Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • అజిత్ దంపతుల ప్రత్యేక పూజలు.. భర్త కాళ్లు మొక్కిన షాలిని!

    తమిళ హీరో అజిత్ కుమార్ తన భార్య షాలినితో కలిసి ఓ ఆలయాన్ని సందర్శించారు. గుడిలో దంపతులిద్దరూ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తన భార్యకు నుదుట తిలకం దిద్దారు. ఆమె కూడా అజిత్ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ వీడియోను అజిత్ భార్య తన షాలిని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. (వీడియో)

     

  • మాది అలాంటి ప్రేమకథ కాదు.. ఉపాసన ఆసక్తికర కామెంట్స్!

    మెగా ఫ్యామిలీతో తన అనుబంధం ప్రారంభమైన విశేషాలను హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. హైదరాబాద్‌లో ‘ఫేమస్‌’ ఐస్‌క్రీమ్‌ కావాలంటూ తన భర్త రామ్‌చరణ్‌కు ప్రేమ పరీక్ష పెట్టిన సరదా సంఘటనను కూడా ఇందులో చెప్పింది. తమది ‘మగధీర’ సినిమాలో లాంటి ప్రేమకథ కాదని.. ఎలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వివాహబంధంతో ఒక్కటయ్యారనే సంగతులను ఉపాసన తెలిపింది.

     

  • భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మహావతార్‌’

    ‘మహావతార్‌: నరసింహ’ మూవీ భారీ కలెక్షన్లతో దూసుకెళ్తూ చరిత్ర తిరగరాస్తోంది. ఇప్పటివరకూ ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.175 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు.

  • తమిళ స్టార్ డైరెక్టర్‌తో సమంత మూవీ!

    స్టార్ హీరోయిన్ సమంత నెక్ట్స్ మూవీపై అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సమంతతో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అయితే ప్రస్తుతం లైన్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి.. సమ్‌తో లేడీ ఓరియంటెడ్ సినిమా చేసేందుకు పెద్ద స్కెచ్ వేశారట. దీనికోసం ఇప్పటి నుంచే సమంత డేట్స్.. ఫైనల్ చేసుకుంటున్నాడట లోకేష్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.

  • ‘వార్‌-2’ టికెట్ బుకింగ్స్ షురూ!

    హృతిక్‌ రోషన్‌-ఎన్టీఆర్‌ కలిసి నటించిన ‘వార్‌-2’ ఈనెల 14న విడుదల కానుంది. ఈనేపథ్యంలో మూవీ టికెట్స్ బుకింగ్స్ ప్రారంభించినట్లు మేకర్స్ సరికొత్త పోస్టర్ వదిలారు.

  • పవన్ ‘OG’ నుంచి క్రేజీ అప్‌డేట్!

    పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘OG’. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం మూవీ డబ్బింగ్స్‌ పనులు పూర్తయ్యాయని.. సెప్టెంబర్ 2న రిలీజ్ చేసేందుకు టీజర్‌ను కూడా కట్ చేశారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  • ఆకట్టుకునేలా ‘కాగితం పడవలు’ గ్లింప్స్!

    ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో ఓ బ్యూటీఫుల్ లవ్ స్టొరీ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘కాగితం పడవలు’ అనే టైటిల్ పెట్టారు.అయితే తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్‌ని కట్టిపడేసింది. ‘‘చాలా దూరం వెళ్ళిపోయావు గోదావరి. నిన్ను ఎక్కడ వదిలేశానో అక్కడే నిలబడి ఉన్నాను రామ్’’ అనే డైలాగ్స్ ప్రేమకథలోని డెప్త్‌ని తెలియజేస్తున్నాయి.

  • ముగ్గురు మెగా హీరోలు ఒకే చోట.. ఫొటో వైరల్‌

    రామ్‌చరణ్‌ , వరుణ్‌తేజ్‌ , సాయి దుర్గా తేజ్‌.. ఈ ముగ్గురు కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. జిమ్‌లో వ్యాయామం అనంతరం దిగిన ఈ ఫొటోను వరుణ్‌ తేజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ముగ్గురు హీరోల అభిమానులు దీనిని రీ పోస్టు చేస్తూ.. వారి కొత్త సినిమా టైటిళ్ల హ్యాష్‌ట్యాగ్‌లను యాడ్‌ చేస్తున్నారు. దీంతో రామ్ చరణ్ న్యూమూవీ #Peddi మరోసారి ట్రెండింగ్‌లోకి నిలిచింది.

  • ‘మాస్ జాతర’ నుంచి మాస్ పోస్టర్

    రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న ‘మాస్ జాతర’ మూవీ టీజర్ రేపు ఉదయం 11:08కి విడుదల కానుంది. ఈ సినిమాను భాను భోగవరపు తెరకెక్కిస్తున్నారు.

  • కిస్సిక్ టాక్ షోలో అమర్ దీప్ ఏం చెప్పారంటే

    జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా చేస్తున్న కిస్సిక్ టాక్ షోకి బిగ్‌బాస్ ఫేమ్ అమర్‌దీప్ గెస్ట్‌గా వచ్చాడు. తన భార్య తేజస్వినిని తన జీవితంలోకి రావడం ఒక అదృష్టం, దేవుడిచ్చిన వరం అని ఆయన తెలిపారు.  అలాగే తన కొత్త సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. అమర్‌దీప్ ఫుల్ ఇంటర్వ్యూను మీరు చూసేయండి.