Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘సు ఫ్రమ్ సో’

    కన్నడ భాషలో సూపర్ నాచురల్ కామెడీ సినిమా ‘సు ఫ్రమ్ సో’ 2025లో భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.4కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.50కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్స్ బద్దలు కొట్టింది. సైయారా, మహావతార్ నరసింహ వంటి భారీ బడ్జెట్ సినిమాల కంటే కూడా ఈ సినిమా కమర్షియల్ హిట్‌గా నిలిచింది. కాగా ఈ మూవీ తెలుగులో ఆగష్టు 8న విడుదల కానుంది.

  • నటి శ్వేతా మీనన్‌పై కేసు

    మలయాళ నటి శ్వేతా మీనన్‌పై అశ్లీల చిత్రాల్లో నటించారనే ఆరోపణలతో కోచి పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక కార్యకర్త మార్టిన్ మేనచెరి కోర్టు ఆదేశాల మేరకు ఈ ఫిర్యాదు చేశారు. ఆయన తన ఫిర్యాదులో శ్వేతా మీనన్ నటించిన ‘పలేరి మాణిక్యం’, ‘రతినిర్వేదం’, ‘కాళిమన్ను’ చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలను, అలాగే ఒక కండోమ్ ప్రకటనను ఉదహరించారు. ఇవి సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రచారం అవుతున్నాయని ఆరోపించారు.

     

  • తన బయోపిక్‌లో జైదీప్ ఉండాలన్న నితీష్ రానా!

    భారత క్రికెటర్ నితీష్ రానాకు ‘హెచ్‌టి సిటీ ఢిల్లీ మోస్ట్ స్టైలిష్ స్పోర్ట్స్‌పర్సన్’ అవార్డు లభించింది. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ, తన జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీస్తే అందులో తన పాత్రను జైదీప్ అహ్లావత్ పోషిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’ ,’పాటాల్ లోక్’ వంటి చిత్రాలతో జైదీప్ అహ్లావత్ మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ 3లో నటిస్తున్నారు.

  • బిగ్ బాస్‌లోకి లెస్బియన్ కపుల్..

    మలయాళ బిగ్ బాస్ సీజన్ 7లో ఒక లెస్బియన్ జంట అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. కేరళకు చెందిన అదీలా, ఫాతిమా అనే ఈ జంట సౌదీ అరేబియాలో చదువుకునేటప్పుడు స్నేహితులుగా మారి, ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. తమ బంధాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో ఇద్దరూ ఇళ్లను విడిచి వచ్చారు. వీరి ప్రేమ కథ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టా లింక్

  • ‘నటీనటులు అనుమతి తీసుకోవాల్సిందే’

    మా అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నటీనటులు అవార్డుల ఫంక్షన్లు లేదా ఇతర ఈవెంట్లలో డ్యాన్స్, స్కిట్స్ వంటి ప్రదర్శనలు ఇస్తే, తప్పనిసరిగా మా అసోసియేషన్ అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. గతంలో ఇలా ప్రదర్శనలు ఇచ్చిన వారికి పారితోషికం అందకపోవడంతో, ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధన ‘మా’లో సభ్యత్వం ఉన్న నటులందరికీ వర్తిస్తుందని ఆయన తెలిపారు.

  • ఏడాదికి నాలుగు సినిమాలు చేయనున్న బాలకృష్ణ: నిర్మాత

    నటుడు బాలకృష్ణతో టాలీవుడ్ నిర్మాతలు భేటీ అయ్యారు. అనంతరం నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. పరిశ్రమలో నిర్మాతలు బాగుంటేనే అందరూ బాగుంటారని బాలకృష్ణ చెప్పారని తెలిపారు. వర్కింగ్ డేస్‌తో పాటు షూటింగ్‌లకు అవసరమైన టీమ్‌ను తగ్గించుకోవాలని బాలకృష్ణ సూచించారు. తాను కూడా ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తానని చెప్పిన బాలకృష్ణ, అందరికీ మంచి జరిగేలా త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

  • ఓటీటీలోకి వచ్చేసిన ‘మయసభ’

    ప్రముఖ దర్శకుడు దేవా కట్ట క్రియేట్ చేసిన పొలిటికల్ థ్రిల్లర్ “మయసభ” ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చేసింది.గురువారం విడుదల కావాల్సిన ఈ వెబ్ సిరీస్ బుధవారమే రిలీజ్‌ అయింది. ఓటీటీ ‘సోనీలివ్‌’లో ఐదు భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఆది పినిశెట్టి, చైతన్యరావు ప్రధాన పాత్రధారులుగా, 1974–1980 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ మార్పుల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు.

  • వేతనాలు పెంచలేం.. తేల్చి చెప్పిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్!

    HYD:సినీ కార్మికులకు 30% వేతన పెంపునకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నిరాకరించింది. ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ మధ్య వేతన వివాదంపై లేబర్ అడిషనల్ కమిషనర్ గంగాధర్ చర్చలు జరిపారు. కాల్ షీట్లలో వెసులుబాటు, ఆదివారం డబుల్ పేమెంట్‌కి బదులు పండుగలకు మాత్రమే డబుల్ పేమెంట్ వంటి డిమాండ్లను కౌన్సిల్ ముందుకు తెచ్చింది. తక్కువ శాతం వేతనం పెంపునకు సిద్ధమని, సమ్మె ఆపాలని కోరారు.

  • 33 ఏళ్ల వయసులో నటి కన్నుమూత

    ‘ది వాకింగ్ డెడ్’, ‘షికాగో మెడ్’ వంటి టీవీ షోలతో ప్రసిద్ధి చెందిన నటి కెల్లీ మాక్, 33 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత ఏడాది ఆమెకు అరుదైన మరియు వేగంగా వ్యాపించే మెదడు క్యాన్సర్ అయిన సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ గ్లియోమా ఉన్నట్లు బయటపడింది.  “ఒక ప్రకాశవంతమైన కాంతి ఈ లోకాన్ని వీడి, చివరికి వెళ్లాల్సిన ప్రదేశానికి చేరుకుంది” అని ఆమె సోదరి భావోద్వేగంగా రాశారు.

     

  • అనుష్క శెట్టి ‘ఘాటి’ ట్రైలర్ వచ్చేసింది

    అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఘాటి’. ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కుతోంది. యాక్షన్ థ్రిల్లర్‌లో విక్రమ్ ప్రభు కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్ర ట్రైలర్‌ను మూవీటీం తాజాగా రిలీజ్ చేసింది. గంజాయి అమ్మి బ్రతికే ‘ఘాటి’ అనే వర్గాన్ని మార్చే పాత్రలో అనుష్క నటించినట్లు తెలుస్తోంది. (Video)