TG: సినీ కార్మికుల వివాదంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. కార్మికుల డిమాండ్లపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందున్నారు. హైదరాబాద్‌లో బతకాలంటే సినీ వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఢిల్లీ పర్యటన అనంతరం సినీ కార్మికులతో మాట్లాడతానని తెలిపారు. సినిమాలకు సంబంధించి అంశాలన్నీ దిల్ రాజుకు అప్పగించామని వివరించారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
నాకు వర్తమానంలో బతకడమే ఇష్టం: ఎన్టీఆర్
తాను ఒక నటుడిగా సినిమా కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు. . తనకు వర్తమానంలో బతకడం ఇష్టమని, భవిష్యత్తు గురించి ఎలాంటి ప్రణాళికలు వేసుకోలేదని ఆయన చెప్పారు. తాను నటించే చిత్రాల ద్వారా తనను ప్రేక్షకులు గుర్తుంచుకోవాలని కోరుకుంటానని తెలిపారు. తన కుటుంబ వారసత్వం విషయంలో ఏం జరుగుతుందో తనకు తెలియదని, దాని కోసం ప్రత్యేకంగా ఎలాంటి ప్రణాళికలు లేవని స్పష్టం చేశారు.
-
అనుపమ ‘పరదా’ మూవీ.. సాంగ్ రిలీజ్
నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘పరదా’. ఈ సినిమా నుంచి ఇటీవల ‘ఎగరేయి నీ రెక్కలే’ అనే పాట లిరికల్ వీడియో విడుదలైంది. ఈ పాటను కార్తీక్ వేణుగోపాల్ స్వరపరిచారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, శ్రేయా ఘోషల్ ఆలపించారు. ఈ పాట విడుదలతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
-
మాస్ జాతర నుంచి.. లిరికల్ వచ్చేసింది
భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా, శ్రీలీల కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ‘ఓలే.. ఓలే..’ అంటూ సాగే లిరికల్ వీడియోను చిత్ర బృందం మంగళవారం విడుదల చేసింది. భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చిన ఈ పాటకు భాస్కర్ యాదవ్ దాసరి సాహిత్యం అందించారు.
-
ఆ రోజు బాధ కలిగింది: లోకేశ్ కనగరాజ్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కూలీ. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన రోజు తాను చాలా భావోద్వేగానికి గురయ్యానని లోకేశ్ కనగరాజ్ తెలిపారు. ఇంత పెద్ద సినిమాను, రజనీకాంత్ లాంటి గొప్ప నటుడితో తీస్తున్నప్పుడు, షూటింగ్ పూర్తవగానే ఒక బాధ కలిగినట్లు లోకేశ్ పేర్కొన్నారు. తన జీవితంలో ఇది మర్చిపోలేని అనుభూతి అని ఆయన అన్నారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది.
-
యంగ్ హీరో సంతోష్ కన్నుమూత
ప్రముఖ కన్నడ నటుడు సంతోష్ బాలరాజ్ (34) కన్నుమూశారు. ఈయన కొంతకాలంగా కాలేయం, మూత్రపిండాల్లో సమస్యల కారణంగా గత నెలలో జాండీస్ బారిన పడ్డాడు. తాజాగా పరిస్థితి విషమించి కోమాలోకి వెళ్లిపోయారు. బెంగళురూలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూశారు. ప్రముఖ నిర్మాత బాలరాజు కుమారుడైన సంతోష్ ‘కెంప’, ‘గణప’, ‘బర్కెలీ’, ‘సత్య’, ‘కరియా 2’ సినిమాల్లో హీరోగా నటించారు.
-
స్పిరిట్ షూటింగ్ మళ్లీ పోస్ట్‌పోన్
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమా సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుందని వార్తలు వచ్చాయి. తాజాగా ప్రీ-ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో షూటింగ్ వాయిదా పడింది. కథను పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దడానికి సందీప్ కృషి చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు ప్రభాస్ ‘రాజాసాబ్’, ‘ఫౌజీ’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ కారణాల వల్ల ‘స్పిరిట్’ షూటింగ్ 2025 డిసెంబర్‌లో లేదా 2026 జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
-
‘సైయారా’ రికార్డ్.. రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రం
బాలీవుడ్ సంచలనం ‘సైయారా’ వసూళ్లలో రూ.300 కోట్ల క్లబ్‌లోకి చేరింది. 18 రోజుల్లో ఈ చిత్రం రూ.302.25 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది.
-
ఫర్హాన్ అక్తర్ ‘120 బహదూర్’.. టీజర్ చూశారా?
బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ కీలక పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ వార్ మూవీ ‘120 బహదూర్’. మేజర్ షైతాన్ సింగ్ భాటి జీవిత కథ ఆధారంగా 1962 ఇండియా-చైనా యుద్ధం నేపథ్యంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో ఈ మూవీని రజనీష్(రాజీ) తీర్చిదిద్దుతున్నారు. రాశీఖన్నా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మూవీ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. నవంబరు 21న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు తెలిపింది.
-
‘మహాఅవతార్ నరసింహ’ మేకర్స్‌కు 450% ప్రాఫిట్
యానిమేటెడ్ చిత్రం ‘మహాఅవతార్ నరసింహ’ ప్రపంచవ్యాప్తంగా భారీ లాభాలు తెచ్చిపెడుతోంది. ఈ సినిమాను రూపొందించడానికి హోంబాలే ఫిల్మ్స్ సంస్ధ దాదాపు రూ.20 కోట్లు పెట్టుబడి పెటింది. జూలై 25న విడుదలైన ఈ సినిమా కేవలం పది రోజుల్లో రూ.110 కోట్లు వసూలు చేసింది. దీంతో నిర్మాతలు 450% లాభం పొందారు.