Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘మహావతార్​ నరసింహ’ మూవీకి భారీ వసూళ్లు

    చిన్న సినిమాగా రిలీజైన ‘మహావతార్​ నరసింహ’  బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు బ్రేక్ చేస్తుంది.ఈ సినిమా  దేశవ్యాప్తంగా రూ.105 కోట్లకుపైగా కలెక్షన్స్‌ రాబట్టింది. ఊహించని స్థాయిలో ఇక్కడ వచ్చిన స్పందనతో కొన్ని రోజుల క్రితం విదేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అక్కడ కూడా భారీ రెస్పాన్స్ అందుకుంటుంది. లాంగ్ రన్​లో వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది.

     

  • రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నా: చిరంజీవి

    HYD: ఫీనిక్స్‌ ఫౌండేషన్‌ ఏర్పాటుచేసిన బ్లడ్‌ డొనేషన్‌ డ్రైవ్‌లో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను చేసిన సేవా కార్యక్రమాలు, పంచిన ప్రేమాభిమానాలే నాకు రక్షణ. సోషల్‌మీడియాలో నాపై వచ్చే విమర్శలపై నేను మాట్లాడనక్కర్లేదు.. నేను చేసిన మంచే మాట్లాడుతుంది. నేను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ.. కొంత మంది నేతలు నన్ను విమర్శిస్తూనే ఉంటారు’’ అని చిరంజీవి అన్నారు.

     

  • ట్రెండింగ్‌లో ‘నల జీలకర మొగ్గ’ సాంగ్

    బుర్రకథలతో ఉత్తరాంధ్రను ఊపిన కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మేకర్స్ ‘గరివిడి లక్ష్మి’ అని పేరు పెట్టారు. తాజాగా ఈ మూవీ నుంచి రిలీజైన ‘నల జీలకర మొగ్గ’ పాట సోషల్ మీడియాలో ట్రెండవుతోంది. చరణ్ అర్జున్ మ్యూజిక్ అందించగా.. అనన్య భట్, జానకీ రామ్, గౌరి నాయుడు పాడారు. ఈ సినిమాకు గౌరి నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు.

     

  • ED విచారణకు హాజరైన విజయ్‌ దేవరకొండ

    HYD : నటుడు విజయ్‌దేవరకొండ ED విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్‌ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విజయ్‌ దేవరకొండను ED అధికారులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో నటుడు ప్రకాశ్‌రాజ్‌ను ED అధికారులు ప్రశ్నించారు. ఈ నెల 11న విచారణకు రావాలని రానాకు ED నోటీసులు ఇచ్చింది.

  • నట వారసత్వంపై Jr.NTR రియాక్షన్

    తన పిల్లల భవిష్యత్తు వారి ఇష్టానుసారమే ఉంటుందని హీరో జూనియర్ NTR స్పష్టం చేశారు. “నా తర్వాత నట వారసత్వాన్ని ఎవరు కొనసాగిస్తారో నాకు తెలియదు. నేను ఏదీ ప్లాన్ చేయలేదు. నువ్వు తప్పకుండా నటుడివి కావాలని చెప్పే రకమైన తండ్రిని కాదు. నేను వారికి అడ్డంకిగా కాకుండా, వారధిగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రపంచం, సంస్కృతులను వారే స్వయంగా తెలుసుకోవాలి. పండగల సమయంలో నా పిల్లలతోనే ఎక్కువగా సమయం గడుపుతాను” అని తెలిపారు.

  • మంచి ప్రేమకథతో వస్తున్న రష్మిక

    ‘యానిమల్‌’, ‘పుష్ప 2’, ‘ఛావా’, ‘కుబేర’.. ఇలా వరుస విజయాలతో జోరు మీదుంది నటి రష్మిక. ఇప్పుడామె నుంచి రానున్న హీరోయిన్ ప్రాధాన్య చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’.  ఈ చిత్రానికి రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించారు. దీక్షిత్‌ శెట్టి ముఖ్య పాత్ర పోషించారు. ఇది బలమైన భావోద్వేగాలు నిండిన ప్రేమకథతో రూపొందిన సినిమా.  ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ చిత్రం ఈ సెప్టెంబరులో తెరపైకి రానున్నట్లు సమాచారం.

     

     

  • ‘వార్‌ 2’ అంగీకరించడానికి కారణమిదే: ఎన్టీఆర్‌

     ‘వార్2’ సినిమాను తాను ఎందుకు ఒప్పుకున్నాననే విషయాన్ని తాజాగా ఎన్టీఆర్ చెప్పారు. ‘‘వార్‌2’ కోసం భాషతో సంబంధం లేకుండా అందరూ కలిసి పనిచేశారు. ఇకపై బాలీవుడ్‌, టాలీవుడ్‌, మాలీవుడ్‌ అనేవి లేవు. మనమంతా ఒక్కటే ఇండస్ట్రీ. ‘వార్ 2’ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం దాని స్క్రిప్ట్‌. బలమైన కథతో ఇది రూపొందింది. హృతిక్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది’’ అని చెప్పారు.

  • ‘రాజాసాబ్‌’ రిలీజ్‌.. నిర్మాత ఏమన్నారంటే!

    ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాజాసాబ్’. ఈ సినిమా రిలీజ్‌ని ఈ ఏడాది డిసెంబర్‌కి లాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ డేట్ జనవరి నెలకి వెళుతుందని తెలుస్తోంది. దీనిపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఓపెన్ అయ్యారు. తాము సినిమాని జనవరి 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్పారు. సంక్రాంతి సీజన్ కాబట్టి అప్పుడు బాగుంటుందని అనుకుంటున్నారట.

  • ‘కింగ్డమ్‌’ మూవీకి వ్యతిరేకంగా తమిళనాట ఆందోళనలు

    విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్డమ్‌’ మూవీలో శ్రీలంక తమిళులను నేరచరితులుగా చిత్రీకరించడాన్ని, అక్కడి మలైయగ తమిళులను శ్రీలంక తమిళులు అణచివేసినట్లు ఉన్న సన్నివేశాలపై తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలు, శ్రీలంక తమిళుల సానుభూతిపరులు మండిపడ్డారు. ఈమేరకు ‘కింగ్డమ్‌’ ప్రదర్శితమైన థియేటర్లను నామ్‌ తమిళర్‌ కట్చి కార్యకర్తలు ముట్టడించి సినిమా పోస్టర్లు, బ్యానర్లను చించివేశారు. కోయంబత్తూరు, రామనాథపురం తదితర ప్రాంతాల్లో నిరసనకారులను పోలీసులు అరెస్టుచేశారు.

  • బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు!

    ‘వీరసింహారెడ్డి’ తర్వాత గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ మరో సినిమా చేయనున్నారు. వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీశ్‌ కిలారు నిర్మించనున్నారు. చరిత్రను.. వర్తమానాన్ని ముడిపెడుతూ ఓ వినూత్నమైన ఎపిక్‌ స్టోరీలా దీన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ కథాంశానికి తగ్గట్లుగానే దీంట్లో బాలయ్య రెండు కోణాల్లో సాగే పాత్రలో కనువిందు చేయనున్నట్లు తెలిసింది.