ప్రముఖ అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ ఎంగేజ్‌మెంట్ నిన్న తన ప్రియుడు, NFL ప్లేయర్ ట్రావిస్ కెల్సేతో జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా టేలర్ పోస్ట్ చేశారు. ‘మీ ఇంగ్లిష్ టీచర్, జిమ్ టీచర్ వివాహం చేసుకోబోతున్నారు’ అని రాసుకొచ్చారు. తనను తాను ఇంగ్లిష్ టీచర్‌గా టేలర్ పేర్కొనడంపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. వీరి పెళ్లి ఎప్పుడనే విషయాన్ని వెల్లడించలేదు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘నటన కన్నా అందులోనే ఎక్కువ ఆనందం’
కోలీవుడ్ నటుడు రవి మోహన్ నిర్మాణ సంస్థ లాంచ్ ఈవెంట్‌లో హీరో శివ కార్తికేయన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘నాకు నటన కన్నా సినిమాలు నిర్మించడంలోనే ఎక్కువ ఆనందం. రవి మోహన్.. నిర్మాతగా నేను మీకు సీనియర్‌ని. ఎక్కువ చిత్రాలు నిర్మించండి’’ అని శివ కార్తికేయన్ విజ్ఞప్తి చేశారు. వీరిద్దరు కలిసి ‘పరాశక్తి’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
-
ఆ కష్టాలేంటో నాకు తెలుసు: హీరో కార్తి
కోలీవుడ్ నటుడు రవి మోహన్ నిర్మాణ సంస్థ లాంచ్ ఈవెంట్‌లో హీరోలు కార్తి, శివ కార్తికేయన్ సందడి చేశారు. కార్తి మాట్లాడుతూ.. తాను రవి మోహన్‌తో కలిసి నటించనున్నట్టు తెలిపారు. రవి చెప్పిన కథ బాగా నచ్చిందని, దానిని ఆయనే తెరకెక్కిస్తాడని చెప్పారు. సినిమా నిర్మాణంలో ఉన్న కష్టాలేంటో తనకు తెలుసని.. అందుకే ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించే ఉద్దేశం లేదని సరదాగా పేర్కొన్నారు.(Video)
-
డైరెక్టర్‌గా హీరో.. హీరోగా కమెడియన్!
కోలీవుడ్ హీరో జయం రవి డైరెక్టర్‌గా మెగాఫోన్ పట్టనున్నాడు. కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో.. ఆయన సినిమా తెరకెక్కించనున్నారని గతంలో ప్రచారం జరిగింది. తాజాగా దానిపై రవి స్పందించాడు. యోగిబాబుతో తాను రూపొందించనున్న ‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్’ తన ప్రొడక్షన్ హౌస్‌కి రెండో చిత్రమని చెప్పారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతోనే నిర్మాణ సంస్థ నెలకొల్పానని, ఓటీటీ ప్రాజెక్టులూ నిర్మిస్తానని ఆయన తెలిపారు.
-
Video: ఆ హీరోయిన్‌పై రుక్మిణి వసంత్ ఆసక్తికర కామెంట్స్!
కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ సాయి పల్లవిపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘సాయి పల్లవి నిజంగా అమేజింగ్ యాక్టర్. పీపుల్‌కు ఎలా కమ్యునికేట్ చెయ్యాలో తనకు తెలుసు. తన కెరీర్‌ను బిల్డ్ చేసుకోవడానికి ఏం చేయాలో క్లారిటీ ఉంది. ముఖ్యంగా తన పర్ఫామెన్స్ నిజంగా బ్యూటిఫుల్’’ అని రుక్మిణి చెప్పుకొచ్చింది. (Video)
-
రాజ్‌తరుణ్ కొత్త మూవీ టైటిల్‌కు డేట్ ఫిక్స్!
రాజ్ తరుణ్ హీరోగా విజయ్ మిల్టన్ ఓ మూవీ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాపై దర్శకుడు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చాడు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను శ్రీరామ్, ప్రభు ఆగస్టు 27న ఉ.11:11 గంటలకు లాంచ్ చేయబోతున్నట్లు ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా ఈ మూవీకి సంబంధించిన ప్రధాన పాత్రల పోస్టర్లు కూడా రాబోతున్నట్లు వెల్లడించాడు. (పోస్ట్)
-
దిల్ రాజుకు ‘ఓజీ’ రైట్స్!
సుజిత్ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ‘ఓజీ’. సెప్టెంబర్ 25న రిలీజ్‌కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఒక సాలిడ్ న్యూస్ వైరల్‌గా మారింది. ఈ సినిమా నైజాం హక్కులను రూ.46 కోట్లలకు నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. ఇది నిజమైతే, నైజాం ఏరియాలో ఇది రికార్డు స్థాయి ధర అని చెప్పవచ్చు.
-
వారికి బాలీవుడ్ హీరోయిన్ వార్నింగ్
ముంబైలోని తన కొత్త ఇంటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతుండడంపై బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ సీరియస్ అయ్యింది. ఇలాంటి పనులు తమ గోపత్యకు భంగం కలిగించడమే కాకుండా.. భద్రత సమస్యలను సృష్టిస్తాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సోషల్‌మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. తన ఇంటి వీడియోలను షేర్ చేసిన వారు వెంటనే వాటిని తొలగించాలని విజ్ఞప్తి చేసింది.
-
‘‘బ్రహ్మాండ’.. ఓ కొత్త అనుభూతి’
టాలీవుడ్ సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాండ’. ఈసినిమా ఈనెల 29న విడుదల కాబోతుంది. ఈనేపథ్యంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమని మాట్లాడుతూ.. ‘‘‘బ్రహ్మాండ’ మూవీ తెలుగు ప్రేక్షకులకి ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇంత మంచి సినిమా సినిమా డైరెక్ట్ చేసిన రాంబాబు మన మధ్య లేకపోవడం బాధకారం’’ అని అన్నారు.
-
2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
ఇటీవల విడుదలైన యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహ’. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా వసూళ్ల సునామి సృష్టిస్తోంది. ఇక యూఎస్ మార్కెట్‌లో భారీ కలెక్షన్స్ అందుకొని దూసుకెళ్తుంది. తాజాగా ఈ చిత్రం 1.8 మిలియన్ డాలర్స్ మార్క్‌ను దాటేసి 2 మిలియన్ మార్క్ దిశగా పరుగులు పెడుతోంది. ఇక ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు.