Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • బిగ్‌బాస్‌-9.. నాగార్జునకు భారీగా పారితోషికం!

    తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌-9 సెప్టెంబర్‌ 7న ప్రారంభం కానుంది. గత 6 సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హీరో నాగార్జున ఈ సీజన్‌లోనూ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అయితే ఈ సీజన్‌ కోసం నాగార్జున రూ.30 కోట్ల రెమ్యూనరేషన్‌ అందుకుంటున్నట్లు సమాచారం. గత సీజన్‌కు కూడా ఆయన అంతే మొత్తంలో పారితోషికం తీసుకున్నారు.

  • ప్రియురాలిని పెళ్లి చేసుకోనున్న ప్రముఖ సింగర్

    టాలీవుడ్ సింగర్‌ రోహిత్ వివాహం చేసుకోబోతున్నాడు. తాను ప్రేమించిన శ్రేయ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ వేడుక సింపుల్‌గా కుటుంబసభ్యుల సమక్షంలో జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోను రోహిత్ పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో తోటి సింగర్స్, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. రోహిత్ చాలా పాటలు పాడాడు. ఇటీవలే ‘బేబి’ సినిమాతో నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు.

  • నాగూర్‌ దర్గాను సందర్శించిన అక్కినేని కోడలు

    హీరో నాగచైతన్య సతీమణి, నటి శోభిత ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె వేలంకన్ని చర్చి, నాగూర్‌ దర్గాలో ప్రార్థనలు చేశారు. ఈ ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఇక శోభిత చివరిసారిగా దేవ్‌పటేల్‌ దర్శకత్వంలో వచ్చిన ‘మంకీ మ్యాన్‌’లో చివరిసారిగా కనిపించారు.

  • ప్రభాస్ ‘ఫౌజీ’.. రిలీజ్ ఎప్పుడంటే?

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ మూవీని 2026 ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా పరిచయం కానుంది.

  • ఓటీటీలోకి కామెడీ డ్రామా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

    ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ సినిమా ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీ ఈనెల 22 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రం జులై 18న బాక్సాఫీసు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. నిర్మాత ప్రవీణ పరుచూరి దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. హీరో రానా సమర్పకుడిగా వ్యవహరించగా.. మనోజ్‌ చంద్ర, మౌనిక తదితరులు ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు.

  • మెగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. వీడియో!

    మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ‘Mega157’ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈనెల 22న మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా ‘మెగా157’ నుంచి బిగ్ సర్‌ప్రైజ్ కోసం మెగా అభిమానులు సిద్ధంగా ఉండాలని మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ నుంచి ఫస్ట్‌లుక్, టైటిల్ అనౌన్స్‌మెంట్ రాబోతున్నట్లు సమాచారం. మరోవైపు అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ వీడియో కూడా చేశాడు.

  • అది వ్యసనంలా మారింది: నటుడు సత్యదేవ్

    టాలీవుడ్ నటుడు సత్యదేవ్ ప్రభాస్ ‘సలార్’ మూవీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నాకు మూడ్‌ సరిగ్గా లేనప్పుడు ‘సలార్’ సినిమానే చూస్తాను. అది నా మూడ్‌ను మార్చేస్తుంది. బహుశా అందులోని సంగీతం, ప్రభాస్ అన్న నటన కావచ్చు.. లేదా అందులోని పవర్‌ఫుల్ సీన్స్ కావచ్చు. ఈ సినిమా చూడటం నాకు ఒక వ్యసనంలా మారింది’’ అని చెప్పుకొచ్చాడు.

  • ‘సల్మాన్ ఖాన్‌తో పని చేసిన వారు చనిపోతారు’

    ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మకు బెదిరింపు ఆడియో క్లిప్ వచ్చింది. కపిల్ చేసిన ఏకైక తప్పు సల్మాన్ ఖాన్‌ను తన నెట్‌ఫ్లిక్స్ షోకు ఆహ్వానించడమేనంటూ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్ హ్యారీ బాక్సర్ ఓ ఆడియో రికార్డింగ్‌ను విడుదల చేశారు. సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసిన ఎవరైనా చనిపోతారని హ్యారీ హెచ్చరించాడు. కపిల్‌తో పాటు బాలీవుడ్‌లోని పలువురికి ఈ ఆడియో వెళ్లినట్లు సమాచారం.

  • ‘వార్ 2’ నుంచి క్రేజీగా ఐమ్యాక్స్ పోస్టర్!

    ఎన్టీఆర్-హృతిక్ రోషన్ మల్టీస్టారర్‌గా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన యాక్షన్ చిత్రం ‘వార్ 2’. ఈనెల 14న విడుదలకానుంది. ఈక్రమంలో ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ మధ్య క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ లా కనిపిస్తున్న ఐమ్యాక్స్ పోస్టర్‌ను మేకర్స్ వదిలారు. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా ఐమ్యాక్స్ వెర్షన్‌లో చూసేందుకు మరింత ఎగ్జైట్ అవుతున్నారు. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ మూవీలో కియారా హీరోయిన్‌గా నటిస్తోంది.

     

  • ఆసక్తిగా ‘కానిస్టేబుల్‌ కనకం’ ట్రైలర్‌

    వరుస చిత్రాలు, వెబ్‌సిరీస్‌లతో అలరిస్తున్న తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌. ఇప్పుడు మరో యాక్షన్‌ థ్రిల్లర్‌తో కథతో అలరించడానికి సిద్ధమైంది. వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘కానిస్టేబుల్‌ కనకం’. ప్రశాంత్‌ కుమార్‌ దర్శకుడు. ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.  ఈ వెబ్‌ సిరీస్‌ ఈనెల 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.