Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ఫస్ట్ సాంగ్‌ డేట్ ఫిక్స్!

    నాగశౌర్య-విధి జంటగా రామ్ దేశిన తెరకెక్కిస్తున్న చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్‌ను విడుదల కాబోతున్నట్లు మేకర్స్ తాజాగా పోస్టర్ ద్వారా ప్రకటించారు. ‘నా మావ పిల్లనిత్తనన్నడే’ అని సాగే ఈ పాట ఆగస్టు 8న రిలీజ్ కానున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో నాగశౌర్య హీరోయిన్‌ను ఎత్తుకుని మాస్‌లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

  • వెరైటీగా ‘కూలీ’ ప్రమోషన్స్.. వీడియో వైరల్!

    రజనీకాంగ్ హీరోగా నటించిన ‌కూలీ’ సినిమా ఈనెల 14న రిలీజ్‌కానుంది. ఈనేపథ్యంలో మేకర్స్ వెరైటీగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌తో చేతులు క‌లిపారు. అమెజాన్ పార్సిల్‌ బాక్స్‌లపై ప్రమోషన్ పోస్టర్స్ ముద్రించి.. సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్ పంచుకుంది. (వీడియో)

  • ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

    ఈ వారం ఓటీటీలో పలు వినోదాత్మక చిత్రాలు.. థ్రిల్లింగ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్దమైయ్యాయి. మరి అవేంటో ఏ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.

    • సోనీలివ్‌: ‘మయసభ’ (స్ట్రీమింగ్‌ అవుతోంది)
    • నెట్‌ఫ్లిక్స్‌: ‘ఓహో ఎంథన్‌ బేబీ’ (ఆగస్టు 8)
    • జియో హాట్‌స్టా: ‘సలాకార్‌’ (ఆగస్టు 8)
    • అమెజాన్‌ప్రైమ్‌: ‘అరేబియా కడలి’ (ఆగస్టు 8)
    • జీ5: ‘మోతెవరి లవ్‌స్టోరీ’ (ఆగస్టు 8)
    • ఈటీవీ విన్‌: ‘బద్మాషులు’ (ఆగస్టు 8)

  • సినీ కార్మికుల సమస్యపై నిర్మాత బన్నీ వాస్ రియాక్షన్ ఇదే!

    సినీ కార్మికుల వేతనాల పెంపు సమస్యపై నిర్మాత బన్నీవాస్ స్పందించారు. ‘పెద్ద సంస్థ గీతా ఆర్ట్స్‌.. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి ఎందుకు దూరంగా ఉంటుంది?’ అని మీడియా ప్రశ్నించగా.. అనుభవం ఉంది కాబట్టి అని బన్నీవాస్ సమాధానమిచ్చారు. ‘సమస్యల పరిష్కారానికి అనుభవం ఉపయోగపడాలి కదా’ అని ప్రస్తావించగా.. దానికోసం కొన్ని బృందాలు పని చేస్తున్నాయని.. ఏమైనా సందేహాలు వస్తే ఫోన్‌ చేసి అడుగుతున్నారని ఆయన చెప్పారు.

  • గుడ్ న్యూస్.. ప్రభాస్‌తో నటించే అవకాశం!

    ప్ర‌భాస్-సందీప్‌రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్‌’ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమను టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి. అయితే
    ఇందులో న‌టించేందుకు ఆస‌క్తి ఉన్నవారిని మేకర్స్ డిజిట‌ల్ ఆడిష‌న్స్‌కు పిలిచారు. ఈ మేరకు ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేశారు. ఈ సినిమాలో నటించేందుకు 13-17 ఏళ్ల అబ్బాయిలను ఆడిష‌న్స్‌లో పాల్గోన‌వ‌చ్చని తెలిపారు. వివరాలను spirit.bhadrakalipictures@gmail.comకి పంపాలని కోరారు.

  • ఆకట్టుకునేలా ‘కిష్కిందపురి’ ఫస్ట్‌ సాంగ్!

    బెల్లకొండ సాయిశ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘కిష్కిందపురి’. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీలోని ‘ఉండిపోవే నాతోనే’ అంటూ సాగే లిరికల్‌ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. చైతన్‌ భరద్వాజ్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు పూర్ణ చారి సాహిత్యం అందించగా.. జావేద్‌ అలీ ఆలపించారు.

     

  • ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన రేణు దేశాయ్!

    నటి రేణు దేశాయ్ తాజాగా ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. తను 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుటి ఫొటోను పంచుకుంది. ఇక ఆ ఫొటోలో రేణు చాలా సన్నగా అందంగా ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దాన్ని చూసిన నెటిజన్లు అప్పట్లో చాలా అందంగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

  • స్టన్నింగ్ లుక్‌లో ఇస్మార్ట్ బ్యూటీ!

    ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ మరోసారి మోడ్రన్ లుక్‌తో అదరగొట్టింది. ఈ అమ్మడు తాజాగా సోషల్‌మీడియాలో షేర్ చేసిన స్టన్నింగ్ ఫొటో నెట్టింట వైరలవుతోంది.

  • రిలీజ్‌కు ముందే.. అక్కడ ‘కూలీ’ హవా!

    రజనీకాంత్‌-లోకేశ్‌ కాంబోలో రాబోతున్న ‘కూలీ’ సినిమాకు ప్రారంభించిన నాటినుంచే ఓవర్సీస్‌లో ఆసక్తి ఏర్పడింది. ఈనెల 14 విడుదలకానుంది. దీంతో ఈ మూవీ టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ప్రీమియర్స్‌కే 50వేల టికెట్స్‌ అమ్మడైనట్లు మేకర్స్ తెలిపారు. అలాగే ప్రీ-సేల్‌ బుకింగ్స్‌లోనే ఈ చిత్రం 1.3 మిలియన్‌ డాలర్లు వసూలు చేసినట్లు వెల్లడించారు. విడుదలకు ముందే రెండు మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.

  • రష్మిక ఆసక్తికర పోస్ట్.. నెటిజన్ల కామెంట్స్!

    హీరోయిన్ రష్మిక తాజాగా చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. ఆమె తన ఇన్‌స్టాలో కొన్ని డిఫెరెంట్ ఫొటోలను షేర్ చేసింది. అందులో బ్లాక్, వైట్ డ్రెస్సుల్లో.. ఓ కంపెనీ డిజైన్ చేసిన షూస్‌‌ను వేసుకొని వాటిని ప్రమోట్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు లుకింగ్ లైక్ ఎ వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.