నటి సంగీత తన భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరును ‘సంగీత క్రిష్’ నుంచి ‘సంగీత యాక్టర్’గా మార్చుకోవడంతో ఈ వార్తలకు బలం చేకురింది. అయితే ఈ వార్తలను సంగీత ఖండించారు. ‘ఆ ప్రచారంలో నిజం లేదు. నేను మొదటి నుంచి నా పేరును ఇన్‌స్టాగ్రామ్‌లో సంగీత యాక్టర్ అని ఉంచుకున్నాను’ అని తెలిపారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
రజనీకాంత్ మేకప్ లేకుండా ఎలా ఉంటారు? : CPI నారాయణ
సినీ కార్మికుల పరిస్థితిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా అంటే కేవలం డైరెక్టర్, హీరో, హీరోయిన్ కాదని, కార్మికుల కృషి కూడా ముఖ్యమని అన్నారు. హీరోలకు కోట్లలో పారితోషికాలు ఇస్తూ, కష్టపడే కార్మికులకు కనీస వేతనాలు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. మేకప్ లేకుండా సూపర్ స్టార్ రజనీకాంత్ ఎలా ఉంటారో ఒకసారి అందరూ ఆలోచించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్మికులను విస్మరిస్తే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
-
‘వార్ 2’ సాంగ్ టీజర్.. ఎన్టీఆర్-హృతిక్ స్టెప్పులు అదుర్స్
వార్ 2’ చిత్రానికి అంచనాలు ఊపందుకున్నాయి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సాంగ్ టీజర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ‘దునియా సలాం అనాలి’ అంటూ హృతిక్, తారక్ ఇద్దరూ హుషారుగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. పూర్తి పాటను థియేటర్‌లోనే చూడాలని చిత్రబృందం వెల్లడించింది.
-
మంచు లక్ష్మి – అర్హ ఫన్నీ వీడియో..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హతో మంచు లక్ష్మి చేసిన ఫన్ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. అయితే, ఈ వీడియోలో ‘‘మీరు తెలుగులో మాట్లాడుతున్నారా అని మంచు లక్ష్మిని అర్హ అడిగింది. దీనికి లక్ష్మి స్పందిస్తూ.. ‘‘ఆ సందేహం ఎందుకు వచ్చింది’’ అని ఆమె ప్రశ్నించింది. కాగా, మంచు లక్ష్మి తెలుగు భాషపై గతంలో చాలా ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
-
హిరోషిమా అణు దాడి ఆధారంగా చిత్రం!
దర్శకుడు జేమ్స్ కామెరూన్ ‘అవతార్’ సిరీస్‌కు సంబంధం లేని ఒక కొత్త సినిమాను ప్రకటించారు. ఈ సినిమా కథా నేపథ్యం రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హిరోషిమా అణు దాడి ఆధారంగా ఉండనుంది. ఈ సినిమా కోసం కామెరూన్ తన దీర్ఘకాల స్నేహితుడు, రచయిత చార్లెస్ పెల్లెగ్రినో రాసిన Ghosts of Hiroshima అనే పుస్తకాన్ని ఆధారంగా తీసుకుంటున్నారు.
-
సినీ కార్మికుల సమ్మె.. నేడు కీలక చర్చలు
HYD : వేతనాలు పెంచాలంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్మికుల సమ్మె గురువారం నాటికి నాలుగో రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో నేడు ఫిల్మ్ చాంబర్‌లో నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యుల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. చర్చలు తరువాత మధ్యాహ్నం FDC ఛైర్మన్, నిర్మాత దిల్ రాజును ఫెడరేషన్ సభ్యులు కలవనున్నారు. ఆ తర్వాత తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డిని కలవబోతున్నారు.
-
ప్రముఖ నటుడిపై కాల్పులు.. మృతి
వర్జీనియాలోని రిచ్‌మండ్‌కు చెందిన నటుడు ఆడమ్ టర్క్(35) హత్యకు గురయ్యారు. ట్రాఫిక్ స్టాప్‌లో గృహ హింస బాధితుడికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తుండగా 19ఏళ్ల వ్యక్తి అతనిపై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. దీంతో ఆడమ్ చనిపోయారని చెప్పారు. ‘‘అవసరంలో ఉన్న వ్యక్తిని రక్షించడానికి ఆడమ్ తన ప్రాణాలను పణంగా పెట్టాడు. ఈ త్యాగానికి మేము అతనిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాము’’ అని ఆడమ్ కుటుంబసభ్యులు తెలిపారు.
-
ఇక్కడ ‘ఏ’ సర్టిఫికెట్.. అక్కడ జీరో కట్స్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనకరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘కూలీ’. ఈ మూవీకి ఇండియాలోని సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. తాజాగా ఈ సినిమా యూకేలో సెన్సార్ పూర్తి చేసుకుంది. అయితే ఈ మూవీకి ఒక్క కట్ కూడా సూచించకుండా ఓవర్సీస్ బోర్డ్ సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చింది.
-
పెద్ద సౌత్‌స్టార్ అప్పుడు క్షమాపణలు చెప్పాడు: తమన్నా
తన కెరీర్ తొలినాళ్లను హీరోయిన్ తమన్నా గుర్తు చేసుకున్నారు. ఓ పెద్ద సౌత్ స్టార్‌తో కొన్ని సన్నివేశాలు చేయడానికి ఇబ్బంది పడినట్లు వెల్లడించారు. తనపై ఆయన గట్టిగా అరిచారని చెప్పారు. అయితే ఆ తర్వాతి రోజే ఆ స్టారే స్వయంగా తనకు క్షమాపణలు చెప్పారని పేర్కొన్నారు.