టాలీవుడ్‌లో మొట్ట మొదటిసారిగా ఒగ్గు కళాకారుల నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా ‘బ్రహ్మాండ’. ఆమని, బన్నీ రాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దాసరి సురేష్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈనెల 29న రిలీజ్ కాబోతుంది. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత దాసరి సురేష్ మాట్లాడుతూ.. ‘‘స్క్రిప్ట్ దశలో మేము అనుకున్నది అనుకున్నట్టుగా చిత్రీకరించాం. ముఖ్యంగా ఆమని, బలగం జయరాం, సహకారం మరవలేము’’ అని చెప్పారు.