ప్రస్తుతం సంక్రాంతి రేసుపై కన్నేసిన సినిమాల్లో ‘ది రాజాసాబ్’ ముందు వరుసలో కనిపిస్తోంది. హీరో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. మారుతి తెరకెక్కిస్తున్నారు. దీన్ని డిసెంబరు 5న తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రకటించినా.. పండగ బరిలో నిలిచే అవకాశమూ లేకపోలేదని చిత్ర వర్గాల నుంచి సంకేతాలు అందుతున్నాయి.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘ది రాజాసాబ్’ మూవీ రిలీజ్ అప్పుడేనా?
-
ప్రెగ్నెంట్ సమయంలో నిర్మాత టైట్ దుస్తులు ధరించాలన్నారు : రాధికా ఆప్టే
దక్షిణాదికి చెందిన ఓ సినీ నిర్మాత తాను ప్రెగ్నెంట్‌గా ఉన్నసమయంలో ఇబ్బంది పెట్టారని నటి రాధికా ఆప్టే తెలిపారు. “నేను సినిమా మధ్యలోనే ప్రెగ్నెంట్ అయ్యా. ఈ విషయం చెప్పిన తర్వాత కూడా ఆ సినిమా నిర్మాత నన్ను బిగుతుగా ఉండే దుస్తులే ధరించమని చెప్పారు.సెట్‌లో నాకు నొప్పిగా ఉందని చెప్పినా డాక్టర్‌ను కలవనివ్వలేదు,” అని రాధికా ఆప్టే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
-
ఆమిర్‌తో సినిమాపై స్పందించిన లోకేశ్ కనగరాజ్
దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఆమిర్ ఖాన్‌తో తీయబోయే సినిమాపై స్పందించారు. తాను పదేళ్ల క్రితం రాసిన ‘ఇరుంబు కై మాయావి’ కథను పూర్తిగా మార్చేశానని, అందులోని కొన్ని సన్నివేశాలు ఇటీవల విడుదలైన ఒక చిత్రంలోని సన్నివేశాలను పోలి ఉన్నాయని తెలిపారు. ఆమిర్ ఖాన్‌తో కలిసి ఒక యాక్షన్ సినిమా చేయబోతున్నామని, అయితే అది సూపర్ హీరో చిత్రమా లేక ఫాంటసీ చిత్రమా అనేది ఇంకా నిర్ణయించలేదని చెప్పారు.
-
హిమేశ్ రేష్మియాకు అరుదైన గౌరవం
బాలీవుడ్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ హిమేశ్ రేష్మియాకు అరుదైన గౌరవం దక్కింది. బ్లూమ్‌బర్గ్ విడుదల చేసిన ‘గ్లోబల్ పాప్ పవర్ లిస్ట్’లో ఆయనకు 22వ స్థానం లభించింది. ఈ జాబితాలో నిలిచిన ఏకైక భారతీయ సెలబ్రిటీ హిమేశ్. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన పాప్ స్టార్ల జాబితాలో ఆయనకు చోటు దక్కడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
-
మృణాల్‌ను ఫాలో అవుతున్న ధనుష్ సిస్టర్స్!
హీరో ధనుష్-హీరోయిన్ మృణాల్‌ఠాకూర్ డేటింగ్‌లో ఉన్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచారు. ధనుష్ సిస్టర్స్ కార్తిక, విమలను మృణాల్ కలిసినట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరినీ ఇన్‌స్టాలో మృణాల్ ఫాలో అవుతుండగా.. వాళ్లు కూడా ఈ బ్యూటీ ఫాలోవర్స్ లిస్ట్‌లో చేరారు. దీంతో మృణాల్-ధనుష్ డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది.
-
‘OG’ ఫస్ట్ సాంగ్.. క్రేజీ రికార్డు!
పవన్‌కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘OG’. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ అదరగొట్టింది. తాజాగా ఈ సాంగ్ స్పాటిఫైలో రికార్డ్ రెస్పాన్స్ అందుకున్నట్టు సోనీ మ్యూజిక్ వెల్లడించింది. ఇందులో వేగంగా 1 మిలియన్ స్ట్రీమ్స్ అందుకున్న సాంగ్స్‌లో ఒకటిగా రికార్డ్ సెట్ చేసినట్లు చెబుతున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ సెప్టెంబర్ 25న విడుదల కాబోతోంది.
-
ఓటీటీలోకి హారర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ‘అంధేరా’ అనే హారర్ వెబ్‌సిరీస్‌ను ప్రకటించింది. ఈ వెబ్‌సిరీస్‌ను ఆగస్టు 14 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రియా బాపత్, కరణ్‌వీర్ మల్హోత్రా, ప్రజక్త కోలి, సుర్వీన్ చావ్లా ప్రధాన పాత్రల్లో నటించారు. రాఘవ్ దర్ దర్శకత్వం వహించాడు. ఇది ఎనిమిది ఎపిసోడ్లుగా ప్రసారంకానుంది.
-
అనుపమ ‘పరదా’ కోసం స్టార్ హీరో!
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న లేడీఓరియెంటెడ్ చిత్రం ‘పరదా’. ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. ఆగస్టు 9న సా.4:30 గంటలకు హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ఈ వేడుక జరనుంది. అయితే ఈ ఈవెంట్‌కు గెస్ట్‌గా హీరో రామ్ పోతినేని రాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ మూవీ ఈనెల 22న విడుదలకానుంది.
-
చిరంజీవి రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ: తమ్మారెడ్డి భరద్వాజ
సినీకార్మికులకు జీతాలు ఎక్కువేనని సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయపడ్డారు. నిర్మాతలే దేవుళ్లని, వారు డబ్బులు పెడితేనే కార్మికులు జీవిస్తున్నారని అన్నారు. బీడీ కార్మికులు, వ్యవసాయకూలీల మాదిరిగానే సినీ కార్మికులకూ ఏటా ఇండెక్స్ ప్రకారం కొంత వేతనం పెంచాలని సూచించారు. చిరంజీవి ప్రస్తుత రెమ్యూనరేషన్ ఆయన 40 ఏళ్ల సినీ జీవితంలో సంపాదించిన దానికంటే చాలా ఎక్కువని ఆయన వ్యాఖ్యానించారు.
-
సినీ కార్మికుల వేతనం పెంపు.. నిర్మాతల ప్రతిపాదనలు!
సినీకార్మికులు వేతనపెంపుపై ఫిల్మ్‌ఫెడరేషన్ ప్రతినిధులతో ఫిల్మ్‌ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సభ్యులు సమావేశమైయ్యారు. నిర్మాతల 4 ప్రతిపాదనలపై ఫెడరేషన్ నిర్ణయం చెబితేనే వేతన పెంపుపై నిర్ణయం తీసుకుంటామని నిర్మాతలు తెలిపారు.
- ఫ్లెక్స్‌ఫుల్ కాల్‌షీట్లు కావాలి.
- ఇక్కడ సరైన టెక్నీషిన్స్ లేనప్పుడు.. నాన్‌మెంబర్స్‌తో కూడా వర్క్ చేయించుకుంటాం.
- షూటింగ్ ఎక్కడ చేసినా రేషియో ఉండకూడదు.
- సెకండ్ సండే ఫెస్టివల్ డేస్‌లో పనికి మాత్రమే డబుల్ కాల్‌షీట్..మిగిలిన సండేస్‌లో సింగిల్ కాల్‌షీట్.