Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • వేతనాలు పెంచలేం.. తేల్చి చెప్పిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్!

    HYD:సినీ కార్మికులకు 30% వేతన పెంపునకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నిరాకరించింది. ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ మధ్య వేతన వివాదంపై లేబర్ అడిషనల్ కమిషనర్ గంగాధర్ చర్చలు జరిపారు. కాల్ షీట్లలో వెసులుబాటు, ఆదివారం డబుల్ పేమెంట్‌కి బదులు పండుగలకు మాత్రమే డబుల్ పేమెంట్ వంటి డిమాండ్లను కౌన్సిల్ ముందుకు తెచ్చింది. తక్కువ శాతం వేతనం పెంపునకు సిద్ధమని, సమ్మె ఆపాలని కోరారు.

  • 33 ఏళ్ల వయసులో నటి కన్నుమూత

    ‘ది వాకింగ్ డెడ్’, ‘షికాగో మెడ్’ వంటి టీవీ షోలతో ప్రసిద్ధి చెందిన నటి కెల్లీ మాక్, 33 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత ఏడాది ఆమెకు అరుదైన మరియు వేగంగా వ్యాపించే మెదడు క్యాన్సర్ అయిన సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ గ్లియోమా ఉన్నట్లు బయటపడింది.  “ఒక ప్రకాశవంతమైన కాంతి ఈ లోకాన్ని వీడి, చివరికి వెళ్లాల్సిన ప్రదేశానికి చేరుకుంది” అని ఆమె సోదరి భావోద్వేగంగా రాశారు.

     

  • అనుష్క శెట్టి ‘ఘాటి’ ట్రైలర్ వచ్చేసింది

    అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఘాటి’. ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కుతోంది. యాక్షన్ థ్రిల్లర్‌లో విక్రమ్ ప్రభు కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్ర ట్రైలర్‌ను మూవీటీం తాజాగా రిలీజ్ చేసింది. గంజాయి అమ్మి బ్రతికే ‘ఘాటి’ అనే వర్గాన్ని మార్చే పాత్రలో అనుష్క నటించినట్లు తెలుస్తోంది. (Video)

  • వంట చేయడం నాకెంతో ఇష్టం: ఎన్టీఆర్‌

    జీవితంలో ఏదీ ప్లాన్‌ చేసుకోనని, వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటానని నటుడు జూ ఎన్టీఆర్‌ అన్నారు. ‘వార్‌-2’ విడుదలవుతున్న సందర్భంగా ఆయన కొన్ని వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. తాను నటుడిని మాత్రమేకాదని చెఫ్‌నని చెప్పారు. “నా భార్య కోసం, నా స్నేహితుల కోసం వంట చేయడం నాకెంతో ఇష్టం. పునుగులు బాగా వేస్తా. నేను వండే బిర్యానీ కూడా నాకు నచ్చుతుంది,” అని చెప్పారు.

     

     

  • నేను గేమింగ్‌ యాప్‌కే ప్రమోషన్‌ చేశా: విజయ్‌ దేవరకొండ

    బెట్టింగ్‌ యాప్‌ల కేసులో ఈడీ విచారణ అనంతరం నటుడు విజయ్‌ దేవరకొండ మీడియాతో మాట్లాడారు. తాను గేమింగ్‌ యాప్‌కు మాత్రమే ప్రమోషన్‌ చేశానని చెప్పారు. గేమింగ్‌ యాప్స్‌కి, బెట్టింగ్‌ యాప్స్‌కి తేడా ఉంటుందన్నారు. చాలా గేమింగ్‌ యాప్స్‌ చట్టబద్ధమైనవేనని చెప్పారు.

  • మన ఆరోగ్యానికి మనమే సీఈఓ’ : నటి లిసారే

    TG: హైదరాబాద్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో ‘ది మేనీ లైవ్స్‌ ఆఫ్‌ లిసా రే’ పేరిట బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో ఇంటరాక్టివ్‌ సెషన్‌ జరిగింది. ఇందులో లిసారే తనజీవిత అనుభవాలను పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. నా లైఫ్‌లో కొన్నిరోజులు అత్యంత చీకటిమయంగా మారింది’  మన ఆరోగ్యానికి మనమే CEO అన్నారు. హైదరాబాద్‌‌తో నాకు ఎంతో ప్రత్యేకం. మళ్లీ మళ్లీ ఇక్కడికే వస్తానని చెప్పారు.

  • ఆ జర్నలిస్టుకు రుణపడి ఉంటా: చిరంజీవి

    ఫీనిక్స్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన బ్లడ్‌ డొనేషన్‌ డ్రైవ్‌కు చిరంజీవి, తేజా సజ్జా ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. రక్తదానం గొప్పతనాన్ని వివరించారు. ఒక జర్నలిస్ట్‌ మూలంగా తనకు బ్లడ్‌ బ్యాంక్‌ పెట్టాలనే ఆలోచన వచ్చిందని ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. ఆయన రాసిన ఆర్టికల్‌ చదివిన తర్వాతే తనకు ఈ ఆలోచన వచ్చిందన్నారు. ఆయనను ఇప్పటివరకూ చూడలేదు కానీ, ఎప్పుడూ గుర్తుచేసుకుంటూనే ఉంటానని అన్నారు.

     

  • రిలేషన్‌ వార్తల వేళ.. ధనుష్‌ కుటుంబంతో మృణాల్‌!

    ధనుష్‌, మృణాల్‌ డేటింగ్‌లో ఉన్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల తరచుగా వీళ్లిద్దరూ కలిసి కనిపించడం, ఈవెంట్‌లకు వెళ్తుండడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా ధనుష్ సోదరీమణులు కార్తిక, విమల గీతను మృణాల్‌ కలిసినట్లు సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తోంది. మృణాల్‌ను ధనుష్ తన కుటుంబసభ్యులకు పరిచయం చేశారని కూడా వార్తలు వస్తున్నాయి.

  • సినిమా ఫెయిల్యూర్‌కు రివ్యూలే కారణం: నటి మృణాల్‌ ఠాకూర్‌

    సినిమా ఫెయిల్యూర్‌కి రివ్యూలే కారణమవుతాయని నటి మృణాల్‌ ఠాకూర్‌ అన్నారు. బాలీవుడ్‌లో ఆమె నటించిన “సన్‌ ఆఫ్‌ సర్దార్‌ 2′ ఇటీవల రిలీజైంది. అయితే నెగిటివ్‌ రివ్యూలు చూడటం వల్లే తాను ఈ సినిమా చూడలేదని ఓ అభిమాని మృణాల్‌కు చెప్పాడు. స్పందించిన ఆమె “చాలా రివ్యూలు తప్పుదారి పట్టిస్తున్నాయి. అందుకే రివ్యూలను నమ్మకుండా, సినిమా చూసి ఓ అభిప్రాయం తీసుకోవాలి’’ అని తెలిపారు.

  • క్యాన్సర్‌తో ప్రముఖ నటి మృతి

    ‘ది వాకింగ్ డెడ్’లో అడ్డీ పాత్ర ద్వారా ప్రసిద్ధి చెందిన నటి కెల్లీ మాక్ (33) కన్నుమూశారు. కెల్లి సెంట్రల్ నాడీ వ్యవస్థ గ్లియోమా అనే అరుదైన, తీవ్రమైన మెదడు క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆగస్టు 2న ఆమె సిన్సినాటిలో మరణించిందని తెలిపారు. కెల్లీ మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.