ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కలిసి నటించిన ‘వార్-2’ ఈనెల 14న విడుదలకానుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తిచేసుకుంది. అయితే సినిమాకు ‘U/A’ సర్టిఫికేట్ ఇచ్చే ముందు CBFC.. చిత్రయూనిట్‌కు కొన్ని మార్పులను సూచించినట్లు సమాచారం. వాటిలో హీరోయిన్ కియారా బికినీ సీన్స్‌లో 9సెకన్ల విజువల్స్‌ను తొలగించాలని ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సివుంది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
Live: ‘వార్-2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కీలక పాత్రల్లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘వార్-2’. కియారా అడ్వాణీ హీరోయిన్. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. (లైవ్ వీడియో)
-
రమ్యకృష్ణ, టబు.. బెస్ట్ ఎవరు?: నాగార్జున ఏమన్నారంటే?
నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’. ఫస్ట్ ఎపిసోడ్‌కు హీరో నాగార్జున ముఖ్యఅతిథిగా హాజరై సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో ఆదివారం విడుదలైంది. ‘రమ్యకృష్ణ, టబు.. వీరిద్దరిలో బెస్ట్ కో యాక్ట్రెస్ ఎవరు?’ అని జగపతి ప్రశ్నించగా ‘కొన్ని చెప్పకూడదు.. నేను చెప్పను’ అని నాగ్ సరదాగా పేర్కొన్నారు. పూర్తి ఎపిసోడ్ ఓటీటీ ‘జీ5’లో ఈనెల 15న స్ట్రీమింగ్‌కానుంది.
-
‘సుందరకాండ’ Rap ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఫన్నీ వీడియో!
నారా రోహిత్ హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి తెరకెక్కుతున్న సినిమా ‘సుందరకాండ’. శ్రీదేవి విజయ్‌కుమార్ హీరోయిన్. ఈనెల 27న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. తాజాగా చిత్ర ట్రైలర్ రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రేపు సా.5:02గంటలకు విడుదల చేయనున్నట్లు ఓ ఫన్నీ వీడియో వదిలారు.
-
తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును కట్టి తీరుతాం: మంత్రి ఉత్తమ్
TG: రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీరుపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా దేవాదుల పంపుహౌస్ పరిశీలించి.. పనులపై సమీక్ష నిర్వహించారు. ఉత్తమ్ మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లోని ముంపు ప్రాంతాలకు పరిహారం ఇవ్వడానికి సిద్ధమన్నారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును కట్టి తీరుతామని స్పష్టం చేశారు.
-
మమ్ముట్టి ‘గే’ పాత్రపై బాలీవుడ్ స్టార్ కామెంట్స్!
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం తాజా ఓ ఇంటర్వ్యూలో మలయాళ పరిశ్రమ, ముఖ్యంగా మెగాస్టార్ మమ్ముట్టిపై ప్రశంసలు కురిపించారు. ‘‘మలయాళ మూవీ మేకర్స్ ప్రయోగాలకు వెనుకాడరు. మమ్ముట్టి, మోహన్‌లాల్ నా అభిమాన నటులు. ‘కాథల్: ది కోర్’ మూవీలో మమ్ముట్టి ‘గే’ పాత్రలో నటించారు. ఆయన ధైర్యవంతుడు కాబట్టే ఆ రోల్ ప్లే చేయగలిగారు’’ అని జాన్ కొనియాడారు.
-
బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నాగ్.. బిగ్‌బాస్-9 ప్రోమో!
కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్’. ఈ షో 9వ సీజన్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా స్పెషల్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో వెన్నెల కిషోర్ హౌస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమవగా, సీజన్-9లో నాగార్జున చెప్పిన కండీషన్స్ విని ఆయన ఆశ్చర్యపోయారు. ‘ఈసారి డబుల్ హౌస్.. డబుల్ డోస్’ అంటూ సీజన్‌పై ఆసక్తిని పెంచారు.
-
పెళ్లి పీటలెక్కబోతున్న ‘అరుంధతి’ నటి
‘అరుంధతి’ సినిమాలో బాలనటిగా చేసిన దివ్య నగేశ్ పెళ్లి పీటలెక్కబోతుంది. గత ఐదేళ్లుగా సహనటుడు, కొరియోగ్రాఫర్ అజయ్ కుమార్‌ను ప్రేమిస్తున్న దివ్య.. ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకుంది. ఆగస్టు 18న వీరి వివాహం జరగనుంది. ఈ క్రమంలో వెడ్డింగ్ ఫొటోషూట్స్‌లో దివ్య బిజీగా ఉంది. అలానే తన ఫ్రెండ్స్‌తో బ్యాచిలర్ పార్టీ చేసుకుంది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. (ఫోటోలు)
-
Video: ఆ వయసులోనే లైంగిక వేధింపులు.. బాలీవుడ్ నటి
తనకు చిన్న వయసులోనే లైంగిక వేధింపులు ఎదురయ్యాయని బాలీవుడ్ నటి అయేషా ఖాన్ వెల్లడించింది. ‘‘నేను రోడ్డుపై నడుస్తుండగా.. వెనక నుంచి మా నాన్న ఫ్రెండ్ పిలిచాడు. బాబాయ్ పిలవగానే వెనక్కి చూశాను. ఆయన నా దగ్గరగా వచ్చి.. నీ వక్షోజాలు బాగున్నాయని చెప్పి. బైక్‌పై వెళ్లాడు. మళ్లీ వెనక్కి చూస్తే కన్ను కొడుతూ.. అసభ్యకరంగా ప్రవర్తించాడు’’ అని తెలిపింది. (వీడియో)
-
అజిత్ దంపతుల ప్రత్యేక పూజలు.. భర్త కాళ్లు మొక్కిన షాలిని!
తమిళ హీరో అజిత్ కుమార్ తన భార్య షాలినితో కలిసి ఓ ఆలయాన్ని సందర్శించారు. గుడిలో దంపతులిద్దరూ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తన భార్యకు నుదుట తిలకం దిద్దారు. ఆమె కూడా అజిత్ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ వీడియోను అజిత్ భార్య తన షాలిని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. (వీడియో)