‘రాంఝనా’ సినిమా ఏఐ క్లైమాక్స్ విషయంలో ధనుష్ చేసిన వ్యాఖ్యలపై ఇరోస్ ఇంటర్నేషనల్ సంస్థ స్పందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో క్లైమాక్స్ మార్పు గురించి తమ ప్రతినిధి.. ధనుష్ టీమ్‌ను నేరుగా సంప్రదించిందని, అయితే విడుదలకు ముందు వారు అభ్యంతరం తెలపలేదని పేర్కొంది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘SSMB29’పై మరో క్రేజీ అప్‌డేట్?
రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ‘SSMB29’ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై మరో క్రేజీ గాసిప్ వినిపిస్తోంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ మొత్తం ఓ లోయలో జరుగుతుందని.. ముఖ్యంగా ఫారెస్ట్ విజువల్స్ అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. లోయ లోపల చేసే ఛేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్‌లో ఉంటుందట సమాచారం. కాబట్టి ఇది ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఉండబోతుంది.
-
ఏకంగా 800 శాతం లాభాలు తెచ్చిన మూవీ
కన్నడలో రీసెంట్‌గా విడుదలైన ‘సు ఫ్రమ్ సో’ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి పెట్టిన బడ్జెట్ కేవలం రూ.3 కోట్లు. అయితే ఇప్పటికే రూ.40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఈ లెక్కన నెట్ కలెక్షన్స్ రూ.30 కోట్లు ఉంటాయి. అంటే ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్‌కు ఏకంగా 848 శాతం మేర వసూళ్లు రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలను అందించింది.
-
హాట్ హాట్‌గా ‘డీజే టిల్లు’ బ్యూటీ!
హీరోయిన్ నేహాశెట్టి తాజాగా హాట్ లుక్‌లో దర్శనమిచ్చి కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. నెట్టింట షేర్ చేసిన ఈ ఫొటోలో ఆమె గ్రీన్ కలర్ డ్రెస్‌లో ఆకట్టుకుంటోంది.
-
అనుపమ ‘పరదా’ నుంచి మరో సాంగ్
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘పరదా’. ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడు. ఇందులో దర్శన రాజేంద్రన్, నటి సంగీత కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలోని థర్డ్ సాంగ్ ‘ఎగరేయి నీ రెక్కలే’ లిరికల్ వీడియో రేపు. సా.5 గంటలకు రాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. సోషియో డ్రామాగా రూపొందిన ‘పరదా’ పాన్ ఇండియా రేంజ్‌లో ఈనెల 22న థియేటర్స్‌లోకి రాబోతుంది.
-
ఫారియా అందాలకు కుర్రకారు ఫిదా!
‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫారియా అబ్దుల్లా తాజాగా సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో ఆమెను చూసిన కుర్రకూరు ఫిదా అయిపోతున్నారు.
-
ఓటీటీలోకి మరో థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయడంతో చర్చనీయాంశమైన సినిమాల్లో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ ఒకటి. ఎట్టకేలకు జులై 17న బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి రాబోతోంది. థియేటర్లలో మలయాళంలోనే విడుదలైన ఈ సినిమా ఈ నెల 15 నుంచి ‘జీ 5’లో మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
-
అనుష్క ‘ఘాటి’పై క్రేజీ అప్‌డేట్!
క్రిష్ డైరెక్షన్‌లో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఘాటి’. ఈ మూవీ ట్రైలర్, రిలీజ్ డేట్ ఆగస్టు 6న ప్రకటించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
-
‘గరివిడి లక్ష‍్మి’ సాంగ్ రిలీజ్.. ఆనంది అదిరిపోయే స్టెప్పులు!
ఆనంది, రాగ్ మయూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గరివిడి లక్ష‍్మి’. జమ్ము నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ త్వరలో థియేటర్లలోకి రానుంది. తాజాగా సినిమాలోని ‘నల జీలకర్ర మొగ్గ’ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను అనన్య భట్, జానకీరామ్, గౌరీనాయుడు ఆలపించగా..చరణ్ అర్జున్ సంగీతం అందించాడు. ఇందులో ఆనంది అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంది.
-
ఉమ్మితో మొటిమలు పోతాయి.. తమన్నా చిట్కా!
మిల్క్‌బ్యూటీ తమన్నా మొటిమల నివారణకు ఓ సహజ సిద్ధమైన చిట్కా చెప్పింది. ‘ఉమ్మితో మొటిమలను నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఉదయాన వచ్చే ఉమ్మితో పింపుల్స్ సమస్య నుంచి ఎంచక్కా బయటపడొచ్చు. దీని వెనక సైన్స్ ఉంది. ఎలా అంటే.. మనం ఉదయం నిద్ర లేవగానే మన నోట్లోని సలైవా(ఉమ్మి)లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అవి మొటిమలతో పోరాడతాయి’’ అని ఆమె వివరించింది.