Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘ఎలాంటి డైట్ లేకుండా 9 కేజీలు తగ్గాను’

    హీరోయిన్ కీర్తిసురేష్ సులభంగా బరువు తగ్గినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 2019లో తాను 9కేజీలు తగ్గానని చెప్పింది. ‘‘డైట్, బరువు తగ్గే టాబ్లెట్స్ వాడలేదు. కానీ డైట్ చేయ‌కుండా కార్డియో ఎక్కువ‌గా చేసి బ‌రువు తగ్గాను. కార్డియో వ్యాయామం ప్ర‌భావం చాతి, కాళ్లు, బ్యాక్‌పై ప‌డుతుంది’’ అని చెప్పుకొచ్చింది. ఇక కార్డియో వ్యాయామం అంటే.. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటివి.

  • అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘కూలీ’ హవా!

    రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్ములేపుతోంది. నార్త్ అమెరికాలో ఈ చిత్రం ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.

  • ‘కాంత’ నుంచి రొమాంటిక్ సాంగ్.. ఎప్పుడంటే?

    దుల్కర్ సల్మాన్-భాగ్యశ్రీ బొర్సె జంటగా నటిస్తున్న చిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. ఈ మూవీలోని ‘పసిమనసే’ అనే ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పాట పూర్తి రొమాంటిక్ సాంగ్‌గా ప్రేక్షకులను అలరించనుంది. ఈ సాంగ్‌ను రేపు సా.4.30 గంటలకు విడుదల చేయనున్నారు.

  • ‘వార్-2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే?

    ఎన్టీఆర్-హృతిక్ రోషన్ నటిస్తున్న చిత్రం ‘వార్-2’. ఈమూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఈనెల 10న హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో సా.5గంటలకు నిర్వహించనున్నట్లు మేకర్స్ పోస్టర్ వదిలారు.

  • నాగ్ కల్ట్ మూవీ రీ-రిలీజ్.. ‘కూలీ’తో ట్రైలర్!

    అక్కినేని నాగార్జున కెరీర్‌లో కల్ట్ చిత్రంగా నిలిచింది ‘శివ’. రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాతో ఇండియాను షేక్ చేశాడు. ఈ మూవీని రీ-రిలీజ్ చేయబోతున్నట్లు నాగార్జున తాజాగా ప్రకటించారు. ‘శివ’ లాంటి క్లాసిక్ కల్ట్ చిత్రం 4K డాల్బీ అట్మోస్‌తో రీ-రిలీజ్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించాడు. అయితే రీ-రిలీజ్ ట్రైలర్‌ను ‘కూలీ’ సినిమాతో పాటు థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు నాగ్ తెలిపాడు.(వీడియో)

  • ఓ డైరెక్టర్ అలా చేయమన్నారు.. నటి షాకింగ్ పోస్ట్!

    నటి ఇషాతల్వార్ ఇన్‌స్టాలో షాకింగ్ పోస్ట్ చేసింది. ‘‘ఓ ఆడిషన్ కోసం కాస్టింగ్ డైరెక్టర్ షనూశర్మను కలిశాను. ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో సీన్ చేయాలని నన్ను తీసుకెళ్లారు. అక్కడ అందరి మధ్యలో గట్టిగా ఏడవాలని చెప్పారు. అలా చేసేందుకు ధైర్యం సరిపోలేదు. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వాళ్ల కోసం ఈ స్టోరీ పెడుతున్నాను. ఆడిషన్‌కు వెళ్లినప్పుడు ఎవరూ ఒత్తిడికి గురి కాకూడదు’’ అని రాసుకొచ్చింది.

  • నాని ‘ప్యారడైజ్’ నుంచి మరో మాస్ లుక్!

    నాని-శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా నుంచి మరో కొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో నాని అసలైన మాస్ లుక్‌తో, వైలెన్స్ మధ్య కుర్చీలో కూర్చుని ఉన్నాడు. చుట్టూ కరడుగట్టిన బలవంతులు ముట్టుకోలేని విధంగా చుట్టేసిన విధానం.. రాబోయే యాక్షన్ సీక్వెన్స్‌కి ఊహించని హైప్ తెచ్చింది. ఈ మూవీలో నాని ‘జడల్’ అనే పాత్రలో కనిపించబోతున్నాడు.

  • బిగ్‌బాస్‌-9.. నాగార్జునకు భారీగా పారితోషికం!

    తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌-9 సెప్టెంబర్‌ 7న ప్రారంభం కానుంది. గత 6 సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హీరో నాగార్జున ఈ సీజన్‌లోనూ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అయితే ఈ సీజన్‌ కోసం నాగార్జున రూ.30 కోట్ల రెమ్యూనరేషన్‌ అందుకుంటున్నట్లు సమాచారం. గత సీజన్‌కు కూడా ఆయన అంతే మొత్తంలో పారితోషికం తీసుకున్నారు.

  • ప్రియురాలిని పెళ్లి చేసుకోనున్న ప్రముఖ సింగర్

    టాలీవుడ్ సింగర్‌ రోహిత్ వివాహం చేసుకోబోతున్నాడు. తాను ప్రేమించిన శ్రేయ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ వేడుక సింపుల్‌గా కుటుంబసభ్యుల సమక్షంలో జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోను రోహిత్ పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో తోటి సింగర్స్, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. రోహిత్ చాలా పాటలు పాడాడు. ఇటీవలే ‘బేబి’ సినిమాతో నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు.

  • నాగూర్‌ దర్గాను సందర్శించిన అక్కినేని కోడలు

    హీరో నాగచైతన్య సతీమణి, నటి శోభిత ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె వేలంకన్ని చర్చి, నాగూర్‌ దర్గాలో ప్రార్థనలు చేశారు. ఈ ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఇక శోభిత చివరిసారిగా దేవ్‌పటేల్‌ దర్శకత్వంలో వచ్చిన ‘మంకీ మ్యాన్‌’లో చివరిసారిగా కనిపించారు.