Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘టీవీ నటులకు నేషనల్ అవార్డులు ఇవ్వాలి’

    టెలివిజన్ నటులకు జాతీయ అవార్డులు ఇవ్వాలని ‘అనుపమ’ నటి రుపాలీ గంగూలీ డిమాండ్ చేశారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘సినిమా నటుల నుండి కంటెంట్ క్రియేటర్ల వరకు అందరికీ జాతీయ అవార్డులు ఉన్నాయి. కానీ టీవీ కళాకారులకు ఏమీ లేదు. కొవిడ్ సమయంలోనూ మేము పనిచేస్తూనే ఉన్నాం. ప్రభుత్వం మమ్మల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

     

  • ‘వార్-2’vs‘కూలీ’: భారీ వసూళ్లు చేసేదెవరో?

    ఈ నెల 14న విడుదల కానున్న ‘వార్-2′, కూలీ’ సినిమాలపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. ‘వార్-2’లో హృతిక్, NTR… ‘కూలీ’లో రజినీకాంత్ నటించారు. దీంతో ఈ చిత్రాలు కొంచెం హిట్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించే అవకాశముంది. మరి ‘వార్-2’, ‘కూలీ’లో ఏ సినిమా భారీగా వసూళ్లు చేస్తుందో కామెంట్ చేయండి?

     

  • 21 రోజుల నుంచి ఒక్క సిగరెట్ కూడా కాల్చలేదు: నటుడు

    ‘పంచాయత్‌’తో ప్రసిద్ధి చెందిన నటుడు ఆసిఫ్ ఖాన్.. తాను గత 21 రోజులుగా ఒక్క సిగరెట్ కూడా కాల్చలేదని తెలిపారు. గత నెలలో గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి కారణంగా ఆస్పత్రి పాలైన ఆసిఫ్.. ఇప్పుడు కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘‘21 రోజుల్లో ఒక అలవాటుకు దూరమైతే అది శాశ్వతంగా దూరమవుతుందని అంటారు. నేను ధుమపానం మానేసి 21 రోజులైంది. దీని కంటే మంచి రోజు ఏం ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

  • విడాకులు తీసుకోనున్న హన్సిక?

    ప్రముఖ నటి హన్సికా మోత్వానీ తన భర్త సోహేల్‌తో విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి హన్సిక తమ పెళ్లి ఫోటోలను డిలీట్ చేశారు. దీంతో ఆమె వివాహంలో సమస్యలు తలెత్తుతాయని, వారిద్దరూ విడాకులు తీసుకోనున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే సోహెల్ నుంచి హన్సిక దూరంగా వెళ్లి తన తల్లితో నివసిస్తోందని తెలుస్లోంది.

  • చిత్ర పరిశ్రమలో కార్మికుల సమ్మె.. కొత్త వారి కోసం నోటిఫికేషన్‌

    HYD : టాలీవుడ్‌లో సమ్మె సైరన్ మోగడంతో తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (TFCC)ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 22 విభాగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అందులో ఎడిటింగ్‌, మేకప్‌, కాస్ట్యూమ్స్‌, ప్రొడక్షన్‌, ఆర్ట్‌ వర్క్‌, కొరియోగ్రఫీ వంటివి కూడా ఉన్నాయి. ఆసక్తి వున్న వారు ధరఖాస్తు Atfpg.com లో చేసుకోవచ్చు.

  • ప్రముఖ నటుడు కన్నుమూత

    ప్రముఖ మలయాళ నటుడు, లెజెండరీ ఫిల్మ్ ఐకాన్ ప్రేమ్ నజీర్ కుమారుడు షానవాస్ (71) కన్నుమూశారు. మూత్రపిండాల సంబంధిత వ్యాధులకు తిరువనంతపురంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 5న పాళయం ముస్లిం జమాత్ స్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. షానవాస్ తన కెరీర్‌లో 50కి పైగా చిత్రాలలో పనిచేశారు.

  • నేను, సందీప్‌ వంగా ఒక్కటే: వివేక్‌ అగ్నిహోత్రి

    తనను సందీప్‌వంగాతో పోల్చుకున్నారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. ఇండస్ట్రీలో తామిద్దరికీ ఎలాంటి భయం లేదన్నారు. ప్రపంచంలో జరిగే వాటిని మాత్రమే తాము సినిమాల్లో చూపిస్తామని తెలిపారు.

  • మాటిస్తే నిలబెట్టుకుంటారు: పవన్‌పై హరీశ్ శంకర్ ప్రశంసలు

    పవన్ కల్యాణ్, హరీశ్‌ శంకర్ కాంబోలో రానున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఈ మూవీకి సంబంధించి పవన్ కల్యాణ్‌తో షూటింగ్ పూర్తయినట్లు తాజాగా హరీశ్ ప్రకటించారు. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో పవర్‌ స్టార్‌ పవన్ ‘‘మాటిస్తే నిలబెట్టుకుంటారు. మాట మీదే నిలబడతారు. మీరు పక్కనుంటే కరెంటు పాకినట్టే. ఈరోజు ఎప్పటికీ గుర్తుంటుంది’’ అంటూ పవన్‌తో తీసుకున్న ఫొటోను షేర్‌ చేశారు.

  • సినీ కార్మికుల వేతన పెంపును వ్యతిరేకించిన టీఎఫ్‌సీసీ

    TG: సినీ కార్మికుల వేతన పెంపును నిర్మాతలు వ్యతిరేకించారు. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (TFCC) ఈ విషయాన్ని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. 30% వేతన పెంపు కోరుతూ, అది ఇచ్చే నిర్మాతల సినిమాలకు మాత్రమే వెళ్లాలని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ తీసుకున్న నిర్ణయంపై TFCC ఈ ప్రకటన చేసింది. ఫెడరేషన్‌, ఛాంబర్‌ మధ్య వేతన పెంపుపై కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి.

     

  • సిరాజ్‌పై దర్శకుడు రాజమౌళి ప్రశంసలు

    ఇంగ్లండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత చివరి టెస్టులో టీమిండియా సంచలన విజయం సాధించడంపై దర్శకుడు రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్ మహమ్మద్ సిరాజ్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. టెస్ట్ క్రికెట్ ఫార్మాట్‌కు ఏదీ సాటిరాదని అభిప్రాయపడ్డారు. ఈ మ్యాచ్‌లో మహమ్మద్ సిరాజ్ 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు.