Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘K- ర్యాంప్‌’.. కలర్‌ఫుల్‌గా ఓనమ్‌ పాట రిలీజ్

    నటుడు కిరణ్‌ అబ్బవరం యుక్తి తరేజా జోడిగా నటిస్తున్నచిత్రం ‘కె-ర్యాంప్‌’ . కిరణ్‌‌కు ఇది 11వ చిత్రం . జైన్స్‌ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రాజేశ్‌ దండా – శివ బొమ్మకు నిర్మిస్తున్నారు. అక్టోబర్‌ 18న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓనమ్‌ పాటను విడుదలచేశారు. ఈ పాటకు సురేంద్ర లిరిక్స్‌ అందించారు.

     

  • బాలకృష్ణకు రాఖీ కట్టిన సోదరి దగ్గుబాటి పురందేశ్వరి

    సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు రాఖీ పండుగ సందర్భంగా ఆయన సోదరి దగ్గుబాటి పురందేశ్వరి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. రక్షాబంధన్ తనకు ఎంతో ఇష్టమైన రోజని, తన సోదరుడు బాలకృష్ణకు రాఖీ కట్టడం ఆనందంగా ఉందని చెప్పారు. రాఖీ కట్టగానే బాలకృష్ణ ఆమె పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

  • ‘SSMB29’పై రాజమౌళి బిగ్ అప్‌డేట్

    సూపర్ స్టార్ మహేశ్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో ‘SSMB29’ వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇవాళ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై రాజమౌళి ఆసక్తికర పోస్ట్ పెట్టారు. నవంబర్‌లో సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇస్తానంటూ.. ఓ ఫోటోను షేర్ చేశారు. ‘గ్లోబ్‌ట్రోటర్’ అని ట్వీట్ చేశారు.

  • యూఎస్ మార్కెట్‌లో ‘అతడు’ రికార్డ్

    నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు మొదలయ్యాయి.  పుట్టినరోజు కానుకగా ఫ్యాన్స్ అతడు రీ రిలీజ్ చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే.
    ఇక యూఎస్‌లో 140కి పైగా లొకేషన్స్‌లో రీ రిలీజై  కొత్తరికార్డ్ సెట్ చేసిందట. మహేష్‌కు యూఎస్ మార్కెట్‌లో రికార్డులు కొత్తేమి కాదు అలానే ఇప్పుడు మరొకొత్త రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నారు.

     

  • ఏడాది పాటు గదిలో బంధించాడు.. ఆమిర్‌పై సోదరుడి ఆరోపణలు

    బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ఖాన్‌పై అతని సోదరుడు ఫైసల్‌  సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘‘ గతంలో ఒక ఏడాది పాటు  ఆమిర్‌ నన్ను ఒక గదిలో బంధించాడు. నా ఫోన్‌ లాగేసుకున్నారు. బయటకు వెళ్లనివ్వలేదు. నా గది బయట బాడీగార్డ్‌లను పెట్టారు. నాకు మందులు ఇచ్చేవారు. నా తండ్రిని సంప్రదించే అవకాశం కూడా లేకుండా చేశారు’’ ఆని తెలిపారు.

  • వారి ‘గుండె చప్పుడు’ మహేశ్ బాబు

    ఇవాళ సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజుజ. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల పాలిట మహేశ్‌ బాబు నిజంగా దేవుడయ్యారు. మహేశ్‌ బాబు ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటివరకు సుమారు 5వేల మంది పిల్లలకు ఉచిత హార్ట్‌ సర్జరీలు చేయించారు. ‘‘మాకంటే డబ్బులున్నాయి. లేనివారి పరిస్థితి ఏంటనే ఉద్దేశంతో అలాంటి కుటుంబాల చిన్నారుల కోసమే ఈ కార్యక్రమం చేపట్టాం’’ అని మహేశ్‌ ఓ సందర్భంలో చెప్పారు.

  • సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి భావోద్వేగ పోస్ట్

    ఇవాళ రాఖీ పండుగ సందర్భంగా దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను ఆయన సోదరి శ్వేత గుర్తు చేసుకున్నారు. ‘‘కొన్నిసార్లు నువ్వు నిజంగా ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళనట్లు అనిపిస్తుంది. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. నేను నిజంగా నిన్ను మళ్ళీ చూడలేనా? నీ నవ్వు కేవలం ప్రతిధ్వనిగా మిగిలిపోతుందా? నా హృదయంలో నీకెప్పుడూ రాఖీ కడుతూనే ఉంటాను’’ అని పేర్కొన్నారు.

  • ‘వార్‌ 2’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేదిక ఫైనల్‌

    వార్‌2 ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌పై నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున ఈవెంట్‌ కార్యక్రమం జరగనుంది. ఆగష్టు 10న వేడుక నిర్వహిస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌తో పాటు హృతిక్‌ రోషన్ కూడా పాల్గొననున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ వేడుక ప్రారంభం కానుంది.

  • మహేశ్‌ బాబుకు బర్త్‌డే విషేశ్ చెప్పిన చిరంజీవి

    నటుడు మహేశ్‌ బాబు నేడు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో సందడి నెలకొంది. ఈక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ‘నా ప్రియమైన మహేశ్‌ బాబుకు 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు తెలుగు సినిమాకు గర్వకారణం. అతీంద్రియాలను జయించాలని నిర్ణయించుకున్నారు. ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ మీరు చిన్నవారవుతున్నట్లు కనిపిస్తోంది. మీకు అద్భుతమైన సంవత్సరం కానుంది. ఎన్నోసంతోషాలను తీసుకొస్తుంది.’. అని పోస్ట్ చేశారు.

  • ప్రిన్స్‌ మహేశ్‌ బాబుకు హ్యాపీ బర్త్‌ డే!

    నేడు సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు 50వ బర్త్‌ డే . ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతూ అగ్ర హీరోగా మారారు. తొలి సినిమా రాజకుమారుడు మూవీకి రూ.కోటి రెమ్యునరేషన్‌ కూడా తీసుకోని మహేశ్‌ ఇప్పుడు రూ.100 కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగారు. ఆయన ఒక్క రీమేక్‌లోనూ నటించకపోవడం విశేషం. ఫేస్‌బుక్‌, ఎక్స్‌, ఇన్‌స్టాలో కోటికిపైగా ఫాలోవర్లు ఉన్న ఏకైక సౌత్‌ హీరో ప్రిన్స్‌ మహేశ్‌బాబు.