Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ఒక్క సినిమాతో.. 10 ఏళ్లపాటు వరుస అవకాశాలు

    కెప్టెన్ ప్రభాకరన్ చిత్రం 34 ఏళ్ల తర్వాత 4కే వెర్షన్‌లో ఈ నెల 22న విడుదల కానుంది. దీని ఆడియో, ట్రైలర్‌ను చెన్నైలో విడుదల చేశారు. నటి రమ్యకృష్ణ మాట్లాడుతూ, తెలుగులో నటిస్తున్న సమయంలో ఈ చిత్రం తనకు పెద్ద విజయాన్ని అందించిందని, దాని తర్వాత పదేళ్ల పాటు వరుసగా అవకాశాలు లభించాయని చెప్పారు. ఈ చిత్రాన్ని స్పారో సినిమాస్ రీరిలీజ్ చేస్తుంది.

     

  • ఫ్యాషన్ షోలో మెరిసిన నటి జాన్వీ కపూర్

    ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కోచర్ కలెక్షన్ క్వాంటం ఎంటాంగిల్‌మెంట్‌ను ముంబైలో ఆవిష్కరించారు ఈ షోలో నటి జాన్వీకపూర్‌ లెహంగాలో అభిమానులను మెస్మరైజ్‌ చేసింది. ఈ షోలో జాన్వీ షోస్టాపర్‌గా నిలిచింది.

  • మా నాన్న చెప్పులు, వైర్లతో కొట్టేవాడు: నటి

    తనను తన తండ్రి చిత్రహింసలకు గురి చేసేవాడని సినీ నటి గాయత్రి గుప్తా చెప్పారు. ‘‘మా నాన్నకు ఐదుగురు కుమార్తెలం. ఆయనకు అబ్బాయి కావాలని ఉండేది. మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నా అమ్మాయే పుట్టింది. అప్పటినుంచి నన్ను చీపురు, చెప్పులు, వైర్లతో కొట్టి కారం వేసేవాడు. నేను పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా మా నాన్నలాంటివాడే. అందుకే విడాకులు ఇచ్చా’’ అని పేర్కొన్నారు.

  • చర్చలు ఫలించకపోతే.. చిత్రీకరణలు బంద్‌: ఫిల్మ్‌ ఫెడరేషన్‌

    HYD: ఈరోజు చర్చలు ఫలించకపోతే చిత్రీకరణలు పూర్తిగా నిలిపివేస్తామని సినీ కార్మిక సంఘాల నేతలు తెలిపారు. ఇప్పటికే షెడ్యూల్‌ ఉంటే ఒకట్రెండు రోజులు సమయం ఇస్తామన్నారు. వారు మీడియాతో మాట్లాడారు. ‘‘నిర్మాత విశ్వప్రసాద్‌ నోటీసు ఎందుకు పంపారో తెలియదు. నేరుగా పంపే అధికారం లేనందున ఫిల్మ్‌ ఛాంబర్‌కు నోటీసులు పంపిస్తాం. ఛాంబర్‌ నిర్ణయం మేరకే తుది కార్యాచరణ ఉంటుంది’’అని ఫెడరేషన్‌ నేతలు స్పష్టం చేశారు.

  • నాని లుక్ VIRAL

    నిన్న జరిగిన ఫిలింఫేర్ ఈవెంట్‌‌‌‌లో నాని కొత్త లుక్‌తో కనిపించారు. ఈ లుక్‌ ఇది ఆయన రాబోయే సినిమా ‘ది ఫార్యడైజ్’ కోసమని అందరు అనుకుంటున్నారు. నాని పెద్ద జుట్టు, గడ్డం, విభిన్నమైన దుస్తులు ధరించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే, ఆయన వేసుకున్న దుస్తులు గతంలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ధరించినవి కావడంతో కొందరు ట్రోల్ చేస్తున్నారు. రణవీర్ కూడా ఈ డ్రెస్ వల్ల విమర్శలు ఎదుర్కొన్నారు.

  • చిరంజీవి మాతో టచ్‌లో ఉన్నారు: అనిల్

    ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి తమతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. ఫిల్మ్ ఛాంబర్‌తో చర్చలు జరపాలని ఆయన తమకు సూచించారన్నారు. అలాగే ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ నోటీసులపై కోర్టులోనే చూసుకుంటామని స్పష్టం చేశారు. పిపుల్స్ మీడియా తమకు ఇవ్వాల్సిన రూ.90 లక్షలను వెంటనే చెల్లించాలన్నారు. ఇకపై విశ్వప్రసాద్ షూటింగ్స్‌లో పాల్గొనబోమని చెప్పారు.

  • బాలకృష్ణతో సినిమా.. శ్రీను వైట్ల ఏమన్నారంటే?

    బాలకృష్ణతో సినిమా చేయకపోవడానికి కారణమేంటన్న ప్రశ్నపై దర్శకుడు శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. బాలకృష్ణపై తనకు అభిమానం ఉందని, ఒకప్పుడు ఆయనతో సినిమా చేయాల్సి ఉన్నా సాధ్యపడలేదని తెలిపారు. భవిష్యత్తులో తప్పకుండా తెరకెక్కిస్తానన్నారు. బాలకృష్ణ నటించిన ‘ప్రాణానికి ప్రాణం’ సినిమాతోనే అప్రెంటీస్‌గా తన కెరీర్‌ మొదలైందని గుర్తు చేసుకున్నారు.

     

  • హరీష్ శంకర్‌తో సల్మాన్ ఖాన్ మూవీ?

    బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ త్వరలో తెలుగు డైరెక్టర్ హరీష్ శంకర్‌తో కలిసి పని చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను నిర్మాత దిల్ రాజుతో కలిసి చేస్తున్నాడు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించే ఛాన్స్ ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

  • ‘ఉదయ్‌పుర్‌ ఫైల్స్‌’ నిర్మాతకు బెదిరింపులు!

    ‘ఉదయ్‌పుర్‌ ఫైల్స్‌’ విడుదల నేపథ్యంలో తనను హత్య చేస్తానంటూ ఓ వ్యక్తి నుంచి బెదిరింపులు వచ్చాయని నిర్మాత అమిత్‌ జానీ తెలిపారు. ఈ మేరకు తనకు బెదిరింపు కాల్‌ వచ్చిన నంబరును  సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. PMO, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసు శాఖల సోషల్‌మీడియా ఖాతాలను ట్యాగ్‌ చేశారు. అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో అమిత్‌ జానీకి కేంద్ర హోంశాఖ వై కేటగిరీ భద్రత కల్పించింది.

  • ‘SSMB29’.. మహేశ్‌బాబు లుక్ ఇలానే ఉంటుందేమో?

    సూపర్ స్టార్ మహేశ్‌బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో రానున్న చిత్రం ‘SSMB29’. నిన్న మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మెడలో త్రిశూలంతో ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే అందులో మహేశ్ ఫేస్‌ను రివీల్ చేయలేదు. ఈ క్రమంలో ఓ అభిమాని ఆ పోస్టర్‌కు AIతో మహేశ్ మాస్ లుక్‌ను యాడ్ చేశాడు. ఈ లుక్ అదిరిపోయినట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.