Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ప్రముఖ నటుడిపై కాల్పులు.. మృతి

    వర్జీనియాలోని రిచ్‌మండ్‌కు చెందిన నటుడు ఆడమ్ టర్క్(35) హత్యకు గురయ్యారు. ట్రాఫిక్ స్టాప్‌లో గృహ హింస బాధితుడికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తుండగా 19ఏళ్ల వ్యక్తి అతనిపై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. దీంతో ఆడమ్ చనిపోయారని చెప్పారు. ‘‘అవసరంలో ఉన్న వ్యక్తిని రక్షించడానికి ఆడమ్ తన ప్రాణాలను పణంగా పెట్టాడు. ఈ త్యాగానికి మేము అతనిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాము’’ అని ఆడమ్ కుటుంబసభ్యులు తెలిపారు.

  • ఇక్కడ ‘ఏ’ సర్టిఫికెట్‌.. అక్కడ జీరో కట్స్‌

    సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనకరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘కూలీ’. ఈ మూవీకి ఇండియాలోని సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. తాజాగా ఈ సినిమా యూకేలో సెన్సార్ పూర్తి చేసుకుంది. అయితే ఈ మూవీకి ఒక్క కట్‌ కూడా సూచించకుండా ఓవర్సీస్‌ బోర్డ్‌ సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చింది.

  • పెద్ద సౌత్‌స్టార్‌ అప్పుడు క్షమాపణలు చెప్పాడు: తమన్నా

    తన కెరీర్ తొలినాళ్లను హీరోయిన్ తమన్నా గుర్తు చేసుకున్నారు. ఓ పెద్ద సౌత్‌ స్టార్‌తో కొన్ని సన్నివేశాలు చేయడానికి ఇబ్బంది పడినట్లు వెల్లడించారు. తనపై ఆయన గట్టిగా అరిచారని చెప్పారు. అయితే ఆ తర్వాతి రోజే ఆ స్టారే స్వయంగా తనకు క్షమాపణలు చెప్పారని పేర్కొన్నారు.

  • పెళ్లిపై మృణాల్ ఠాకూర్ ఏమన్నారంటే?

    పెళ్లిపై తన అభిప్రాయాన్ని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పంచుకున్నారు. మ్యారేజ్‌ చేసుకోవడం, పిల్లల్ని కనడం అనేది తన చిన్ననాటి కల అని ఆమె చెప్పారు. ‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌-2’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ షోలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా తమిళ హీరో ధనుష్‌తో మృణాల్‌ డేటింగ్‌ చేస్తున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. వీడియో కోసం CLICK HERE.

  • ధర్మస్థల ఘటనపై ప్రకాశ్‌రాజ్ రియాక్షన్ ఇదే!

    కర్ణాటకలోని ధర్మస్థలలో విధులు నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని నటుడు ప్రకాశ్‌రాజ్ ఖండించారు. ఇలాంటి గూండాల వల్లే భక్తులు విశ్వసించే ధర్మస్థలకు కళంకం వస్తోందంటూ వీడియో విడుదల చేశారు. సౌజన్య దారుణ హత్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తే, వారు ఎందుకు కోపంగా ఉన్నారని ప్రశ్నించారు. దయచేసి నిందితులను అరెస్టు చేసి, నిజం బయటకు తీసుకురావాలని కోరారు. వీడియో కోసం CLICK HERE.

  • ఈనెల 22న చిరంజీవి-అనిల్ మూవీ నుంచి గ్లింప్స్?

    మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా రానుంది. ఈనెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. షైన్‌ స్క్రీన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీని వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.

  • ఇక పెళ్లి చేసుకుంటా.. 50ఏళ్ల వయసులో నటి సంచలనం

    హాలీవుడ్ ప్రముఖ నటి షాఫీ బెల్లో సంచలన కామెంట్స్ చేసింది. 50ఏళ్ల బెల్లో ఓ ఇంటర్వ్యూలో సెక్స్‌కు సంబంధించి ఓపెన్‌గా మాట్లాడింది. ‘ఇన్నాళ్లు నా సంతోషం కోసం వయసులో నా కన్నా చిన్నవాళ్లతో ఎంతో మందితో శృంగారంలో పాల్గొన్నా.. కానీ ఇక అలాంటి రిలేషన్‌షిప్స్ వద్దు అనుకుంటున్నా. నాకు ఎప్పటికీ, జీవితాంతం తనతో ఉండిపోయే బంధం కావాలి. అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా’ అని తెలిపింది.

  • నిర్మాతలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది: బాలక్రిష్ణ

    టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణను గిల్డ్ నిర్మాతలు బుధవారం కలిశారు. సినీ కార్మికుల అంశంపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బాలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో నిర్మాతలు బాగుంటేనే అందరూ బాగుంటారన్నారు. షూటింగ్‌లో అవసరమైనంత వరకే టీమ్‌ను తీసుకుందామని నిర్మాతలకు హామీ ఇచ్చారు. సినీ కార్మికుల సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు. నిన్న మెగాస్టార్‌ను కూడా నిర్మాతలు కలిశారు.

  • మాకెందుకు నేషనల్ అవార్డులు ఇవ్వరు.. అనుపమ

    హిందీ టీవీ ఇండస్ట్రీలో ‘అనుపమ’ సీరియల్ నటి రూపాలీ గంగూలీ.. టైటిల్ పాత్రలో ఒదిగిపోయి విమర్శల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ మధ్య ఈమె సంచలన కామెంట్స్ చేసింది. ఇటీవలే 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించగా.. సినిమా ఇండస్ట్రీకి మాత్రమే కాదు టెలివిజన్ ఇండస్ట్రీకి కూడా నేషనల్ అవార్డ్స్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. టెలివిజన్ నటీనటులను గుర్తించాలని.. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని కోరింది.

  • ఆ ప్రభావం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’పై లేదు: నిర్మాత నవీన్‌

    ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’పై నిర్మాత నవీన్‌ యెర్నేని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వూలో ‘జులై ఆఖరికే ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ షూటింగ్‌ అయిపోతుందన్నారు కదా! కార్మికుల సమ్మె మీ సినిమాపై ఎఫెక్ట్‌ చూపిందా?’ అని అడగ్గా.. ‘‘హీరో పాత్రకు సంబంధించి ఓ వారం షూటింగ్‌, మిగిలిన వారిపై దాదాపు 25 రోజుల చిత్రీకరణ మిగిలి ఉంది. సమ్మె మాకు ఎఫెక్ట్‌ కాలేదు. విడుదల తేదీ గురించి ఇంకా ఆలోచించలేదు’’ అని తెలిపారు.