Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘కింగ్డమ్‌’ మూవీకి వ్యతిరేకంగా తమిళనాట ఆందోళనలు

    విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్డమ్‌’ మూవీలో శ్రీలంక తమిళులను నేరచరితులుగా చిత్రీకరించడాన్ని, అక్కడి మలైయగ తమిళులను శ్రీలంక తమిళులు అణచివేసినట్లు ఉన్న సన్నివేశాలపై తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలు, శ్రీలంక తమిళుల సానుభూతిపరులు మండిపడ్డారు. ఈమేరకు ‘కింగ్డమ్‌’ ప్రదర్శితమైన థియేటర్లను నామ్‌ తమిళర్‌ కట్చి కార్యకర్తలు ముట్టడించి సినిమా పోస్టర్లు, బ్యానర్లను చించివేశారు. కోయంబత్తూరు, రామనాథపురం తదితర ప్రాంతాల్లో నిరసనకారులను పోలీసులు అరెస్టుచేశారు.

  • బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు!

    ‘వీరసింహారెడ్డి’ తర్వాత గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ మరో సినిమా చేయనున్నారు. వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీశ్‌ కిలారు నిర్మించనున్నారు. చరిత్రను.. వర్తమానాన్ని ముడిపెడుతూ ఓ వినూత్నమైన ఎపిక్‌ స్టోరీలా దీన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ కథాంశానికి తగ్గట్లుగానే దీంట్లో బాలయ్య రెండు కోణాల్లో సాగే పాత్రలో కనువిందు చేయనున్నట్లు తెలిసింది.

  • ప్రముఖ నటి అరెస్ట్

    ద‌ళితుల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో త‌మిళ న‌టి మీరా మిథున్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మూడేళ్లుగా ప‌రారీలో ఉన్న ఆమెను ప్ర‌స్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 11న కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌నున్నారు. ద‌ళితుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కేసులో 2021 ఆగ‌స్టులో మీరా మిథున్‌, ఆమె స్నేహితుడు శ్యామ్‌ అభిషేక్‌ను అరెస్టుచేశారు. అనంత‌రం బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చి విచార‌ణ‌కు హాజ‌రుకాక‌పోవ‌డంతో ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది.

  • రవితేజ పాటలో ఇలాంటి లిరిక్స్ ఉన్నాయా?

    రవితేజ ‘మాస్‌ జాతర సినిమాలోని ‘ఓలే ఓలే’ పాటలో బూతులు ధ్వనించేలా లిరిక్స్ ఉన్నాయని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘‘నీ అమ్మని… అక్కని..’’ అంటూ రచయిత భాస్కర్‌ యాదవ్‌ రెచ్చిపోయారని అంటున్నారు. ఆ పదాలు వినడానికి ఎబ్బెట్టుగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే పలువురు మాత్రం మాస్‌ అభిమానులను దృష్టిలో ఉంచుకొని పాట రాశారని, జానపదంలో ఇలాంటి పదజాలం సహజమని అభిప్రాయపడుతున్నారు.

  • నేడు ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ

    HYD: బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో నటుడు విజయ్ దేవరకొండ నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కేసులో నటుడు ప్రకాశ్‌రాజ్‌ను ఈడీ విచారించింది. మరోవైపు హీరో రానాకు కూడా ఆగస్టు 11న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. అలాగే మంచు లక్ష్మిని ఆగస్టు 13న విచారణకు పిలిచారు.

  • ఆ రెండు సినిమాలు వదులుకున్నందుకు బాధపడ్డా: హృతిక్‌ రోషన్‌

    హృతిక్ రోషన్, jr NTR కలిసి నటించిన చిత్రం ‘వార్‌ 2’. ఇది ఆగష్టు 14న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా హృతిక్ రోషన్ వదులుకున్న సినిమాలను గుర్తుచేసుకున్నారు. ‘దిల్‌ చాహతా హై’ (2001), ‘3 ఇడియట్స్‌’ (2009) చిత్రాలను తిరస్కరించినందుకు బాధపడ్డానని తెలిపారు. ఆ రెండింటిలో నటించిన ఆమిర్‌ఖాన్‌ను కొనియాడారు. ఆయా పాత్రలకు ఆమిర్‌ న్యాయం చేశారని పేర్కొన్నారు.

  • OTTలోకి వచ్చేసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్

    మొదటి రోజునే రూ. 9000 కోట్ల కలెక్షన్లు సాధించిన హాలీవుడ్ చిత్రం ‘జురాసిక్ వరల్డ్ రీబర్త్’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా జులై 2న థియేటర్లలో విడుదలైంది. గారెత్ ఎడ్వెర్డ్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ మరియు యాపిల్ టీవీ+లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం, దీనిని అద్దెకు మాత్రమే చూడగలరు. మరికొద్ది రోజుల్లో ఉచిత స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉంది.

  • ఓటీటీలోకి ‘మహావతార్‌ నరసింహ’?

    శ్రీ మ‌హావిష్ణువు న‌ర‌సింహావ‌తారం ఆధారంగా తెరకెక్కిన యానిమేటెడ్ సినిమా ‘మహావతార్‌ నరసింహ’. ఈ చిత్రం ఇప్పటికే వందకోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా ఓ ప్రముఖ ఓటీటీలో ఈ సినిమా సెప్టెంబరులోగానీ అక్టోబరులోగానీ విడుదల కానుందంటూ రూమర్స్‌ వచ్చాయి.దీనిపై నిర్మాణ సంస్థ స్పందించింది. OTT గురించి ఇంకా ఆలోచించలేదు. ప్రస్తుతం థియెటర్లలో ఇంకా ఆడుతోందని తెలిపారు.

  • రేపే ‘ఘాటి’ ట్రైలర్ రిలీజ్

    క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్కశెట్టి నటిస్తున్న మూవీ ‘ఘాటి’. ఈ చిత్ర ట్రైలర్‌ను మూవీ టీం రేపు సాయంత్రం 4.45 గంటలకు మేకర్స్ విడుదల చేయనుంది.

  • ఓటీటీలోకి రాబోతున్న కామెడీ ఎంటర్‌టైనర్

    బలగం ఫేమ్ మురళీ ధర్, కేతిరి సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలో శంకర్ చేగూరి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘బద్మాషులు’. ఈ మూవీని తార స్టోరీ టెల్లర్స్ బ్యానర్‌పై బి. బాలకృష్ణ నిర్మించగా, డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్దమైంది. ‘బద్మాషులు’ మూవీకి సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకోగా ఆగస్టు 8 నుంచి ఫుల్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించనుంది.