Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘ది ప్యారడైజ్‌’.. డిఫరెంట్‌గా నాని పేరు

    హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమా ‘ది ప్యారడైజ్‌’. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో నాని డిఫరెంట్‌ లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఆయన పాత్ర పేరు ‘జడల్‌’ అని ప్రకటించారు. ‘ఇది ఒక అల్లికగా ప్రారంభమై.. విప్లవంగా ముగిసింది’అని ఈ పోస్టర్‌లో పేర్కొన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది.

  • నేను చాలా ఎమోషనల్‌: రష్మిక

    తాను చాలా ఎమోషనల్‌ పర్సన్‌ అని, భావోద్వేగాలను అందరి ముందు ప్రదర్శించనని నటి రష్మిక చెప్పారు. చాలామంది తన దయాగుణాన్ని ఫేక్‌ అని అనుకోవడమే కారణమన్నారు. ఎంత నిజాయితిగా ఉంటె అంత వ్యతిరేకత వస్తుందని, నెగిటివిటీ, ట్రోలింగ్‌ను ఎదుర్కోవడం చాలా కష్టమని చెప్పారు. తన ప్రయాణంపై దృష్టిపెట్టి క్రమశిక్షణతో ముందుకు వెళ్తున్నట్లు రష్మిక తెలిపారు.

  • ‘కాంతార’లో రుక్మిణి వసంత్‌.. ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేసిన టీమ్‌

    ‘కాంతార చాపర్ట్ 1’ చిత్రంలో రుక్మిణి వసంత్‌ నటిస్తున్నారు. తాజాగా, చిత్రబృందం ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో రుక్మిణి వసంత్‌ ‘కనకవతి’ పాత్రలో కనిపించనున్నారు.

  • ‘కూలీ’ హిందీ రిలీజ్‌.. ఆమిర్‌ ప్రమేయం లేదు: క్లారిటీ ఇచ్చిన టీమ్‌

    రజనీకాంత్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కూలీ’. ఆగస్టు 14న విడుదల కానుంది. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అతిథి పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా హిందీ రిలీజ్‌ విషయంలో ఆమిర్‌ఖాన్‌ చొరవ చూపుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై ఆమిర్‌ టీమ్‌ స్పందించింది. ఆ వార్తలన్నీ అవాస్తవాలని ఖండించింది.

  • నటి హ్యుమా ఖురేషీ బంధువు హత్య

    ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన పార్కింగ్ వివాదంలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో నటి హ్యూమా ఖురేషీకి సమీప బంధువు అయిన ఆసిఫ్ ఖురేషీ (52) ప్రాణాలు కోల్పోయారు. పార్కింగ్ విషయంలో తలెత్తిన ఘర్షణలో ఆసిఫ్‌పై పదునైన ఆయుధంతో దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. ఈ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

  • ‘ది రాజాసాబ్‌’ మూవీ రిలీజ్ అప్పుడేనా?

    ప్రస్తుతం సంక్రాంతి రేసుపై కన్నేసిన సినిమాల్లో ‘ది రాజాసాబ్‌’ ముందు వరుసలో కనిపిస్తోంది. హీరో ప్రభాస్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. మారుతి తెరకెక్కిస్తున్నారు. దీన్ని డిసెంబరు 5న తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రకటించినా.. పండగ బరిలో నిలిచే అవకాశమూ లేకపోలేదని చిత్ర వర్గాల నుంచి సంకేతాలు అందుతున్నాయి.

  • ప్రెగ్నెంట్‌ సమయంలో నిర్మాత టైట్‌ దుస్తులు ధరించాలన్నారు : రాధికా ఆప్టే

    దక్షిణాదికి చెందిన ఓ సినీ నిర్మాత తాను ప్రెగ్నెంట్‌గా ఉన్నసమయంలో ఇబ్బంది పెట్టారని నటి రాధికా ఆప్టే తెలిపారు. “నేను సినిమా మధ్యలోనే ప్రెగ్నెంట్‌ అయ్యా. ఈ విషయం చెప్పిన తర్వాత కూడా ఆ సినిమా నిర్మాత నన్ను బిగుతుగా ఉండే దుస్తులే ధరించమని చెప్పారు.సెట్‌లో నాకు నొప్పిగా ఉందని చెప్పినా డాక్టర్‌ను కలవనివ్వలేదు,” అని రాధికా ఆప్టే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

  • ఆమిర్‌తో సినిమాపై స్పందించిన లోకేశ్‌ కనగరాజ్‌

    దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఆమిర్ ఖాన్‌తో తీయబోయే సినిమాపై స్పందించారు. తాను పదేళ్ల క్రితం రాసిన ‘ఇరుంబు కై మాయావి’ కథను పూర్తిగా మార్చేశానని, అందులోని కొన్ని సన్నివేశాలు ఇటీవల విడుదలైన ఒక చిత్రంలోని సన్నివేశాలను పోలి ఉన్నాయని తెలిపారు. ఆమిర్ ఖాన్‌తో కలిసి ఒక యాక్షన్ సినిమా చేయబోతున్నామని, అయితే అది సూపర్ హీరో చిత్రమా లేక ఫాంటసీ చిత్రమా అనేది ఇంకా నిర్ణయించలేదని చెప్పారు.

  • హిమేశ్‌ రేష్మియాకు అరుదైన గౌరవం

    బాలీవుడ్‌ సింగర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ హిమేశ్‌ రేష్మియాకు అరుదైన గౌరవం దక్కింది. బ్లూమ్‌బర్గ్‌ విడుదల చేసిన ‘గ్లోబల్‌ పాప్‌ పవర్‌ లిస్ట్‌’లో ఆయనకు 22వ స్థానం లభించింది. ఈ జాబితాలో నిలిచిన ఏకైక భారతీయ సెలబ్రిటీ హిమేశ్‌. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన పాప్‌ స్టార్ల జాబితాలో ఆయనకు చోటు దక్కడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

  • మృణాల్‌ను ఫాలో అవుతున్న ధనుష్ సిస్టర్స్!

    హీరో ధనుష్‌-హీరోయిన్ మృణాల్‌‌ఠాకూర్ డేటింగ్‌లో ఉన్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచారు. ధనుష్ సిస్టర్స్ కార్తిక, విమలను మృణాల్‌ కలిసినట్లు నెట్టింట టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరినీ ఇన్‌స్టాలో మృణాల్‌ ఫాలో అవుతుండగా.. వాళ్లు కూడా ఈ బ్యూటీ ఫాలోవర్స్‌ లిస్ట్‌లో చేరారు. దీంతో మృణాల్‌-ధనుష్ డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది.