Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన రేణు దేశాయ్!

    నటి రేణు దేశాయ్ తాజాగా ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. తను 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుటి ఫొటోను పంచుకుంది. ఇక ఆ ఫొటోలో రేణు చాలా సన్నగా అందంగా ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దాన్ని చూసిన నెటిజన్లు అప్పట్లో చాలా అందంగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

  • స్టన్నింగ్ లుక్‌లో ఇస్మార్ట్ బ్యూటీ!

    ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ మరోసారి మోడ్రన్ లుక్‌తో అదరగొట్టింది. ఈ అమ్మడు తాజాగా సోషల్‌మీడియాలో షేర్ చేసిన స్టన్నింగ్ ఫొటో నెట్టింట వైరలవుతోంది.

  • రిలీజ్‌కు ముందే.. అక్కడ ‘కూలీ’ హవా!

    రజనీకాంత్‌-లోకేశ్‌ కాంబోలో రాబోతున్న ‘కూలీ’ సినిమాకు ప్రారంభించిన నాటినుంచే ఓవర్సీస్‌లో ఆసక్తి ఏర్పడింది. ఈనెల 14 విడుదలకానుంది. దీంతో ఈ మూవీ టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ప్రీమియర్స్‌కే 50వేల టికెట్స్‌ అమ్మడైనట్లు మేకర్స్ తెలిపారు. అలాగే ప్రీ-సేల్‌ బుకింగ్స్‌లోనే ఈ చిత్రం 1.3 మిలియన్‌ డాలర్లు వసూలు చేసినట్లు వెల్లడించారు. విడుదలకు ముందే రెండు మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.

  • రష్మిక ఆసక్తికర పోస్ట్.. నెటిజన్ల కామెంట్స్!

    హీరోయిన్ రష్మిక తాజాగా చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. ఆమె తన ఇన్‌స్టాలో కొన్ని డిఫెరెంట్ ఫొటోలను షేర్ చేసింది. అందులో బ్లాక్, వైట్ డ్రెస్సుల్లో.. ఓ కంపెనీ డిజైన్ చేసిన షూస్‌‌ను వేసుకొని వాటిని ప్రమోట్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు లుకింగ్ లైక్ ఎ వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

  • Viedo: ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

    పవన్‌కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేనీ, రవిశంకర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్‌పై మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. ‘‘పవన్‌కళ్యాణ్‌కు సంబంధించి ఇంకా వారం షూట్ ఉంది. ఆ తర్వాత మరో 25రోజుల షూటింగ్‌తో సినిమా పూర్తవుతుంది. ప్రస్తుతం రిలీజ్ గురించి ఇప్పుడే చెప్పలేం’’ అని  వెల్లడించారు.(వీడియో)

  • Video: అభిమాని కాళ్లు మొక్కిన స్టార్ హీరో!

    బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ జనాల హృదయాలను గెలుచుకున్నాడు. ఓ పెద్దావిడను గౌరవించి.. తన ప్రవర్తనతో ఆకట్టుకున్నాడు. బుధవారం రాత్రి.. రణ్‌వీర్‌ ముంబయిలోని ఓ డబ్బింగ్‌ స్టూడియోకు వెళ్లాడు. బయటకు వచ్చే క్రమంలో అక్కడే తనకోసం ఎదురుచూస్తున్న ఓ అభిమానిని గమనించాడు. వెంటనే ఆమె పాదాలకు నమస్కరించి.. కాసేపు ముచ్చటించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

  • మోడల్‌ను చూస్తూ నడిరోడ్డుపై పాడు పని చేశాడు!

    హర్యానాలోని గురుగ్రామ్‌లో ఒక మోడల్‌కు చేదు అనుభవం ఎదురైంది. రద్దీగా ఉండే జంక్షన్‌లో పట్టపగలు తాను క్యాబ్‌ కోసం వేచి ఉండగా, ఒక వ్యక్తి తన వైపు చూస్తూ ప్యాంటు జిప్‌ విప్పి హస్తప్రయోగం చేసుకున్నాడని ఆమె చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి తాను రికార్డ్‌ చేసిన వీడియోను ఆమె షేర్‌ చేశారు. దీనిపై పోలీసుల నుంచి తనకు సత్వర సాయం అందలేదని ఆమె పేర్కొంది.

  • ‘లిటిల్‌ హార్ట్స్‌’ నుంచి సరికొత్త లిరికల్‌ సాంగ్‌

    మౌలి, శివానీ నాగారం కీలక పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘లిటిల్‌ హార్ట్స్‌’. సాయి మార్తాండ్‌ దర్శకుడు. ఈటీవీ విన్‌ ఒరిజినల్‌ ప్రొడక్షన్‌ నిర్మిస్తోంది. సెప్టెంబరు 12న ఈ మూవీ థియేటర్స్‌లో విడుదల కానుంది.  ఈ సందర్భంగా చిత్ర బృందం ‘రాజాగాడికి..’ అంటూ సాగే లిరికల్‌ వీడియోను పంచుకుంది. సింజిత్‌ ఎర్రమిల్లి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం అందించారు. సంజిత్‌ హెగ్డే ఆలపించారు.

     

  • అభిమాని కోసం నిల్చున్న రజనీకాంత్‌

    అగ్రహీరో అయినప్పటికీ సామాన్య వ్యక్తిగా ఉండడం రజనీకాంత్‌ ప్రత్యేకత. ఎక్కడ కనిపించినా సింపుల్‌గా అభిమానులతో కలిసిపోతూ సరదాగా ఉంటారు. తాజాగా రజనీకాంత్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అవుతోంది. రజనీ విమానంలో ప్రయాణిస్తోన్న సమయంలో వెనకనుంచి ఓ వ్యక్తి ‘తలైవా మీ ఫేస్‌ చూడాలనుంది’ అని కోరారు. వెంటనే ఆయన నిల్చుని అక్కడ ఉన్నవారందరికీ అభివాదం చేశారు. దీంతో అందరూ కేరింతలు వేశారు.

     

  • ‘హరిహర వీరమల్లు’కు సాయం చేయలేదు: నిర్మాత విశ్వప్రసాద్‌

    పవన్ కల్యాణ్ కుమారుడు అకీరాతో సినిమా చేయాలని అందరికీ ఉంటుందని నిర్మాత విశ్వప్రసాద్ తెలిపారు. తనకు కూడా అవకాశం వస్తే కచ్చితంగా అకీరాను ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని చెప్పారు. అయితే, ఆ సినిమా అవకాశం కోసం పవన్.. ‘హరిహర వీరమల్లు’ పనుల్లో సాయం చేశానని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. అది అవాస్తవమని స్పష్టం చేశారు.