చిన్న సినిమాలైనా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ‘సు ఫ్రమ్ సో ’ మూవీ మంచి
ఉదాహరణ. హారర్ కామెడీ కథాంశంతో రూపొందించిన ఈ సినిమాకు జె.పి.దుమినాద్ దర్శకత్వం వహించారు. రూ.5 కోట్లతో నిర్మించిన ఈ కన్నడ చిత్రం రూ.60 కోట్లు వసూలు చేసింది. ఈమూవీ జులై 25న థియేటర్లలో విడుదలై మౌళ్ టాక్‌తో సినీప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. తాజాగా తెలుగులో విడుదలైంది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
రూ.5 కోట్లతో తీస్తే రూ.60 కోట్లు వసూలు!
-
టాలెంట్ ఉన్నా అవకాశాలు రావు: మౌనీరాయ్
సినీ నేపథ్యం లేకపోతే టాలెంట్ ఉన్నా అవకాశాలను రావని నటి మౌనీరాయ్ చెప్పారు. ఎంత పెద్ద హిట్ సినిమాల్లో చేసినప్పటికీ అవకాశాలు ఇవ్వరని పేర్కొన్నారు.
-
నటి ఐశ్వర్య రాయ్ నికర ఆస్తుల విలువ ఎంతంటే?
నటి ఐశ్వర్య రాయ్ నికర ఆస్తుల విలువ రూ.900 కోట్లు. ఆమె సినిమాలతో పాటు, ఐశ్వర్య బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, వ్యాపారాల ద్వారా ఆర్ధిస్తున్నారు. ఐశ్వర్య ఒక సినిమాకు రూ.10-12 కోట్లు తీసుకుంటున్నారని, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లకు రూ.6-7 కోట్లు వసూలు చేస్తున్నారని నివేదికలు తెలిపాయి.
ఐశ్వర్య ముంబైలోని బంగ్లా విలువ రూ.50 కోట్లకు పైగా విలువ ఉండగా, ఆమెకు పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. -
సంతోశ్ శోభన్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ టీజర్ విడుదల
యంగ్ హీరో సంతోశ్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ ను మూవీ టీం విడుదల చేసింది. త్వరలో ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ కోసం CLICK HERE.
-
ఆ క్రికెట్ టీమ్‌కి రామ్ చరణ్ స్పెషల్ విషెస్
ఏపీలో క్రికెట్ క్రీడా సమరం నిన్నటినుంచి ప్రారంభమైంది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ నేపథ్యంలో మెగా హీరో రామ్ చరణ్ విజయవాడ సన్ షైనర్స్ టీమ్‌కు ట్వీట్టర్‌లో అల్ ది బెస్ట్ చెప్పారు. అలాగే పెద్ది మూవీలోని క్రికెట్ షాట్ను రీ క్రియేట్ చేసిన వీడియోను రామ్ చరణ్ షేర్ చేశాడు. ప్రస్తుతం చరణ్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
-
28 ఏళ్ల తర్వాత.. డిస్కో శాంతి రీఎంట్రీ
1980,90 దశకాల్లో తన నటనతో, డ్యాన్సులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటి డిస్కో శాంతి.. వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. రాఘవ లారెన్స్, ఆయన సోదరుడు ఎల్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘బుల్లెట్’ చిత్రంతో ఆమె వెండితెరపై కనిపించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ‘బుల్లెట్’ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ టీజర్లో డిస్కో శాంతి జోస్యం చెప్పే కీలక పాత్రలో కనిపించింది.
-
‘కాంతార’ను వెంటాడుతున్న విషాదాలు
రిషభ్ శెట్టి నటిస్తున్న కాంతార-1 మూవీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా పార్ట్ 1లో నటించిన ప్రభాకర్ కళ్యాణ్ మరణించిన విషయం తెలిసిందే. వివిధ కారణాలతో ఈ చిత్రంలో నటించిన, నటిస్తున్న ఆర్టిస్టులు చనిపోవడం సినీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. మే నెలలో రాకేశ్ పూజారి(34), కపిల్(32), జూన్లో కళాభవన్ (43), తాజాగా ప్రభాకర్ కళ్యాణ్ మరణించారు. కారణమేదైనా కాంతారను విషాదాలు వదలట్లేదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
-
విజయవాడ అలంకార్ థియేటర్ వద్ద మహేష్ బాబు ఫ్యాన్స్ సంబరాలు
రేపు (ఆగస్టు 9)న సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు విజయవాడలోని అలంకార్ థియేటర్ వద్ద హంగామా చేస్తున్నారు. రేపు మహేష్ బాబు నటించిన ‘అతడు’ సినిమా రీ-రిలీజ్ చేయనున్నారు. దీంతో ఫ్యాన్స్ ఇవాళ అలంకార్ థియెటర్‌లో ప్రీమియర్ షో వేస్తుండటంతో వందలాది మంది అభిమానులు థియేటర్ వద్ద సందడి చేస్తున్నారు.
-
హాట్ లుక్‌తో హీటెక్కిస్తున్న పాయల్!
టాలీవుడ్ బ్యూటి పాయల్ రాజ్‌పుత్ తన హాట్ ఫోటోతో సోషల్‌మీడియాలో హీట్ ఎక్కిస్తోంది. తాజాగా ఈ అమ్మడు గోల్డ్ కలర్ డ్రెస్‌లో కుర్రాళ్లకు మతిపోయేలా ఫోజులిచ్చింది.
-
54 ఏళ్ల హీరోతో శ్రీలీల రొమాన్స్.. నెట్టింట కామెంట్స్?
హీరో అజిత్ కుమార్ నెక్ట్స్ ‘AK-64’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్నాడు. ఈ సినిమాకు ఆదిక్ రవిచంద్రన్ దర్శకుడు. ఇందులో టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల.. అజిత్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నట్లు నెట్టింట పలు పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ సినిమా కోసం మేకర్స్ శ్రీలీలను సంప్రదించగా.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. 54 ఏళ్ల హీరోతో రొమాన్స్ చేయడానికి ఎలా ఒప్పుకున్నావని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.