తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. యూనియన్స్‌తో సంబంధం లేకుండా సాంకేతిక నిపుణులను, సినీ కార్మికుల్ని పనిలోకి తీసుకోవాలని వారు తీర్మానించారు. వేతనాల పెంపు డిమాండ్లతో కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీనివల్ల షూటింగ్‌లు నిలిచిపోయి పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లునుంది. యూనియన్లతో చర్చలు విఫలమవడంతో, నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
మూవీ షూటింగ్స్‌పై TFCC కీలక నిర్ణయం
సినీ కార్మికుల వేతన పెంపును నిర్మాతలంతా వ్యతిరేకించారని టీఎఫ్‌సీసీ తెలిపింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కార్మికుల వేతనాల పెంపుపై ఫిల్మ్ ఫెడరేషన్-ఫిల్మ్ ఛాంబర్ మధ్య కొన్నిరోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాము కోరినట్టుగా 30 శాతం వేతనం పెంచి ఇచ్చిన నిర్మాతల సినిమాల షూటింగ్స్‌కే వెళ్లేలా ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయంపై చర్చల అనంతరం టీఎఫ్‌సీసీ ప్రకటన విడుదల చేసింది.
-
యోగిబాబుపై బ్రహ్మానందం ఆసక్తికర కామెంట్స్!
హైదరాబాద్‌లో నిర్వహించిన ‘గుర్రం పాపిరెడ్డి’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నటుడు యోగిబాబుపై బ్రహ్మానందం ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘కోలీవుడ్‌లో యోగిబాబుకు ఎంతో క్రేజ్ ఉంది. ఆయన హీరోగా చేసిన ఓ కన్నడ సినిమాలో నేనూ నటించా. చాలా సైలెంట్‌గా ఉంటారాయన. కామెడీ చేసే వ్యక్తిలా కనిపించరు. కానీ, కామెడీని మరోస్థాయికి తీసుకెళ్లగలరు’’ అని కొనియాడారు. ఈ మూవీలో యోగిబాబు, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించారు.
-
‘DQ41’కు క్లాప్ కొట్టిన హీరో నాని
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ‘DQ41’ మూవీ నేడు ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా డైరెక్టర్స్ ఓదెల శ్రీకాంత్, బుచ్చిబాబు సనా, హీరో నాని హాజరయ్యారు. ఫస్ట్ ముహూర్తనికి నాని క్లాప్ కొట్టాడు. ప్రేమకథ చిత్రంగా తెరకెక్కుతోన్న ‘DQ41’కు రవి నెలకుదిటి దర్శకత్వం వహిస్తుండగా.. SLV సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. దీనికి జీవి ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు.
-
ఆసక్తిగా ‘సు ఫ్రమ్ సో’ మూవీ ట్రైలర్
చిన్న సినిమాగా రిలీజై రీసెంట్‌గా కన్నడలో ‘సు ఫ్రమ్ సో’.. బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ అందుకుంటోంది. దీన్ని ఇప్పుడు తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 8న రిలీజ్‌కానుంది. తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫన్నీగా ఉంటూనే ఈ హారర్ సినిమా ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన జేపీ తుమినాడ్.. దర్శకత్వం కూడా వహించాడు.
-
‘రోమియో’.. ఆ పాత్రలో తమన్నా!
విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో షాహిద్ కపూర్ హీరోగా త్వరలో ‘రోమియో’ చిత్రం పట్టాలెక్కనుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో మిల్క్‌బ్యూటీ తమన్నా భాటియా కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఆమె పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా.. కథను మలుపు తిప్పేదిగా ఉండబోతోందని తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ‘రోమియో’లో తృప్తి డిమ్రి, నానా పటేకర్, రణ్‌దీప్ హుడా నటించనున్నట్లు తెలుస్తోంది.
-
కోడలుకు మెగాస్టార్ విషెస్.. స్పెషల్ పోస్ట్!
తన కోడలు ఉపాసనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర స్పోర్ట్స్ హబ్‌కు కో-ఛైర్‌పర్సన్‌గా తెలంగాణ ప్రభుత్వం ఉపాసనను నియమించింది. ఈ క్రమంలో చిరంజీవి పోస్ట్ పెట్టారు. ‘‘మా కోడలు ఉపాసన ఇప్పుడు తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌కు కో-ఛైర్‌పర్సన్. ఆమెను గౌరవప్రదమైన ఈ పదవిలో నియమించడం సంతోషంగా ఉంది. ఇది గౌరవం అనడం కన్నా కూడా బాధ్యతను మరింత పెంచిందని చెప్పాలి’’ అని పేర్కొన్నారు.
-
నవ్వులు పూయించిన బ్రహ్మానందం స్పీచ్
తనదైన శైలిలో మాట్లాడుతూ నటుడు బ్రహ్మానందం తెర వెనుక నవ్వులు పంచుతుంటారు. సినిమాల వేడుకలైతే మరీ సరదాగా ఉంటారు. సోమవారం నిర్వహించిన ‘గుర్రం పాపిరెడ్డి’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన మరోసారి తన మార్క్ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా హీరో- హీరోయిన్లుగా దర్శకుడు మురళీ మనోహర్ తెరకెక్కిస్తున్న మూవీ ‘గుర్రం పాపిరెడ్డి’.
-
అడివి శేష్ ‘G2’ రిలీజ్ డేట్ ఫిక్స్!
అడివి శేష్-వామికా గబ్బి జంటగా వినయ్ కుమార్ సిరిగినీడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘G2’. ఈ సినిమా మే1 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.
-
‘గుర్రం పాపిరెడ్డి’ టీజర్.. నవ్వులే నవ్వులు!
నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా దర్శకుడు మురళీ మనోహర్ తెరకెక్కించిన చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. బ్రహ్మానందం, యోగిబాబు రాజ్‌కుమార్ కసిరెడ్డి లాంటి కమెడియన్లు కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ అద్యంతం నవ్వులు పూయించేలా ఉంది.