Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘కూలీ’ క్రేజ్.. టికెట్ల కోసం ఎలా ఎగబడ్డారో చూడండి

    ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులు ఎదురుచూస్తున్న సినిమా ‘కూలీ’. రజనీకాంత్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ క్రమంలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కేరళలోని ఓ థియేటర్‌లో అడ్వాన్స్ టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  కాగా, ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు.

     

  • జాన్వీ ‘పరమ్‌ సుందరి’.. రొమాంటిక్ సాంగ్‌ రిలీజ్‌

    సిద్ధార్థ్‌ మల్హోత్రా-జాన్వీ కపూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘పరమ్‌ సుందరి’. ఈ నెల 29న మూవీ రిలీజ్‌ కానుంది. ఈనేపథ్యంలో ఈ సినిమాలోని ‘భీగి శారీ’ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సాంగ్‌లో సిద్ధార్థ్‌-జాన్వీ కెమిస్ట్రీ ఎంతో ఆకట్టుకునేలా ఉంది.

  • ఇకపై సినిమా షూటింగ్స్ బంద్

    తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సంచలన ప్రకటన చేసింది. 24 క్రాఫ్ట్‌ నేతలు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తమ అనుమతి లేకుండా సినిమా షూటింగ్‌లు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఎలాంటి సినిమా షూటింగ్స్ జరపకూడదని నిర్ణయించింది.

  • ‘నిశాంఛి’ టీజర్ చూశారా?

    అనురాగ్ కశ్యప్ ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న చిత్రం ‘నిశాంఛి’. ఈ సినిమాతో ఆయిశ్వర్య్ థాకరే హీరోగా బాలీవుడ్‌కు పరిచయం అవుతుండగా.. వేదిక పింటో, మోనికా పన్వార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 19న విడుదల కాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు.

  • ‘కాంతార’ నటుడు కన్నుమూత

    రిషబ్ శెట్టి ‘కాంతార’సినిమాలో నటించిన టి.ప్రభాకర్‌ కళ్యాణి మృతి చెందాడు. గుండెపోటుతో హిరియాడ్కాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కాంతార సినిమాలో మహాదేవ పాత్రలో ఆయన కనిపించారు. ఐదేళ్ల క్రితం ఆయనకు హార్ట్‌ ఆపరేషన్‌ జరిగింది. ప్రభాకర్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. తొలుత నాటక రంగంలో ఉన్న ఆయన క్రమంగా సినిమాల్లోకి వచ్చారు.

  • ‘అఖండ-2’ నుంచి లేటెస్ట్ అప్‌డేట్!

    బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘అఖండ-2. ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం బాలయ్య అభిమానులతో పాటు సినీప్రియులంతా ఎదురుచూస్తున్నారు. తాజాగా వారికి టీమ్‌ శుభవార్త చెప్పింది. దీని డబ్బింగ్‌ పనులు పూర్తయినట్లు తెలిపింది. బాలకృష్ణ తన పాత్రకు డబ్బింగ్‌ పూర్తిచేసినట్లు తెలుపుతూ ఆయన ఫొటోను టీమ్‌ పంచుకుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతోందని తెలిపింది. సెప్టెంబర్‌ 25న సినిమా విడుదలకానుంది.

     

  • నేత చీరల్లోనే.. పార్లమెంటుకు!

    కంగనా రనౌత్ అంటే విలక్షణ పాత్రలతో పాటు, ఆమె సంప్రదాయ చేనేత చీరకట్టు కూడా గుర్తుకు వస్తుంది. సినిమా ప్రమోషన్స్, పార్టీలు, ఎన్నికల ప్రచారమైనా.. కంగన ఎక్కువగా చేనేత చీరలకే ప్రాధాన్యత ఇస్తారు. ఎంపీ అయిన తర్వాత పార్లమెంటుకు కూడా చేనేత చీరల్లోనే వెళ్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆమె చేనేత చీరలకు బంగారు, మోడ్రన్ జ్యువెలరీ జత చేసి, ఫ్యాషనబుల్‌గా, సంప్రదాయబద్ధంగా మెరిసిపోతూ.. ‘చేనేతే కంఫర్టబుల్‌’ అని చెబుతుంటారు.

  • ‘సైయారా’ కొరియన్‌ మూవీకి కాపీనా?.. రచయిత ఏం చెబుతున్నారంటే?

    ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చి ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది బాలీవుడ్ చిత్రం ‘సైయారా’. అయితే, ‘సైయారా’ ఓ కొరియన్‌ మూవీకి కాపీ అని పలు విమర్శలు వస్తున్నాయి. వీటిపై ఈ సినిమాకు కథను అందించిన రచయిత సంకల్ప్‌ సదానా స్పందించాడు. ఈ సినిమా కొరియన్‌ మూవీకి కాపీ కాదని క్లారిటీ ఇచ్చాడు.

  • ఎపిసోడ్‌కు రూ.14 లక్షలు.. స్మృతి ఇరానీ స్పందన ఇదే!

    కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘క్యుంకీ సాస్‌భీ కభీ బహుథి సీజన్‌-2’లో ఆమె నటిస్తున్నారు. ఇందులో ఎపిసోడ్‌కు రూ.14 లక్షల చొప్పున ఆమె రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై స్మృతిస్పందిస్తూ.. టెలివిజన్‌ ఇండస్ట్రీలో తానే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఎంత అమౌంట్‌ తీసుకుంటున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

  • ‘మయసభ’ టీమ్‌తో ఐశ్వర్యా రాజేశ్‌ ఫన్నీ ఇంటర్వ్యూ

    ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘మయసభ’ ఓటీటీ ‘సోనీలివ్’లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ దర్శకుడు దేవ కట్టా ఈ సిరీస్‌ను తెలుగు రాజకీయాల్లోని ఇద్దరు నాయకుల జీవితాల స్ఫూర్తితో రూపొందించారు. ఈ సందర్భంగా నటి ఐశ్వర్యా రాజేశ్ ‘మయసభ’ బృందాన్ని ఇంటర్వ్యూ చేశారు. ఇందులో ఆది, చైతన్య రావు, దేవ కట్టా పాల్గొని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.