Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ప్రధాని మోదీకి ప్రకాశ్‌రాజ్ కౌంటర్

    నేడు కర్ణాటకకు ప్రధాని మోదీ రానున్నారు. బెంగళూరు-బెళగావి మధ్య వందేభారత్‌ రైలు, మెట్రో ఎల్లో మార్గం ప్రారంభం, మెట్రో 3వ దశకు శంకుస్థాపన కార్యక్రమాలలో ఆయన పాల్గొననున్నారు. ఈ క్రమంలో మోదీకి నటుడు ప్రకాశ్‌రాజ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘మోదీ జీ.. మీరు ఇంత దూరం వస్తున్నారు కాబట్టి.. దయచేసి మహాదేవపుర నియోజకవర్గానికి వెళ్లి అక్కడ ‘ఓటు చోరీ’ జరగలేదని స్పష్టం చేయగలరా?’’ అని ట్వీట్ చేశారు.

  • అల్లు అర్జున్‌కు చేదు అనుభవం

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు చేదు అనుభవం ఎదురైంది. నిన్న ముంబై ఎయిర్‌పోర్టుకు కళ్లజోడు, మాస్క్ పెట్టుకుని అల్లు అర్జున్ వెళ్లారు. ఈ క్రమంలో చెకింగ్ పాయింట్ వద్ద ఉన్న సెక్యూరిటీ అల్లు అర్జున్‌ను గుర్తుపట్టకుండా ఆయనను ఆపేశారు. బన్నీ అసిస్టెంట్ ‘ఆయన అల్లు అర్జున్’ అని చెప్పినా ముఖం చూపించాల్సిందే అని పట్టుబట్టారు. దీంతో కళ్లజోడు, మాస్క్ తీసి చూపించారు.

  • OTTలోకి హారర్ థ్రిల్లర్ మూవీ

    ‘Bed Rest’ అనే హారర్ థ్రిల్లర్ లోరీ ఎవాన్స్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో గర్భిణీ స్త్రీ భయంకరమైన అతీంద్రియ శక్తులతో పోరాడుతుంది. ఈ సినిమా 2022 డిసెంబర్ 7న Tubiలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్, తెలుగు సబ్ టైటిల్స్‌తో అందుబాటులోకి వచ్చింది.  మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

     

     

  • ప్రముఖ రాపర్‌పై కాల్పులు.. మృతి

    జార్జియా రాపర్ టి-హుడ్‌(33)ను హత్యకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం గ్విన్నెట్ కౌంటీలోని తన ఇంట్లో హుడ్‌ను దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా READY 2 GO, Big Booty, Perculator వంటి పాటలతో టి-హుడ్ ప్రసిద్ధి చెందారు.

  • వర్షంతో ‘వార్-2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బ్రేక్?

    బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, జూనియర్ NTR నటించిన  సినిమా  ‘WAR-2’ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో  ఈ రోజు సా. 5 గంటలకు ప్రీ రిలీజ్ నిర్వహించనున్నారు. అధికారికంగా పలు రోడ్లలో ఆంక్షలు విధించారు. అయితే, నగరంలో భారీ వర్షాలు పడుతుండడంతో ఈవెంట్‌కు బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది.

  • TDP మద్దతుదారులు vs NTR ఫ్యాన్స్.. కారణమిదే!

    AP: టీడీపీ మద్దతుదారులు, ఎన్టీఆర్ అభిమానుల మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణంగా ఆగస్టు 14న రిలీజ్ ‘కూలీ’ సినిమా విడుదల సందర్భంగా రజనీకాంత్‌కు మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. దీంతో అదే రోజున రిలీజ్ కానున్న ఎన్టీఆర్, హృతిక్ రోషన్ సినిమా ‘వార్2’ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే లోకేశ్ ఇలా చేశారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నట్లు సమాచారం.

  • రాజమౌళి హీరోలకు అది ఉండాల్సిందే!

    డైరెక్టర్ రాజమౌళికి తన హీరో మెడలో ఏదో ఒక లాకెట్ వేయాలనే సెంటిమెంట్ ఉందని, మహేశ్ బాబు ‘ssmb29’ నుంచి వచ్చిన మూవీ పోస్టర్‌తో రుజువైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సింహ్రాదిలో కత్తి, ఛత్రపతిలో శంఖం, యమదొంగలో రౌండ్‌ లాకెట్‌, ఈగలో పెన్సిల్‌ హార్ట్‌, బాహుబలిలో శివలింగం, RRRలో ఓం(చరణ్‌), పులిగోరు(తారక్‌), ఇప్పుడు మహేశ్‌కు నందీశ్వరుడితో కూడిన త్రిశూలం లాంటివి జక్కన్నకు సెంటిమెంట్‌గా ఉంటున్నాయని చెబుతున్నారు.

  • కూలీ రిలీజ్.. సెలవు ప్రకటించిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ

    నటుడు రజినీకాంత్‌ హీరోగా నటించిన ‘కూలీ’ మూవీ ఈనెల 14న రిలీజ్ కానుంది. రజినీ సినిమా ఫస్ట్‌ డే  చూసేందుకు తమ ఉద్యోగులు యూనో ఆక్వా కేర్‌ అనే సాఫ్ట్‌వేర్‌ సంస్థ సెలవు ప్రకటించింది. చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునల్వేలి, మధురై, చెంగల్పట్టు, అరపాలయం, మట్టుతవానిల్లోని బ్రాంచీలకు సెలవు వర్తిస్తుందని సర్క్యులర్‌ పంపింది. తమ ఉద్యోగుల వినతి మేరకే ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

     

  • డిఫరెంట్ లుక్‌లో అల్లు అర్జున్

    ముంబై ఎయిర్‌పోర్టులో ఐకాన్‌ ఫ్రార్‌ అల్లు అర్జున్‌ కొత్త లుక్‌లో కనిపించారు. ఆయన జుట్టుకు రంగుతో డిఫరెంట్‌గా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్.. అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రూ.800 కోట్ల అంచనా బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె, జాన్వీ కపూర్‌, మృణాల్‌ ఠాకూర్‌, రష్మిక నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

  • ‘వార్‌-2’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్.. ట్రాఫిక్‌ ఆంక్షలు

    HYD: హృతిక్‌ రోషన్‌, జూనియర్‌ ఎన్టీఆర్ నటించిన ‘వార్‌-2’ సినిమా ప్రీ-రిలీజ్‌ వేడుక ఇవాళ యూసుఫ్‌గూడలోని కేవీబీఆర్‌ స్టేడియంలో జరగనుంది. ఇవాళ సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే ఈ వేడుక సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని నగర పోలీసులు తెలిపారు. ప్రీ-రిలీజ్‌ వేడుకకు పెద్దసంఖ్యలో ప్రజలు హాజరవుతారని అసౌకర్యాన్ని నివారించడానికి ప్రయాణికులు కేవీబీఆర్‌ స్టేడియం వైపు వెళ్లకుండా ఉండాలని సూచించారు.