Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • అవన్నీ అవాస్తవాలు.. నేనెవరినీ కలవలేదు: చిరంజీవి

    సినీ కార్మికుల వేతనాల పెంపు అంశం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. శనివారం తనని సినీ కార్మికులు కలిశారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తన మూవీ షూటింగ్‌ కార్మికులకు వేతనం పెంచి ఇస్తామని చిరంజీవి హామీ ఇచ్చారంటూ వస్తున్న వార్తలను ఖండించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు.

  • ‘వార్‌-2’ రన్‌టైమ్‌ ఫిక్స్‌!

    హృతిక్‌ రోషన్‌,ఎన్టీఆర్‌, కియారా అడ్వాణీ కీలక పాత్రల్లో అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ ‘వార్‌-2’.ఆగస్టు 14న మూడు భాషల్లో విడుదల కానుంది. ఒక్కో భాషలో ఒక్కో రన్‌టైమ్‌తో వస్తుండటం గమనార్హం. సీబీఎఫ్‌సీ ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. హిందీ రన్‌టైమ్‌ 2 గంటల 53 నిమిషాల, 24 సెకన్లు కాగా.. తెలుగు, తమిళ భాషల్లో 2 గంటల 51 నిమిషాల 44 సెకన్లుగా మేకర్స్ నిర్ణయించారు.

  • దుల్కర్‌ ‘కాంత’ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

    దుల్కర్‌ సల్మాన్‌, భాగ్యశ్రీ బోర్సే జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకుడు. దుల్కర్‌తో కలిసి హీరో రానా తదితరులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర నుంచి ‘పసి మనసే.. వినదసలే’ అంటూ సాగే రొమాంటిక్ మెలోడిని మేకర్స్ విడుదల చేశారు. జాను చంతర్‌ స్వరాలు అందించగా.. ప్రదీప్‌కుమార్‌, ప్రియాంక ఎన్‌కే ఆలపించారు.

  • రజనీ ‘కూలీ’ రన్‌టైమ్ ఎంతంటే?

    ఈనెల 14న ప్రేక్షకులను పలకరించడానికి ‘కూలీ’ సిద్ధమయ్యాడు. రజనీకాంత్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన చిత్రం ‘కూలీ’. ఇటీవలే ఈ మూవీకి సెన్సార్‌బోర్డు ‘ఏ’ సర్టిఫికేట్ జారీ చేసింది. ఇక మొత్తం సినిమా రన్‌టైమ్‌ 2 గంటల 50 నిమిషాలకు లాక్ చేసినట్లు తెలుస్తోంది. రజనీకాంత్‌ సినిమాల్లోకి వచ్చి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా 25 సెకన్ల నిడివి గల స్పెషల్‌ వీడియోను కూడా ఈ సందర్భంగా ప్రదర్శించనున్నారు.

  • సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుంటే అవకాశాలు కష్టం: ప్రముఖ నటి

    సినీనేపథ్యం లేకపోతే ఇండస్ట్రీలో అవకాశాలు రావడం కష్టమని నటి మౌనీరాయ్‌ తెలిపింది. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఫిల్మ్ ఇండస్ట్రీలో బయటి వ్యక్తులు ఎదుర్కొంటోన్న సవాళ్ల గురించి ప్రస్తావించింది. ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు రావని.. వాటిని పొందడం ఎంతో కష్టమని చెప్పుకొచ్చింది. ‘బ్రహ్మాస్త్ర’ తర్వాత తనకు ఎన్నో అవకాశాలు వస్తాయని అనుకున్ననని.. కానీ, ఆ సినిమా విజయం తనకు ఛాన్సులు తీసుకురాలేదని వెల్లడించింది.

  • సూపర్‌స్టార్‌కు సితార బర్త్ డే విషెస్

    నేడు సూపర్‌స్టార్ మహేశ్‌ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె సితార స్పెషల్ విష్ తెలుపుతూ.. ఫొటో షేర్ చేసింది. తన నాన్నతో చిన్నప్పుడు దిగిన క్యూట్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే బెస్ట్ డ్యాడ్ ఎవర్.. లవ్ యు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.

  • అన్నయ్యలతో మెగా డాటర్ రాఖీ సెలబ్రేషన్స్

    రాఖీ పండుగ సందర్భంగా మెగా డాటర్ నిహారిక కొణిదెల షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తన సొంత అన్న వరుణ్ తేజ్, పెద్దనాన్న మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్‌లతో ఈ రాఖీ పండుగ జరుపుకున్నట్టుగా పిక్స్ పంచుకుంది. ఈ రాఖీ పండుగకి మరింత ప్రేమను ఫీల్ అవుతున్నానని తెలిపింది. ఇవి చూసిన అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  • సినీ కార్మికుల వేతనాల పెంపు.. మంత్రి హెచ్చరిక

    TG: సినీకార్మికులకు వేతనాల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. వారికి వేతనాలు పెంచితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. కార్మికులపై కేసులు పెడితే ఊరుకోమని హెచ్చరించారు. ‘‘మన కార్మికుల్లో నైపుణ్యం లేదంటే ఒప్పుకోను. నిర్మాతలను కలిసి వేతనాలు పెంచేందుకు కృషి చేస్తా. ఇందుకు ఈ నెల 11న ఇరువర్లాలతో చర్చలు జరుపుతాం’’ అని మంత్రి తెలిపారు.

  • ‘మాస్‌ జాతర’ టీజర్‌ ఎప్పుడంటే?

    నటుడు రవితేజ, శ్రీలీల జోడీగా భాను భోగవరపు తెరకెక్కించిన చిత్రం ‘మాస్‌ జాతర’. ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి కొత్త అప్‌డేట్‌ వచ్చింది. ఆగస్టు 11న ఉదయం 11.08 గంటలకు ఈసినిమా టీజర్‌ను రిలీజ్‌ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. వినాయక చవితి కానుకగా ఈనెల 27న ధియేటర్లలో రిలీజ్ అవుతుంది.

  • రామ్‌చరణ్‌ ‘పెద్ది’లో సమంత స్పెషల్ సాంగ్?

    రామ్‌చరణ్‌  హీరోగా దర్శకుడు బుచ్చిబాబు  తెరకెక్కిస్తున్న సినిమా ‘పెద్ది’.  జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. అయితే, సమంత స్పెషల్‌ సాంగ్‌లో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ,  ఈ వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.