు బెస్ట్.. నాగార్జున ఏం చెప్పారంటే?’

    నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్‌ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ . తొలి ఎపిసోడ్‌కు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై, సందడి చేశారు. దీనికి సంబంధిత ప్రోమో  విడుదలైంది. ‘రమ్యకృష్ణ, టబు.. వీరిద్దరిలో బెస్ట్‌ కో యాక్ట్రెస్‌ ఎవరు?’ అని జగపతి ప్రశ్నించగా ‘కొన్ని చెప్పకూడదు.. నేను చెప్పను’ అని సరదాగా పేర్కొన్నారు నాగార్జున.

  • ‘కూలీ’ కథేంటి..? ఇప్పుడు అంతటా ఇదే చర్చ

    రజనీకాంత్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌దర్శకత్వంలో రూపొందిన ‘కూలీ’ చిత్రం ఆగస్టు 14న  పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.  ఈ మూవీలో నాగార్జున  ప్రతినాయకుడిగా నటిస్తుండటం మరో విశేషం. ఉపేంద్ర, శ్రుతిహాసన్, సౌబిన్‌ షాహిర్‌, సత్యరాజ్‌లతో పాటు, ఆమిర్‌ఖాన్‌ పాత్ర స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలవనుంది.  అయితే.. ప్రచార చిత్రాలు, పోస్టర్‌లు విడుదల చేసినా లోకేశ్‌ ఎంచుకున్న కథేంటి? అన్నదానిపై ఇప్పటివరకూ ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు.

     

     

  • ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సిరీస్‌లు ఇవే

    • కానిస్టేబుల్‌ కనకం(ఈటీవీ విన్‌) -ఆగస్టు 14
    • అంధేరా (అమెజాన్‌ ప్రైమ్‌) -ఆగస్టు 14
    • కోర్ట్‌ కచేరీ (సోనీలివ్‌) -ఆగస్టు 13
    • సర్‌ (బుక్‌ మై షో) ఆగస్టు 11

  • ఫైసల్‌ ఖాన్‌ ఆరోపణలపై స్పందించిన ఆమిర్‌ కుటుంబం

    బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ఖాన్‌పై అతని సోదరుడు ఫైసల్‌ ఖాన్‌ సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏడాది పాటు ఆమిర్‌ తనను గదిలో బంధించాడని ఫైసల్‌ ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై ఆమిర్‌తో పాటు ఆయన కుటుంబం స్పందించింది. ‘‘ఫైసల్‌కు సంబంధించి ప్రతి నిర్ణయం సమష్టిగానే తీసుకున్నాం. ఎంతో మంది డాక్టర్లను సంప్రదించి అతడికి వైద్యం అందించాం. ఇది మా కుటుంబ విషయం దీన్ని గాసిప్‌లా మార్చొద్దని’’అని పేర్కొంటూ నోట్‌ విడుదల చేసింది.

  • వన్‌ మిలియన్‌ డాలర్ క్లబ్‌లోకి ‘మహావతార్ నరసింహ’

    హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘మహావతార్: నరసింహ’ సంచలనం సృష్టించింది. ఈ చిత్రం హిందీలో రూ.100 కోట్లు వసూలు చేసి, అద్భుతమైన విజయాన్ని సాధించింది. అంతేకాకుండా, నార్త్ అమెరికాలో వన్ మిలియన్ డాలర్ క్లబ్‌లోకి చేరి, అంతర్జాతీయంగానూ తన సత్తా చాటింది. ఈ సినిమా అపారమైన అభిమానాన్ని పొంది, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.