Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘పరదా’లో అనుపమ నట విశ్వరూపాన్ని చూస్తారు: రామ్ పోతినేని

    అనుపమ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ‘పరదా’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హీరో రామ్ పోతినేని హాజరయ్యారు. రామ్ మాట్లాడుతూ.. అనుపమలో చాలా టాలెంట్ ఉంది. మూవీ షూటింగ్‌లో అనుపమకు పరదా వేశాక డైరెక్టర్‌గారు షాట్ ఎలా ఒకే చేశారు అని చిన్న డౌట్ ఉంది. పరదా వేసిన కూడా అనుపమ నట విశ్వరూపం చూస్తాను అని అనుకుంటున్నానని తెలిపాడు.

  • నార్త్‌లో ‘కూలీ’ బుకింగ్స్ షురూ!

    రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ చిత్రం పాన్‌ఇండియా స్థాయిలో ఈనెల 14న విడుదకానుంది. ఈనేపథ్యంలో నార్త్ ఇండియాలో టికెట్ బుకింగ్స్ ప్రారంభించినట్లు మేకర్స్ ప్రకటించారు.

  • మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ హీరో!

    టాలీవు నటుడు వడ్డే నవీన్ మ‌ళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం ‘టాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు’. క‌మ‌ల్ తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. వడ్డే న‌వీనే ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నేడు రాఖీ పండుగ సంద‌ర్భంగా మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్‌ను మేకర్స్ విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో వ‌డ్డే న‌వీన్ కానిస్టేబుల్ పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ాడు.

  • ధనుష్‌తో డేటింగ్.. మృణాల్ క్లారిటీ!

    కొద్ది రోజులుగా మృణాల్ ఠాకూర్‌-హీరో ధనుష్ డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మృణాల్ దీనిపై స్పందించింది. “ధనుష్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే. మా గురించి వచ్చిన రూమర్లు నన్ను నవ్వించాయి. ధనుష్‌కు అజయ్ దేవగన్ సన్నిహితుడు, ఆయన ఆహ్వానంతోనే ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ఈవెంట్‌కి వచ్చారు. దయచేసి తప్పుగా ఆలోచించ‌కండి’’ అని మృణాల్ క్లారిటీ ఇచ్చింది.

  • నిర్మాతలతో చర్చలు విఫలం: అనిల్ వల్లభనేని

    సినీ కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతలు మాట్లాడిన దానిపై ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని స్పందించారు. నిర్మాతలతో జరిగిన చర్చలు విఫలమయ్యాయని చెప్పారు. వాళ్ల ప్రతిపాదనని తాము ఒప్పుకోలేదని, ఫెడరేషన్‌ని విభజించేలా వేతనాల నిర్ణయం తీసుకున్నారని అన్నారు. యూనియన్లంటికీ సమానంగా వేతనం పెంచాలని కోరారు. మీటింగ్‌లో జరిగింది వేరు, వాళ్లు బయటకొచ్చి మాట్లాడింది వేరు అని.. నిర్మాతలు విధించిన షరతులకు ఒప్పుకొనేది లేదని తేల్చిచెప్పారు.

  • ‘మహావతార్: నరసింహ’ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?

    హొంబలే నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా ‘మహావతార్: నరసింహ’. ఈ చిత్రం మరో రికార్డ్ సృష్టించింది. జూలై 25న రిలీజైన ఈ మూవీ రోజురోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ పోతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకుపైగా వసూళ్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు హోంబలే సంస్థ ట్వీట్ కూడా చేసింది.

  • సినీ కార్మికుల వేతనాల పెంపు.. నిర్మాతల కీలక నిర్ణయం!

    సినీకార్మికుల ఆందోళనపై నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. మూడు విడతలుగా వేతనాలు పెంచాలని నిర్ణయించారు. రోజుకు 2000 లోపు ఉన్నవారికి తొలి విడతలో 15శాతం, రెండో విడతలో 5శాతం, మూడో విడతలో 5శాతం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే 1000 లోపు ఉన్న కార్మికులకు 20శాతం ఒకేసారి పెంచుతామని వెల్లడించారు. తాము పెట్టిన నిబంధనలకి ఒప్పుకుంటే వేతనాలు పెంచడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

  • ఆసక్తిగా అనుపమ ‘పరదా’ ట్రైలర్‌

    అనుపమ పరమేశ్వన్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘పరదా’. ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 22న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా శనివారం ట్రైలర్‌ విడుదలైంది. ఈ కార్యక్రమానికి హీరో రామ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. మహిళా సాధికారతతో కూడిన కథాంశంతో ఈ మూవీని తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

     

  • ‘కిష్కిందపురి’ విడుదలకు ముహుర్తం ఫిక్స్!

    బెల్లంకొండ సాయి శ్రీనివాస్-అనుపమ పరమేశ్వరన్ జంటగా న‌టిస్తున్న చిత్రం ‘కిష్కిందపురి’. ఈమూవీని సెప్టెంబ‌ర్ 12న విడుదల చేయబోతున్న‌ట్లు మేకర్స్ ప్ర‌క‌టించారు.

  • ప్రముఖ నటుడు కన్నుమూత

    ప్రముఖ ఐరిష్ నటుడు ఫ్రాంక్ గ్రిమ్స్ (78) కన్నుమూశారు. వయసురీత్యా వచ్చే సమస్యలతో మరణించినట్లు తెలుస్తోంది. పాపులర్ బ్రిటిష్ షో ‘కరోనేషన్ స్ట్రీట్’ సిరీస్‌లో బెర్నీ కార్నర్‌గా నటించి ఆకట్టుకున్నారు. ‘ఏ బ్రిడ్జి టూ ఫార్’, ‘ది ఔట్‌ సైడర్’, ‘ది వేల్స్ ఆఫ్ ఆగస్ట్’, వంటి పలు చిత్రాలతో పాపులారిటీ సాధించారు.