Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ఫర్హాన్‌ అక్తర్‌ ‘120 బహదూర్‌’.. టీజర్‌ చూశారా?

    బాలీవుడ్‌ నటుడు ఫర్హాన్‌ అక్తర్‌ కీలక పాత్రలో నటిస్తున్న పీరియాడిక్‌ వార్‌ మూవీ ‘120 బహదూర్‌’. మేజర్‌ షైతాన్‌ సింగ్‌ భాటి జీవిత కథ ఆధారంగా 1962 ఇండియా-చైనా యుద్ధం నేపథ్యంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో ఈ మూవీని రజనీష్‌(రాజీ) తీర్చిదిద్దుతున్నారు. రాశీఖన్నా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మూవీ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. నవంబరు 21న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు తెలిపింది.

  • ‘మహాఅవతార్ నరసింహ’ మేకర్స్‌కు 450% ప్రాఫిట్

    యానిమేటెడ్ చిత్రం ‘మహాఅవతార్ నరసింహ’ ప్రపంచవ్యాప్తంగా భారీ లాభాలు తెచ్చిపెడుతోంది. ఈ సినిమాను రూపొందించడానికి హోంబాలే ఫిల్మ్స్ సంస్ధ దాదాపు రూ.20 కోట్లు పెట్టుబడి పెటింది. జూలై 25న విడుదలైన ఈ సినిమా కేవలం పది రోజుల్లో రూ.110 కోట్లు వసూలు చేసింది. దీంతో నిర్మాతలు 450% లాభం పొందారు.

  • హీరో సూర్య ఎమోషనల్ (VIDEO)

    తమిళ హీరో సూర్య స్థాపించిన ‘అగరం ఫౌండేషన్’కు 15 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్‌లో ఫౌండేషన్ ద్వారా వైద్యులుగా మారిన 51 మంది విద్యార్థులను చూసి సూర్య ఎమోషనల్ అయ్యారు. వారు మాట్లాడుతుంటే ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పటివరకు ఆయన 8వేల మంది విద్యార్థులను చదివించి ప్రయోజకులుగా మార్చారు. దీంతో ‘నువ్వు దేవుడివయ్యా’ అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.

  • మ్యాగజైన్ కవర్ పేజ్‌పై యంగ్ టైగర్

    ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ కవర్పేజీపై NTR ఫోటోను ప్రింట్ చేసింది. NTR తన మొట్టమొదటి మ్యాగజైన్ కవర్‌ను ఎస్క్వైర్ ఇండియాతో షేర్ చేసుకున్నాడు. ఇది ఐకానిక్‌గా ఉందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ మ్యాగజైన్ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఎస్క్వైర్ ఇండియా కవర్ పేజ్ ఫోటో షూట్‌ను దుబాయ్‌లో నిర్వహించారు. అందుకు సంబందించిన వీడియోను ఎస్క్వైర్ ఇండియా త్వరలో రిలీజ్ చేయనుంది .

  • దీపిక రికార్డు.. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక వ్యూస్

    బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకోణె ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన రికార్డు సృష్టించారు. ఆమె తన ఫోటోషూట్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేయగా దానికి ఏకంగా 1.9 బిలియన్ల (190 కోట్లు) వ్యూస్ వచ్చాయి. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యధిక వ్యూస్ సాధించిన రీల్‌గా రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు హరీక్ పౌండ్స్‌ (1.6 బిలియన్లు)పై ఉంది. ప్రస్తుతం దీపికకు ఇన్‌స్టాగ్రామ్‌లో 80 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

     

  • ఆషికా రంగనాథ్‌కు ‘విశ్వంభర’ టీమ్ విషెస్

    డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ‘విశ్వంభర’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు హీరోయిన్ ఆషికా రంగనాథ్‌ నటిస్తున్నారు. ఇవాళ ఆషికా బర్త్ డే సందర్భంగా విశ్వంభర టీమ్.. ఆమెకు విషెస్ తెలిపింది. మెగా మాస్ యూనివర్స్ త్వరలోనే థియేటర్లకు రానుందని పేర్కొంది. ఈ మేరకు ట్వీట్ చేసింది.

  • ధనుష్-మృణాల్ డేటింగ్‌లో ఉన్నారా?

    కోలీవుడ్ నటుడు ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్‌లో ఉన్నారని రూమర్స్ వస్తున్నాయి. ఇటీవల మృణాల్ పుట్టినరోజు వేడుకల్లో ధనుష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీంతో వారిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని బాలీవుడ్ మీడియా కథనాలు రాస్తోంది. ఈ వార్తలపై వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు.  అయితే, ధనుష్ తన భార్య ఐశ్వర్యతో పెళ్లై, ఇటీవల విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

  • ‘వార్‌ 2’ లవ్‌ సాంగ్‌కు స్టెప్‌ వేస్తూ..

    హృతిక్‌ రోషన్‌, NTR ప్రధాన పాత్రల్లో రానున్న చిత్రం ‘వార్‌ 2’. ఇటీవల ఈ సినిమా నుంచి ‘ఊపిరి ఊయలగా’ అనే లవ్‌ సాంగ్‌ విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా హృతిక్‌ తల్లి పింకీ రోషన్‌ ఈ పాట హుక్‌ స్టెప్‌ను ప్రాక్టీస్‌ చేశారు. ఈ వీడియోను పంచుకున్న హృతిక్‌.. ‘మన పాటకు అమ్మ డ్యాన్స్‌ చేసిందంటే.. సూపర్‌ హిట్ అని అర్థం. అద్భుతంగా చేశావ్‌ అమ్మా.. లవ్‌ యూ’అంటూ తన ప్రేమను వ్యక్తంచేశారు.

     

  • ఓజీ పాటతో కేక్‌ కట్‌ చేస్తూ..

    పవన్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓజీ’. ఈ సినిమాకు తమన్‌ స్వరాలు అందించిన విషయం తెలిసిందే. తాజాగా ఇందులోని ‘ఫైర్‌స్టార్మ్‌…’ గీతాన్ని విడుదల చేయగా అది ఫ్యాన్స్‌కు అమితంగా నచ్చేసింది. తమన్‌ వాళ్ల అమ్మ కూడా ఈ పాటను పాడుతూ కేక్‌ కట్‌ చేశారు. ఈ వీడియోను పంచుకున్న నిర్మాణ సంస్థ.. ‘ఓజీ’ ట్యూన్‌కు బిగ్గెస్ట్‌ ఫ్యాన్‌ అని రాసుకొచ్చింది.

  • సోషల్ మీడియాకు దూరంగా స్టార్ హీరో

    గత కొద్దిరోజులుగా తాను సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంటున్నట్లు నటుడు హృతిక్ రోషన్ తెలిపారు. ‘‘నిరంతరం ఆన్‌లైన్‌లో ఉండటం వల్ల కలిగే నష్టాలను నేను అర్థం చేసుకున్నాను. నేను అందరికీ ఇచ్చే ఒక సలహా ఏమిటంటే కనీసం ఒక వారం పాటు సోషల్ మీడియా డిటాక్స్‌కు ప్రయత్నించండి. నాలో ఏదో మార్పు వచ్చింది. అది నాకు జ్ఞానోదయం కలిగించింది’’ అని పేర్కొన్నారు.