Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • తన మొదటి అభిమానిని పరిచయం చేసిన ఎన్టీఆర్

    వార్2 ప్రీరిలీజ్ ఈవెంట్‌లో తన మొదటి ఫ్యాన్‌ను ఎన్టీఆర్ పరిచయం చేశారు. ‘‘రామోజీరావు గారు నన్ను పరిచయం చేసినప్పుడు నా పక్కన అమ్మ, నాన్న తప్ప ఎవరూ లేరు. అప్పుడు నన్ను కలిసిన మొదటి అభిమాని మూజీబ్. అక్కడి నుంచి మొదలైన ప్రయాణంలో ఇంతమంది అభిమానుల ప్రేమను పొందడం నా అదృష్టం’’ అని తెలిపారు.

  • నేటి నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్ పూర్తిగా బంద్

    HYD : టాలీవుడ్‌లో సోమవారం నుంచి షూటింగ్స్ పూర్తిగా బంద్ కాబోతున్నాయి. నిన్న జరిగిన చర్చల్లో ఫెడరేషన్ డిమాండ్స్‌కు ఛాంబర్ ఒప్పుకోకపోవడంతో.. షూటింగ్‌లు బంద్ చేస్తున్నట్టు ఫిలిం ఫెడరేషన్ ప్రకటించింది. షూటింగ్స్ బంద్ నేపధ్యంలో నేడు నిర్మాతలు , ఫెడరేషన్ నాయకులతో తెలంగాణా సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి చర్చలు జరపబోతున్నారు. ఫెడరేషన్ నాయకులు మధ్యాహ్నం తరువాత మంత్రి కోమటిరెడ్డిని కలిసే అవకాశం ఉంది.

  • నటుడు కమల్‌హాసన్‌కు బెదిరింపులు

    ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌కు బెదిరింపులు ఎదురయ్యాయి. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు కమల్ హాసన్ తల నరికేస్తానని తమిళ సీరియల్ నటుడు రవిచంద్రన్ అన్నారు. దీంతో రవిచంద్రన్‌పై కమల్‌హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టారు.

  • ఇవాళ మంత్రి దుర్గేష్‌తో ఫిలిం ఛాంబర్ సభ్యులు భేటీ

    AP: ఇవాళ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ను ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు, కొందరు నిర్మాతలు కలవనున్నారు. మాధ్యాహ్నం 12 గంటలకు ఈ సమావేశం జరగనుంది. సినీ కార్మికుల సమ్మె నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలోనూ ఏపీ ప్రభుత్వ పెద్దలతో టాలీవుడ్ ప్రతినిధుల సమావేశం వాయిదా పడింది.

  • నేడు ED విచారణకు రానా

    బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో హీరో రానా ఇవాళ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. జులై 23న విచారణకు రావాలని ED కోరగా మరో తేదీ కావాలని రానా కోరాడు. దాంతో కచ్చితంగా ఆగస్టు 11న హాజరవ్వాలన్నారు. నగదు లావాదేవీలు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో సంబంధాలపై ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ED విచారణకు ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ హాజరయ్యారు.

     

  • తారక్‌లో నన్ను నేను చూసుకున్నా: హృతిక్ రోషన్

    ‘వార్2’ ప్రీ-రిలీజ్‌ వేడుకలో హృతిక్ రోషన్ మాట్లాడారు. ‘‘తారక్‌ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఏ సీన్‌నైనా తారక్‌ తన వంద శాతం చేస్తాడు. తను ఒక సారి నటించాక ఇంకో షార్ట్‌ అనేది ఉండదు. అంత పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది తన నటన. అది నేను తారక్‌ దగ్గర నేర్చుకునాన్నను. దాన్ని నేను నా తరువాత చిత్రాల్లో చూపిస్తాను. తన 25 ఏళ్ల కెరీర్‌లో తారక్‌లో నన్ను నేను చూసుకున్నానని’’ తెలిపాడు.

  • (VIDEO)క్షమాపణలు కోరిన NTR

    TG: ‘వార్-2′ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం యంగ్ టైగర్ NTR క్షమాపణలు కోరుతూ ఎక్స్‌లో ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘ఇందాక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. నన్ను క్షమించాలి. ఈవెంట్ సజావుగా జరిగేందుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్య వాదాలు. CM రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, పోలీస్ డిపార్ట్మెంట్ అందించిన సపోర్టు పాదాభివందనాలు’ అని పేర్కొన్నారు.

     

  • సినిమా బాగోలేకపోతే పదింతలు నన్ను తిట్టండి: నాగవంశీ

    ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో నాగవంశీ మాట్లాడుతూ, ‘వార్ 2’ చూసిన తర్వాత ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని, సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పారు. మొదటి రోజు హిందీ వసూళ్ల కంటే తెలుగులో ఎక్కువ వసూళ్లు రావాలని ఆకాంక్షించారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్-ఇండియా స్థాయిలో మెరిసిపోతారని ఆయన పేర్కొన్నారు.

  • ‘పరదా’ ప్రమోషన్‌లో అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు!

    AP: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ విశాఖపట్నంలో సందడి చేసింది. ఆమె నటించిన ‘పరదా’ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా టీమ్‌తో కలిసి ఆమె విశాఖకు వెళ్లింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో అనుపమ ఆస్తికర వ్యాఖ్యలు చేసింది. అందరూ ‘పరదా’ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 22న రిలీజ్‌ కానుంది.

  • ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!

    ‘వార్‌2’ మూవీ ప్రీ-రిలీజ్‌ వేడుకలో హీరో ఎన్టీఆర్.. ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఆయన మాట్లాతుండగా.. ఫ్యాన్స్ కేకలు వేస్తూ అల్లరి చేశారు. దీంతో తారక్ స్పీచ్ ఆపి వెళ్లిపోమంటారా?.. అంటూ ఆగ్రహించాడు. మాట్లాడేటప్పుడు సైలెంట్‌గా ఉండాలంటూ ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇచ్చాడు.