Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • నేత చీరల్లోనే.. పార్లమెంటుకు!

    కంగనా రనౌత్ అంటే విలక్షణ పాత్రలతో పాటు, ఆమె సంప్రదాయ చేనేత చీరకట్టు కూడా గుర్తుకు వస్తుంది. సినిమా ప్రమోషన్స్, పార్టీలు, ఎన్నికల ప్రచారమైనా.. కంగన ఎక్కువగా చేనేత చీరలకే ప్రాధాన్యత ఇస్తారు. ఎంపీ అయిన తర్వాత పార్లమెంటుకు కూడా చేనేత చీరల్లోనే వెళ్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆమె చేనేత చీరలకు బంగారు, మోడ్రన్ జ్యువెలరీ జత చేసి, ఫ్యాషనబుల్‌గా, సంప్రదాయబద్ధంగా మెరిసిపోతూ.. ‘చేనేతే కంఫర్టబుల్‌’ అని చెబుతుంటారు.

  • ‘సైయారా’ కొరియన్‌ మూవీకి కాపీనా?.. రచయిత ఏం చెబుతున్నారంటే?

    ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చి ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది బాలీవుడ్ చిత్రం ‘సైయారా’. అయితే, ‘సైయారా’ ఓ కొరియన్‌ మూవీకి కాపీ అని పలు విమర్శలు వస్తున్నాయి. వీటిపై ఈ సినిమాకు కథను అందించిన రచయిత సంకల్ప్‌ సదానా స్పందించాడు. ఈ సినిమా కొరియన్‌ మూవీకి కాపీ కాదని క్లారిటీ ఇచ్చాడు.

  • ఎపిసోడ్‌కు రూ.14 లక్షలు.. స్మృతి ఇరానీ స్పందన ఇదే!

    కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘క్యుంకీ సాస్‌భీ కభీ బహుథి సీజన్‌-2’లో ఆమె నటిస్తున్నారు. ఇందులో ఎపిసోడ్‌కు రూ.14 లక్షల చొప్పున ఆమె రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై స్మృతిస్పందిస్తూ.. టెలివిజన్‌ ఇండస్ట్రీలో తానే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఎంత అమౌంట్‌ తీసుకుంటున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

  • ‘మయసభ’ టీమ్‌తో ఐశ్వర్యా రాజేశ్‌ ఫన్నీ ఇంటర్వ్యూ

    ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘మయసభ’ ఓటీటీ ‘సోనీలివ్’లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ దర్శకుడు దేవ కట్టా ఈ సిరీస్‌ను తెలుగు రాజకీయాల్లోని ఇద్దరు నాయకుల జీవితాల స్ఫూర్తితో రూపొందించారు. ఈ సందర్భంగా నటి ఐశ్వర్యా రాజేశ్ ‘మయసభ’ బృందాన్ని ఇంటర్వ్యూ చేశారు. ఇందులో ఆది, చైతన్య రావు, దేవ కట్టా పాల్గొని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

  • ‘బ్యాడ్‌ బాయ్‌ కార్తీక్‌’ ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌..

    నాగశౌర్య హీరోగా రామ్ దేశినా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. విధి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలోని మొదటి పాటను ఇటీవల విడుదల చేశారు. ‘నా మామ పిల్లనిస్తానన్నాడే..’ అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు, కారుణ్య, హరిప్రియ ఆలపించారు.

  • రాఘవా లారెన్స్‌ ‘బుల్లెట్టు బండి’.. టీజర్‌ రిలీజ్‌

    రాఘవా లారెన్స్‌ ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘బుల్లెట్టు బండి’. ఇన్నాసి పాండియన్‌ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను టీమ్‌ విడుదల చేసింది. యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా ఇది రూపొందినట్లు టీజర్‌ ఆధారంగా తెలుస్తోంది. ‘జీవితంలో కొన్ని చిక్కుముడులకు సమాధానం ఎప్పటికీ దొరకదు’ అంటూ లారెన్స్ చెప్పిన డైలాగు ఆకట్టుకునేలా ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • కూలీ సినిమా కథ రివీల్.. లోకేశ్ రిప్లై ఇదే!

    లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ సినిమా ఆగస్ట్ 14న విడుదల కానుంది. ఇది టైమ్ ట్రావెలర్ జానార్‌లో ఉంటుందని ప్రచారం జరిగింది. దీనిపై దర్శకుడు లొకేశ్ స్పందిస్తూ.. అది నిజం కాదని స్పష్టం చేశారు. ఈ సినిమా పూర్తిగా యాక్షన్ నేపథ్యంలో సాగుతుందని, కథే ప్రధానంగా సినిమాను నడిపిస్తుందని ఆయన తెలిపారు. దీంతో ‘కూలీ’ టైమ్ ట్రావెలర్ సినిమా కాదని తేలిపోయింది.

  • ‘కిష్కింధ పురి’ ఫస్ట్ సింగిల్ ‘ఉండిపోవే నాతోనే’ సాంగ్ రిలీజ్

    హీరో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కలిసి జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘కిష్కింధ పురి’. హారర్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి డైరెక్టర్ కౌషిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి మూవీ మేకర్స్ తాజాగా ఫస్ట్ సింగిల్ ‘ఉండిపోవే నాతోనే’ అనే సాంగ్ రిలీజ్ చేశారు.

  • ‘జటాధర’ టీజర్‌ రిలీజ్‌..

    సుధీర్‌బాబు హీరోగా వెంకట్‌ కల్యాణ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జటాధర’. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ప్రభాస్‌ విడుదల చేశారు. టీజర్‌లో సోనాక్షి శక్తివంతమైన పాత్రలో కనిపించారు. దురాశకు, త్యాగానికి మధ్య జరిగే పోరాటమే ఈ చిత్ర కథాంశమని చిత్రబృందం తెలిపింది. గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత ఉన్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఈ పాన్‌ ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • హ్యాపీ జర్నీ.. ‘వందేమాతరం’ సాంగ్‌ రిలీజ్

    చైతన్య కొండా దర్శకత్వంలో హరిప్రసాద్ కోనే, ఇషాని, గోష్ హీరో హీరోయిన్లుగా గంగాధర్ పెద్దకొండ నిర్మించిన ఎమోషనల్ ఎంటర్‌‌టైనర్ ‘హ్యాపీ జర్నీ’. షూటింగ్ పూర్తయి, పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తాజాగా ఈచిత్రంలోని ‘వందేమాతరం’ సాంగ్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈసందర్భంగా నిర్మాత గంగాధర్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రాన్ని తెలుగు,హిందీ భాషల్లో నిర్మిస్తున్నాం. ఇందులోని వందేమాతరం పాటకుప్రేక్షకుల నుంచి మంచిరెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నాం’అని అన్నారు.