Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • తారక్‌లో నన్ను నేను చూసుకున్నా: హృతిక్ రోషన్

    ‘వార్2’ ప్రీ-రిలీజ్‌ వేడుకలో హృతిక్ రోషన్ మాట్లాడారు. ‘‘తారక్‌ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఏ సీన్‌నైనా తారక్‌ తన వంద శాతం చేస్తాడు. తను ఒక సారి నటించాక ఇంకో షార్ట్‌ అనేది ఉండదు. అంత పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది తన నటన. అది నేను తారక్‌ దగ్గర నేర్చుకునాన్నను. దాన్ని నేను నా తరువాత చిత్రాల్లో చూపిస్తాను. తన 25 ఏళ్ల కెరీర్‌లో తారక్‌లో నన్ను నేను చూసుకున్నానని’’ తెలిపాడు.

  • (VIDEO)క్షమాపణలు కోరిన NTR

    TG: ‘వార్-2′ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం యంగ్ టైగర్ NTR క్షమాపణలు కోరుతూ ఎక్స్‌లో ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘ఇందాక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. నన్ను క్షమించాలి. ఈవెంట్ సజావుగా జరిగేందుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్య వాదాలు. CM రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, పోలీస్ డిపార్ట్మెంట్ అందించిన సపోర్టు పాదాభివందనాలు’ అని పేర్కొన్నారు.

     

  • సినిమా బాగోలేకపోతే పదింతలు నన్ను తిట్టండి: నాగవంశీ

    ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో నాగవంశీ మాట్లాడుతూ, ‘వార్ 2’ చూసిన తర్వాత ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని, సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పారు. మొదటి రోజు హిందీ వసూళ్ల కంటే తెలుగులో ఎక్కువ వసూళ్లు రావాలని ఆకాంక్షించారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్-ఇండియా స్థాయిలో మెరిసిపోతారని ఆయన పేర్కొన్నారు.

  • ‘పరదా’ ప్రమోషన్‌లో అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు!

    AP: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ విశాఖపట్నంలో సందడి చేసింది. ఆమె నటించిన ‘పరదా’ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా టీమ్‌తో కలిసి ఆమె విశాఖకు వెళ్లింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో అనుపమ ఆస్తికర వ్యాఖ్యలు చేసింది. అందరూ ‘పరదా’ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 22న రిలీజ్‌ కానుంది.

  • ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!

    ‘వార్‌2’ మూవీ ప్రీ-రిలీజ్‌ వేడుకలో హీరో ఎన్టీఆర్.. ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఆయన మాట్లాతుండగా.. ఫ్యాన్స్ కేకలు వేస్తూ అల్లరి చేశారు. దీంతో తారక్ స్పీచ్ ఆపి వెళ్లిపోమంటారా?.. అంటూ ఆగ్రహించాడు. మాట్లాడేటప్పుడు సైలెంట్‌గా ఉండాలంటూ ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇచ్చాడు.

  • ‘వార్‌2’ చేయడానికి కారణం అదే: ఎన్టీఆర్‌

    ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘వార్2’ ప్రీ-రిలీజ్‌ వేడుకలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌ మాట్లాడారు. ‘‘‘వార్‌2’ చేయడానికి ముఖ్య కారణం.. కథ, ఇతర విషయాలు కాదు. ‘నువ్వు ఈ సినిమా చేయాలి. మీ అభిమానులు గర్వపడేలా ఈ మూవీ తీస్తా’ అని చెప్పిన ఆదిత్య చోప్రాకు నా ధన్యవాదాలు’’ అని తారక్ తెలిపారు.

  • తారక్ మీకు అన్న.. నాకు తమ్ముడు: హృతిక్‌

    ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ కీలక పాత్రల్లో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వార్‌2’. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా హృతిక్‌ రోషన్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అంతేకాదు ఆయన తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నాడు.

  • అసలైన కథ తెరపైనే చూడండి: అయాన్‌ ముఖర్జీ

    హైదరాబాద్‌లో నిర్వహించిన ‘వార్‌2’ ప్రీ-రిలీజ్‌‌లో మూవీ దర్శకుడు అయాన్‌ ముఖర్జీ మాట్లాడారు. ‘‘వార్‌2’ లాంటి గొప్ప ప్రతిష్టాత్మక సినిమా చేయడం నా అదృష్టం. సినిమా థియేటర్‌లో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. హృతిక్‌, తారక్‌లాంటి నటుల్ని కలిపి ఈ స్క్రిప్ట్‌లోకి తీసుకొచ్చి, వాళ్లను దర్శకత్వం చేయడమంటే పెద్ద బాధ్యత.‘వార్‌1’కు మించి ‘వార్‌2’ ఉంటుంది’’ అని అన్నారు.

  • ఎన్టీఆర్‌-హృతిక్‌.. అలాంటివారు: త్రివిక్రమ్

    ఎన్టీఆర్‌-హృతిక్‌లు వింధ్య, హిమాచల పర్వతాలలాంటి వారని, అలాంటి వారి సినిమా కచ్చితంగా ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వార్‌2’. కియారా అడ్వాణీ కథానాయిక. ఆగస్టు 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్‌ వేడుకకు విచ్చేసిన త్రివిక్రమ్‌ తనదైన శైలిలో మాట్లాడి అలరించారు.

  • మెగాస్టార్ చిరంజీవికి అరుదైన అవార్డు!

    యూజెనిక్స్‌ ఫిల్మ్‌ఫేర్‌ గ్లామర్‌ అండ్‌ స్టైల్‌ అవార్డ్స్‌ సౌత్‌ 2025 వేడుక తాజాగా జరిగింది. దక్షిణాది వినోద రంగంలో గ్లామర్‌, స్టైలిష్ పర్సనాలిటీస్‌కు తొలిసారిగా ఈ అవార్డులను ప్రకటించారు. తరాలు మారినా తరగని అందం, స్టైల్‌తో యంగ్ హీరోలకు పోటీగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి ‘స్టైల్‌ ఐకాన్‌ డౌన్‌ ది ఇయర్స్‌’ అవార్డుకు ఎంపికయ్యారు.